Uppal Flyover (imagecredit:swetcha)
హైదరాబాద్

Uppal Flyover: దసరా నాటికి ఉప్పల్‌ ఫ్లై ఓవర్‌ ప్రారంభం.. మంత్రి కోమటిరెడ్డి

Uppal Flyover: వచ్చే దసరానాటికి ఉప్పల్(Uppal) ఎలివేటెడ్ కారిడర్ ఫ్లై ఓవర్ ప్రారంభిస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Min Komati Reddy Venkat Reddy) అన్నారు. ప్రభుత్వం విప్ బీర్ల ఐలయ్య(Berla Ilahaiaa), ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Laxama Reddy)తో కలిసి ఆయన ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాదగిరిగుట్ట భువనగిరి(Bhuvanagiri) వరంగల్(Warangal) హైవేపై దాదాపు 8 సంవత్సరాల కిందట ప్రారంభించిన ఫ్లైఓవర్ పనులు ఆర్థిక వనరులు, ఇతరత్ర కారణాలతో తీవ్ర జాప్యం జరిగిందన్నారు.

తార్నాక నుంచి నారపల్లి వరకు
తమ ప్రభుత్వం రాగానే ఫ్లైఓవర్(Flyover) పై ప్రత్యేక దృష్టి సారించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి(Minister Nitin Gadkari)తో చర్చలు జరిపి, పనుల్లో వేగం పెంచామన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మొన్నటి వరకు పనులు నిర్వహించిన కాంట్రాక్టర్‌ను సైతం మార్చి కొత్తవారికి పనులు అప్పగించామన్నారు. తార్నాక నుంచి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, గురువారం సంబంధిత అధికారులతో సమీక్షా నిర్వహించనున్నామని తెలిపారు. ప్యాచ్‌ వర్క్‌లను కూడా త్వరలో పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. నగరంలో పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే తర్వాత అతిపెద్ద ఫ్లైఓవర్ ఇదే అన్నారు. వచ్చే దసరా నాటికి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పారు.

Also Read: Tummala Nageswara Rao: సిద్దిపేటలో ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీ ప్రారంభం.. మంత్రి తుమ్మల

 

 

 

Just In

01

Wine Shop Lottery: నేడే మద్యం షాపులకు లక్కీ డ్రా.. ఆశావహుల్లో ఉత్కంఠ

Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు?

DSP Bribery Case: ఏసీబీలో కలకలం రేపుతున్న డీఎస్పీ వసూళ్ల వ్యవహారం

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?