BC Reservation Bill: రిజర్వేషన్ల పై గవర్నర్‌కు ఆర్డినెన్స్ పంపడం బీసీల చెవుల్లో పూలు పెట్టడమేనని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivass Goud) అన్నారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. న్యాయకోవిదుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపడం దురదృష్టకరం అన్నారు. 2015 డిసెంబర్ లో కేసీఆర్ పాలన లో తెచ్చిన ఆర్డినెన్స్ కు సవరణ చేస్తూ మరో ఆర్డినెన్స్ ను గవర్నర్(Governor) కు పంపారన్నారు. అసెంబ్లీ లో పాస్ చేసిన బిల్లును గవర్నర్ ద్వారా రాష్ట్రపతి కి పంపారన్నారు. రాష్ట్రపతి కి పంపిన బిల్లు పెండింగ్ లో ఉండగానే గవర్నర్ దగ్గరకు అదే అంశం పై ఆర్డినెన్స్ పంపారన్నారు. ఆర్డినెన్స్ పంపే ముందు న్యాయ కోవిదులు , బీసీ నాయకుల సలహాలు తీసుకోరా ? రాష్ట్రపతి కి బిల్లు పంపి ఒక్కసారైనా ఆమోదించమని కలిసి అడిగారా? అని ప్రశ్నించారు. కేసీఆర్(KCR) ఆర్డినెన్స్ తెస్తే హై కోర్టు(High Cort), సుప్రీం కోర్టులు కొట్టేశాయన్నారు.
ఆర్డినెన్స్ తేవడం మోసం
బీసీలు అంత తెలివితక్కువ వాళ్ళు, చదువుకోని వాళ్ళు అని ఈ కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అనుకుంటుందా? తమిళ నాడు తరహాలో తొమ్మిదో షెడ్యూల్ లో రిజర్వేషన్లను చేర్చడం తప్ప మరో మార్గం లేదన్నారు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే పశు సంవర్ధక శాఖ మంత్రి శ్రీహరికి రెవెన్యూ శాఖ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కీలక శాఖలు ఇవ్వాలన్నారు. వివాదాలు లేకుండా రిజర్వేషన్లు పెంచే అవకాశం ఉండగా రాష్ట్ర ప్రభుత్వం కావాలనే న్యాయ చిక్కులను కొని తెచ్చుకుంటోందని ఆరోపించారు. బిల్లు(Bill) పెండింగ్ లో ఉండగా ఆర్డినెన్స్ తేవడం మోసం తప్ప మరొకటి కాదన్నారు. ఈ నెల 21 నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి .ఢిల్లీకి అఖిల పక్షం తీసుకెళ్లి బీసీ బిల్లు ఆమోదం కోసం ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. బీసీ(BC)లకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, తొందరపడి తప్పుడు మార్గంలో వెళితే అది బీసీల పాలిట ద్రోహం అవుతుందన్నారు.
Also Read: Warangal Suicide Case: డాక్టర్ ప్రత్యూష మృతికి కారణం వాళ్లే.. నలుగురి అరెస్ట్
బీసీల ఓట్లు తీసుకుని మోసం
ఆర్డినెన్స్ పై ఎవరూ కోర్టు కు వెళ్లవద్దని బీజేపీ ఎంపీ ఆర్ .కృష్ణయ్య అంటున్నారని, కోర్టులకు వెళ్లకుండా ఎవర్ని ఆపగలం? కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఆర్డినెన్స్ లను కోర్టులు కొట్టేశాయని తెలిపారు. ఎంపీ వద్ది రాజు రవి చంద్ర మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్(Kamareddy Declaration) లో అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా బీసీ(BC)లను మోసం చేసిందన్నారు. బీసీల ఓట్లు తీసుకుని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ కి గుణపాఠం తప్పదన్నారు. కాంగ్రెస్(Congress) కు చిత్త శుద్ధి ఉంటే ఢిల్లీ(Delhi) లో ఒత్తిడి పెంచాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు, బీఆర్ఎస్ నేతలు కె. కిషోర్ గౌడ్, నందికంటి శ్రీధర్ పాల్గొన్నారు.
Also Read: Medak District: కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు అనీల్ దారుణ హత్య