NASA’s Parker Solar: అద్భుతం.. సూర్యుడ్ని అతి దగ్గరగా చూస్తారా!
NASA’s Parker Solar (Image Source: Twitter)
Viral News, లేటెస్ట్ న్యూస్

NASA’s Parker Solar: మహా అద్భుతం.. సూర్యుడ్ని అతి దగ్గరగా చూస్తారా.. కొత్త చిత్రాలు వచ్చాయోచ్!

NASA’s Parker Solar: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA).. సూర్యగోళంపై గత కొంతకాలంగా పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. పార్కర్ సోలార్ ప్రోబ్ (Parker Solar Probe) సాయంతో ఈ అధ్యయనం చేస్తోంది. అయితే తాజాగా నాసా అంతరిక్ష రంగంలో అరుదైన మైలురాయిని అందుకుంది. సూర్యుడి వాతావరణానికి సంబంధించి అత్యంత సమీప చిత్రాలను పార్కర్ సోలార్ ప్రోబ్ ద్వారా చిత్రీకరించింది. సూర్యూడికి అతి దగ్గరగా 3.8 మిలియన్ మైళ్ల దూరం (3.8 million miles) నుండి దానిని రికార్డ్ చేసింది. అంతరిక్షంలో ఒక మానవ నిర్మిత వస్తువు.. సూర్యుడికి అంత దగ్గరగా వెళ్లడం ఇదే తొలిసారని నాసా సైంటిస్టులు తెలిపారు.

సూర్యుడి బాహ్య వాతావరణం రికార్డ్

నాసా (NASA)కు సంబంధించిన పార్కర్ సోలార్ ప్రోబ్.. తన వైడ్-ఫీల్డ్ ఇమేజర్ ఫర్ సోలార్ ప్రోబ్ (Wide Field Imager for Solar Probe -WISPR) అనే కెమెరాతో సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాను చిత్రీకరించింది. ఈ చారిత్రాత్మక సంఘటన డిసెంబర్ 24, 2024 జరగ్గా.. అందుకు సంబంధించిన దృశ్యాలను నాసా తాజాగా పంచుకుంది. అందులో సౌర గాలి (Solar Wind), కరోనల్ మాస్ ఎజెక్షన్స్ (coronal mass ejections – CMEs) స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. సౌరగాలిని సూర్యుడి నుండి విడుదలయ్యే ఎలక్ట్రికల్‌ కణాల స్థిరమైన ప్రవాహంగా శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ఇది సౌర వ్యవస్థ అంతటా గంటకు 1 మిలియన్ మైళ్ల వేగంతో ప్రవహిస్తుంటుంది. కాగా తాజా చిత్రాలు కెల్విన్-హెల్మ్‌హోల్ట్జ్ ఇన్‌స్టబిలిటీస్ వంటి అరుదైన విషయాలను బహిర్గతం చేశాయి.

కొత్త అవకాశాలు

సూర్యుడికి సంబంధించి పార్కర్ సోలార్ ప్రోబ్ అందించిన తాజా సమాచారం.. స్పేస్ వెదర్ ఫోర్ కాస్టింగ్ ను మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు సాయపడుతుందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూమిపైన ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థలు, విద్యుత్ గ్రిడ్లు, ఉపగ్రహాలపై సౌర కార్యకలాపాల ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి కీలకంగా మారనున్నాయని పేర్కొన్నారు. అంతేకాదు అంతరిక్ష వాతావరణం నుంచే సంభవించే విపత్తులను నేరుగా గమనించేందుకు అవకాశాన్ని కల్పించాయని నాసా సైన్స్ మిషన్ డైరెక్టరేట్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ నిక్కీ ఫాక్స్ అన్నారు.

Also Read: Society for Social Auditl: సోషల్ ఆడిట్‌కు సహకరించని అధికారులు.. పంచాయతీ రాజ్ ససేమిరా!

చారిత్రాత్మక అద్భుతం

ఇదిలా ఉంటే సూర్యుడిపై పరిశోధన కోసం 2018లో పార్కర్ సోలార్ ప్రోబ్ మిషన్ ను నాసా ప్రారంభించింది. యూజీన్ పార్కర్ అనే శాస్త్రవేత్త పేరు మీద దీనిని నిర్మించారు. ఆయన 1958లో సౌర గాలి ఉనికిని మొదటగా వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ ప్రోబ్ 4,30,000 మైళ్ల వేగంతో సూర్యుడి కరోనా గుండా ప్రయాణించింది. ఇది మానవ నిర్మిత అత్యంత వేగవంతమైన వస్తువుగా రికార్డు సృష్టించింది. 1,300°C వేడి, తీవ్రమైన రేడియేషన్ ను తట్టుకొని ప్రోబ్.. సూర్యుడికి దగ్గరగా మనుగడ సాగిస్తుండటం చారిత్రత్మక ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పవచ్చు.

Also Read This: Kota Srinivasa Rao: చనిపోయే ముందు ఆ స్టార్ హీరోకి మర్చిపోలేని సాయం చేసిన కోట శ్రీనివాసరావు?

 

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం