Telangana: ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయండి..
Telangana ( Image Source: Twitter)
Telangana News

Telangana: ప్రైవేటుతో ఎలక్ట్రిక్ బస్సుల ఒప్పందం రద్దు చేసుకోవాలి.. సీఎంకు ఆర్టీసీ ఎంప్లాయిస్ లేఖ

Telangana: ప్రభుత్వం మరో 2000 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకు రావడానికి ప్రైవేట్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, ఆర్టీసీశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ యాజమాన్యానికి బుధవారం లేఖ రాసింది. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.బాబు, ఈదురు వెంకన్న మాట్లాడుతూ విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని ఆరోపించారు.

Also Read: Pregnancy Yoga tips: గర్భిణి స్త్రీలు యోగా చేస్తే ఏమవుతుంది.. ఏ జాగ్రత్తలు పాటించాలి.. ఓ లుక్కేయండి!

ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయండి..

ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ప్రైవేట్ విద్యుత్ బస్సులను భవిష్యత్తులో బలవంతంగా ఆర్టీసికి తీసుకొస్తే పెద్దయెత్తున కార్మికోద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఆర్టీసీ బస్సులతో కాలుష్యం కేవలం 0.09 శాతం మాత్రమేనని, మిగిలిన కాలుష్యమంతా ఇతర వాహనాలతోనే వస్తోందన్నారు. కాలుష్యం పేరుతో కార్పొరేట్ శక్తులకు సబ్సిడీ ఇచ్చి, బస్సులను తయారు చేయడం కార్పొరేట్ రంగాన్ని బలోపేతం చేసి, ఆర్టీసీలను నిర్వీర్యం చేయడమే అని మండిపడ్డారు.

Also Read: Ariyana Glory: బెడ్ రూమ్ లో మా బావ మరో అమ్మాయితో అలాంటి పని.. చూసి బ్రేకప్ చెప్పా.. బిగ్ బాస్ బ్యూటీ

కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉన్న బస్ బాడీ బిల్డింగ్ యూనిట్లకు సబ్సిడీ ఇచ్చే బదులు, అదే సబ్సిడీలు ఆర్టీసిలకిచ్చి వారి బాడీ బిల్డింగ్ యూనిట్లలో ఎలక్ట్రిక్ బస్సులు తయారయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే 600 ఎలక్ట్రిక్ బస్సులు తెలంగాణ ఆర్టీసీలో అద్దెబస్సులుగా రావడంతో కొన్ని డిపోలు, గ్యారేజీలు ప్రైవేట్ సంస్థలకు అప్పగించారని, దీంతో ఆ డిపోల నుంచి వందలాది మంది సిబ్బంది బలవంతంగా బయటికి గెంటివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:  Kota Srinivasa Rao: చనిపోయే ముందు ఆ స్టార్ హీరోకి మర్చిపోలేని సాయం చేసిన కోట శ్రీనివాసరావు?

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం