Road Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం..
Uttarakhand Accident
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Road Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. వ్యాన్ లోయలో పడి 8 మంది మృతి

Road Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. పిథోరాగఢ్ జిల్లాలోని తాల్ ప్రాంతంలోని మువాని వద్ద ఉన్న సుని వంతెన సమీపంలో 13 మంది ప్రయాణికులతో వెళ్తున్న ‘మ్యాక్స్’ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంది యాత్రికులు మరణించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. వీరంతా స్థానికులే. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే స్థానికుల సహాయంతో పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని లోయ నుంచి వెలికితీసి మువానిలోని ఆసుపత్రిలో చేర్చారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని స్థానికంగా ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Read Also- High Court: మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా.. నల్లపురెడ్డిపై హైకోర్టు సీరియస్

ప్రమాదం ఎలా జరిగింది?
మువాని పట్టణం నుంచి బోక్తా గ్రామానికి ‘మ్యాక్స్ జీప్’ బయలుదేరింది. ఈ క్రమంలో నదుల సంగమానికి సమీపంలో ఉన్న సుని వంతెన వద్ద డ్రైవర్ కంట్రోల్ కోల్పోయాడు. దీంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. కాగా, ఈ ప్రాంతం కొండల మధ్య, వంకర మార్గాలతో ఉంటుంది. రహదారులు ఇరుకుగా ఉండటం, కొన్నిసార్లు వర్షాల వల్ల జారే స్వభావం కలిగి ఉండటం వంటివి ప్రమాదాలకు ప్రధాన కారణాలని తెలుస్తోంది. దీంతో వాహనం అదుపుతప్పి లోతైన లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పాఠశాల విద్యార్థులు ఉండటం హృదయ విదారకం. ఐదుగురు చనిపోగా వారంతా బోక్తా గ్రామానికి చెందిన వారు కావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంలో గాయపడిన ఆరుగురు మువానిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఎప్పుటికప్పుడు జిల్లా అధికారులు, ప్రభుత్వ పెద్దలు సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు.

Road Accident

Read Also- Yash Dayal: అరెస్ట్ చెయ్యొద్దు.. ఆర్సీబీ స్టార్ ప్లేయర్‌కు హైకోర్టు రిలీఫ్

జాగ్రత్త..
ఈ ప్రమాదం కొండ ప్రాంతాలలో రోడ్డు భద్రత ప్రాముఖ్యతను గుర్తు చేస్తోంది. వాహనాల నిర్వహణ, డ్రైవర్ల అప్రమత్తత, రోడ్డు పరిస్థితులు మెరుగుపరచడం వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జిల్లా యంత్రాంగం, సహాయక బృందాలకు సహాయక చర్యలను వేగవంతం చేయాలని, గాయపడిన వారికి సకాలంలో, సరైన ఉచిత వైద్య సదుపాయాలు అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. వాహనం అధిక వేగంతో ఉందా? లేదా బ్రేక్‌లు ఫెయిలయ్యాయా? లేదా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడా? అనే అంశాలపై అధికారులు విచారిస్తున్నారు. ఈ ప్రాంతంలోని రహదారులు ప్రమాదకరమైనవని. వర్షాకాలంలో ప్రమాదాల సంఖ్య పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఏరియా నుంచి వెళ్లేటప్పుడు వాహనాలను ఆచితూచి నడపాలని పోలీసులు సూచిస్తున్నారు.

Read Also- Genelia: రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ.. ఇప్పుడున్న పొజిషన్ చూస్తుంటేనా?

Just In

01

Kerala News: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా.. పంచాయతీ ఎన్నికల్లో యూటీఎఫ్ సత్తా

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!