Farmers Protest: సీడ్ పత్తి కంపెనీలు, ఆర్గనైజర్లను నమ్మి పత్తి పంటను సాగు చేస్తే కేవలం రెండు క్వింటాళ్ల వరకే కొంటామని కొర్రీలు పెడుతూ ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి పంట పండిస్తున్న తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సీడ్ రైతులు (Farmers) రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal District) అయిజ మండలం బింగిదొడ్డి గ్రామా స్టేజిలో అయిజ టు గద్వాల్ రోడ్ పై బైఠాయించి రైతులు పెద్ద ఎత్తున చేరుకుని రోడ్డుపై బైఠాయించడంతో ఇరువైపులా భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. తమకు న్యాయం జరిగేంతవరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.
Also Read: Jangaon District farmers: మొహం చాటేసిన వర్షాలు.. ఎండుతున్న పంటలు
సీడ్ కంపెనీలకు (Seed Company) మధ్యవర్తులుగా ఉన్న సీడ్ పత్తి ఆర్గనైజర్లు ఒక్క ఎకరాకు 2 క్వింటాలు విత్తనాలు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం ఎంతవరకు సబబు ఆని రైతులు (Farmers) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్ని క్వింటాలు పంట దిగుబడి వస్తే అన్ని క్వింటాళ్లు కొనేవారని,ఇప్పుడు కొనమని సీడు ఆర్గనైజర్లు చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సీడ్ పత్తి కంపెనీలు (Seed Company) ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలన్నారు. అధిక సంఖ్యలో రైతులు (Farmers) ధర్నా చేపట్టడంతో స్తంభించిన ట్రాఫిక్ దాదాపుగా మూడు కిలోమీటర్లు వరకు వాహనాలు నిలిచిపోయాయి.
2 క్వింటాలు విత్తనాలు కొనుగోలు చేస్తాం
సీడ్ పత్తి విత్తనాలు ఎకరాకు నాలుగు నుండి ఐదు కింటాలు పంట వస్తుంది కానీ ఆర్గనైజర్లు ఇప్పుడు ఎకరాకు 2 క్వింటాలు విత్తనాలు కొనుగోలు చేస్తామని అంతకన్నా ఎక్కువ పండితే మేం కొనుగోలు చేయమని చెప్పడంతో రైతులు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికే పలు కంపెనీలు, ఆర్గనైజర్ల సూచనతో కొంతమంది రైతులు తమ పంటను పెరికేయడం జరిగింది. పంటలో దిగుబడి వస్తే వాటిని మేము ఏం చేసుకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు.
తమ పొట్ట కొట్టాలని చూస్తున్నారు
వేరే కంపెనీలకు అమ్ముకునే అవకాశం సైతం లేదని, సీడ్ కంపెనీలు ఇచ్చిన మాట ప్రకారం సాగు చేసిన పంటను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇటు ఎమ్మార్వో సైతం ఆందోళన దారులని శాంతింపజేసినప్పటికీ మాకు ఖచ్చితమైన హామీ వచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రైతులు ఖరాకండిగా తెలిపారు. సాగు చేసిన స్టెరైల్ పత్తి విత్తనాలను కొనాలని అందుకు కంపెనీలు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో సీడ్ సాగు విస్తీర్ణం తగ్గించి కర్ణాటకలోని గజేంద్ర గడ్డిలో సీడ్ కంపెనీలు సాగుకి ముగ్గు చూపుతో తమ పొట్ట కొట్టాలని చూస్తున్నారని రైతులు (Farmers) అన్నారు.
జి ఎం ఎస్ సాగు పై కొర్రీలు
జిఎంఎస్ పంటను కంపెనీల సూచన మేరకే సాగు చేశామని, ఇప్పటికే పూత దశలో ఉండి కాయలు పడుతున్నాయని, ఇలాంటి పరిస్థితులలో కంపెనీలు విత్తనాలు కొనక్కుంటే మాకు చావే శరణ్యమని అని రైతుల వాపోతున్నారు. జిల్లాలో 32000 ఎకరాల పత్తి పంట సాగు చేస్తున్నామని వేల కుటుంబాలు రోడ్డున పడతాయని, ఎంతో ఆర్థిక ఇబ్బందులను సైతం ఎదుర్కొని పంటను సాగు చేస్తున్నామని గత సంవత్సరంలో పండించిన పంటకు నేటికీ బిల్లులు రాలేదని, ఇంత ఇబ్బందుల్లో ఉన్న తమను కంపెనీలు మరింత ఇబ్బందుల్లోకి నెట్టడం సమంజసం కాదని రైతులు (Farmers) తెలిపారు.
Also Read: Khammam District Farmers: వినూత్న రీతిలో మామిడి పిక్కల నుండి మొక్క తయారీ.. ఎక్కడంటే!