MP Chamal Kiran Reddy( image CREDIT; twitter)
Politics

MP Chamal Kiran Reddy: లక్కులో గెలిచిన నువ్వు కాంగ్రెస్‌ను ఓడిస్తావా?

MP Chamal Kiran Reddy: గంజిలేని జగదీష్ రెడ్డికి ఇప్పుడు బెంజ్‌ కారులో ఎలా తిరుగుతున్నాడని ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి (MP Chamal Kiran Reddy) ప్రశ్నించారు. ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, జగదీష్ రెడ్డి మాటలు అతిగా ఉన్నాయని మండిపడ్డారు. సూర్యాపేటలో స్వల్ప మెజార్టీతో బయట పడ్డారని, ఏదో లక్కులో గెలిచిన ఆయన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలను ఓడిస్తానని సవాల్ చేయడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. కాంగ్రెస్ పాదేళ్ల పాటు పవర్‌లో ఉంటుందన్నారు.

 Also Read: Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. మరో 10 ట్రెయిన్‌లు

మాటల్లో సబ్జెక్ట్ లేదు

ఎవరు ఎన్ని కుట్రలకు పాల్పడినా, ఇదే సత్యమన్నారు. ఇక, బీజేపీ‌లో పాత కళాకారులు పోయి కొత్త కళాకారుడు వచ్చాడని విమర్శించారు. రాంచందర్ రావు (Ramchandra Rao) మాటల్లో సబ్జెక్ట్ లేదన్నారు. ఆయనకు మతి మరుపు ఉన్నట్లు వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. గత పదేళ్ల తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ స్కీమ్‌లలో మోదీ ఫొటో కోసం రాంచంర్ రావు తాపత్రయం పడుతున్నారని మండిపడ్డారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేషన్ కార్డుల్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఫొటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

ఇక బ్రిటీష్ హయాంలోనే కొందరు మైనారిటీ ముస్లింలను బీసీల్లో చేర్చారని, దీనిపై రాజకీయం చేయడం సరికాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ మైనార్టీ ముస్లీంలు బీసీల్లోనే ఉన్నారని తెలిపారు. రాంచందర్ రావు విషయ పరిజ్ఞానం పెంచుకుంటే మంచిదన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు మిత్ర బంధంతో రాష్ట్రాన్ని పదేళ్ల పాటు దోచుకోవచ్చని స్పష్టం చేశారు. భారత్ జోడో యాత్రలో ఇచ్చిన హామీలపై రాహుల్ గాంధీ కట్టుబడి పనిచేస్తున్నారన్నారు.

 Also Read: Phone Tapping Case: ట్యాప్​ చేయాలని ఎవరు ఆదేశించారు.. అంతా పై అధికారులకు తెలుసు

Just In

01

KTR: పారిశుధ్య కార్మికుడిది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యే: కేటీఆర్

Ganesh Visarjan 2025: రెండో రోజు కొనసాగిన నిమజ్జనం.. పారిశుద్ధ్య కార్మికురాలు మృతి!

Harish Rao: రాష్ట్రంలో దీన స్థితికి చేరిన గురుకులాలు.. హరీష్ రావు ఫైర్

TSUTF Demands : టెట్ పై సుప్రీం తీర్పును పున:సమీక్షించాలని ఉపాద్యాయులు డిమాండ్!

CV Anand: సిబ్బంది అందరికీ అభినందనలు తెలిపిన సీపీ ఆనంద్!