Chandrababu: రాష్ట్రాల మూలధన పెట్టుబడులకు అందించే ఆర్ధిక సాయం పథకం సాస్కి(SASCI) కింద 2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా రూ.10,000 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. బుధవారం రెండో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా నిర్మలతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక సహాయం కోరుతూ వినతిపత్రం అందించారు. 16వ ఆర్థిక సంఘానికి రెవెన్యూ లోటును భర్తీ చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వినతిని అంగీకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. విభజన కారణంగా రాష్ట్రం ఇప్పటికీ ఆర్ధిక వనరుల లోటును ఎదుర్కొంటోందని ముఖ్యమంత్రి వివరించారు.
Also Read- Telangana: ప్రైవేటుతో ఎలక్ట్రిక్ బస్సుల ఒప్పందం రద్దు చేసుకోవాలి.. సీఎంకు ఆర్టీసీ ఎంప్లాయిస్ లేఖ
అమరావతికి రెండో విడత సాయం
అమరావతి నిర్మాణానికి మొత్తం రూ.79,280 కోట్ల నిధులు అవసరం కాగా, ప్రస్తుతం రూ.44,351 కోట్ల విలువైన పనులు ప్రారంభించామని నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి తెలిపారు. వీటికి సంబంధించి ఇప్పటికే రూ.26,000 కోట్ల నిధులు సమీకరించనట్టు వెల్లడించారు. రాజధాని నిర్మాణానికి ఇంకా నిధుల అవసరం ఉందని కేంద్ర ఆర్ధిక మంత్రికి వివరించారు. అమరావతికి రెండో విడతగా ఇచ్చే నిధులను గ్రాంటు రూపంలో ఇవ్వాలని కోరారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తున్న కేంద్రానికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ నిధులు ఎప్పుడొస్తాయో ఏంటో మరి!
Also Read- Ariyana Glory: బెడ్ రూమ్ లో మా బావ మరో అమ్మాయితో అలాంటి పని.. చూసి బ్రేకప్ చెప్పా.. బిగ్ బాస్ బ్యూటీ
నివేదిక విడుదల
స్వర్ణాంధ్ర 2047 సాకారం అయ్యేందుకు భవిష్యత్ ప్రణాళికగా ఏపీ ఆర్ధిక, పారిశ్రామిక అభివృద్ధి నివేదికను చంద్రబాబు ఆవిష్కరించారు. బుధవారం ఢిల్లీలో సీఐఐ నిర్వహించిన సమావేశంలో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ ఈ నివేదికను ముఖ్యమంత్రికి అందించింది. మొత్తం 120 సిఫార్సులను పొందుపరచిన ఈ నివేదికను టాస్క్ ఫోర్సు బృందం రూపొందించింది. మొత్తం 17 రంగాలకు సంబంధించి అమలు చేయాల్సిన సిఫార్సులను టాస్క్ ఫోర్సు ఇందులో నివేదించింది. మరోవైపు ఏపీలో వచ్చే పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్కార్టు సర్వీసులు అందిస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టిన పెట్టుబడులను రాష్ట్ర ప్రాజెక్టుగా భావించి ప్రభుత్వం చేయూత అందిస్తుందని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మూడు ఆర్ధిక కారిడార్లలో ఆయా రంగాలకు చెందిన పరిశ్రమల్ని ప్రోత్సహించేందుకు అనుకూలంగా విధానాలు రూపొందించామని అన్నారు. విజన్ 2020 పేరిట తాను ఆవిష్కరించిన అభివృద్ధి ప్రణాళిక వాస్తవ రూపం దాల్చి ఫలితాలు చూస్తున్నామని అన్నారు. ప్రస్తుతం స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించి రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు చేశామని వెల్లడించారు.
Read Also- Viral News: తండ్రి చనిపోయి వర్క్‌ఫ్రమ్ హోం అడిగితే.. మేనేజర్ ఏమన్నాడంటే?
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు