CM Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan: చంద్రబాబు స్థానంలో ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్!

Pawan Kalyan: అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే..! ఇదేదే సినిమాలు అయ్యింటుందిలే అనుకుంటున్నారేమో.. కానే కాదండోయ్. అందుకే కదా చంద్రబాబు (Chandrababu) స్థానంలో ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కుర్చీలో కూర్చోబోతున్నారు అని చెప్పేది. అది కూడా ఒక గంట కాదు ఒకరోజు కాదు ఏకంగా నాలుగు రోజుల పాటు ముఖ్యమంత్రి కుర్చీలో (CM Chair) పవన్ కూర్చోబోతున్నారు. ఇప్పుడిదే అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో (Social Media) పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఈ వార్తతో జనసేన (Janasena) కార్యకర్తలు, పవన్ వీరాభిమానులు, మెగాభిమానుల ఆనందానికి హద్దుల్లేవు అంతే. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఆయనేమీ శాశ్వతంగా ముఖ్యమంత్రి కాదు.. అంతకుమించి పూర్తిగా ముఖ్యమంత్రి కాదు.. కేవలం ఇన్‌ఛార్జ్ ముఖ్యమంత్రి మాత్రమే. ఇంతకీ సేనాని ఏ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కాబోతున్నారు? చంద్రబాబు స్థానం అనేది ఇక్కడ ఎందుకు ప్రస్తావన వచ్చింది? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘స్వేచ్ఛ’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం వచ్చేయండి..

ఇదీ అసలు సంగతి..
ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 26 నుంచి 30 వరకు సింగపూర్‌ పర్యటను (Singapore Tour) వెళ్తున్నారు. సీఎం వెంట మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో మంత్రులతో పాటు సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్ర, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, ఆర్థిక అభివృద్ధి సంస్థ సీఈవో సాయికాంత్ వర్మ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి యువరాజ్ కూడా పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. సింగపూర్‌లోని రాజకీయ, వ్యాపార వర్గాలతో ముఖ్యమంత్రి బృందం సమావేశం కానుంది. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన అంశాలను అధ్యయనం చేయడం, సింగపూర్ సహకారాన్ని తిరిగి పొందడం ఈ పర్యటనలో కీలకమైన అజెండా. గతంలో సింగపూర్ కన్సార్టియం అమరావతి నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నందున, ఆ సంబంధాలను పునరుద్ధరించాలని ప్రభుత్వం చూస్తోంది. సింగపూర్ నుంచి పట్టణ ప్రణాళిక, నగర సుందరీకరణ, ఉద్యానవనాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల కల్పన మరియు భవిష్యత్ సాంకేతికత వంటి రంగాలలో సహకారం తీసుకోవాలని బృందం భావిస్తోంది. సింగపూర్ ప్రభుత్వంతో, అధికారులతో చర్చలు జరిపి, వివిధ రంగాలలో సహకారం కోసం ప్రయత్నిస్తారు. ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, ఉత్తమ విధానాలను సింగపూర్ నుంచి పొందాలని ప్రభుత్వం ఆశిస్తోంది.

Read Also- Janasena: పుంజుకుంటున్న బీజేపీ.. మంత్రి పదవికే అంకితమైన పవన్.. జనసేనకు ఎందుకీ గతి?

ఇన్‌ఛార్జీ సీఎంగా సేనాని..
సీఎం విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్‌కు ఇన్‌ఛార్జ్ ముఖ్యమంత్రిగా (Incharge CM) బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ, ముఖ్యమంత్రి కార్యాలయం అన్ని శాఖలకు దీనిపై ఆదేశాలు జారీ చేసినట్లు, అధికారులు కూడా ధృవీకరించినట్లు కొన్ని వార్తలు పేర్కొంటున్నాయి. ఇదేగానీ జరిగితే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంలో ఒక ముఖ్యమైన పరిణామమే అని చెప్పుకోవచ్చు. ఈ నాలుగు రోజుల పాటు ఆయనకు పూర్తి స్థాయి ముఖ్యమంత్రి అధికారాలు లభిస్తాయి. అయితే కొందరు విశ్లేషకులు ఇది కేవలం ప్రచారం మాత్రమే కావచ్చని, అధికారిక ప్రకటన వచ్చేవరకు నమ్మలేమని పేర్కొంటున్నారు. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే మాత్రం చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు పరిపాలనా వ్యవహారాలను పవన్ కళ్యాణ్ పర్యవేక్షిస్తారు. ఇది ఆయనకు ఒక ముఖ్యమైన బాధ్యతే. మరోవైపు జనసేన కార్యకర్తలు దీనిపై ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. తమ అభిమాన నేత, హీరోను ముఖ్యమంత్రి పీఠంపై చూడాలని అభిమానులు, కార్యకర్తలు ఎప్పట్నుంచో వేయి కళ్లతో ఎదురుచూస్తున్న పరిస్తితి. కాగా, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సేనాని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

Pawan and Chandrababu

ఇదేం మొదటిసారి కాదుగా!
గతంలో ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు, ముఖ్యమంత్రి బాధ్యతలను ఇతర సీనియర్ మంత్రులకు అప్పగించడం సాధారణమే. ముఖ్యమంత్రి అందుబాటులో లేనప్పుడు లేదా తాత్కాలికంగా తన విధులు నిర్వర్తించలేని పరిస్థితుల్లో ఇన్‌ఛార్జ్ ముఖ్యమంత్రికి బాధ్యతలు అప్పగించబడతాయి. ముఖ్యంగా.. ముఖ్యమంత్రి అధికారిక లేదా వ్యక్తిగత పర్యటనల నిమిత్తం విదేశాలకు వెళ్లినప్పుడు ఈ అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి తీవ్రమైన అనారోగ్యానికి గురై, తన విధులను నిర్వర్తించలేని స్థితిలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రికి ఏదైనా శస్త్రచికిత్స లేదా దీర్ఘకాలిక వైద్య చికిత్స అవసరమైనప్పుడు బాధ్యతలు అప్పగిస్తారు. అరుదైన సందర్భాలలో, ముఖ్యమంత్రి అందుబాటులో లేని ఇతర అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు, సాధారణంగా, కింది వ్యక్తులలో ఒకరికి ఇన్‌ఛార్జి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించబడతాయి. చాలా సందర్భాల్లో, ముఖ్యమంత్రి అందుబాటులో లేనప్పుడు ఉపముఖ్యమంత్రికి ఈ బాధ్యతలు అప్పగించడం సాధారణం. ఉపముఖ్యమంత్రి పదవి ఉంటే, సహజంగా వారికే ఈ ప్రాధాన్యత ఉంటుంది. డిప్యూటీ సీఎం కూడా అందుబాటులో లేనప్పుడు లేదా పదవి లేనప్పుడు క్యాబినెట్‌లో అత్యంత సీనియర్, అనుభవజ్ఞుడైన మంత్రికి ఈ బాధ్యతలు అప్పగించబడతాయి. ముఖ్యమంత్రి అంగీకారంతో లేదా సందర్భాన్ని బట్టి గవర్నర్ సంప్రదింపులతో ఇది జరుగుతుంది.

Read Also- Wife And Husband: వామ్మో తెలంగాణలో ఘోరం.. భార్యభర్తల పంచాయితీలో ఇద్దరు దారుణ హత్య

బాధ్యతలు లిమిట్‌గానే..!
ముఖ్యమంత్రి సాధారణంగా తాను లేని సమయంలో పరిపాలనను ఎవరు పర్యవేక్షించాలనే దానిపై సిఫార్సు చేస్తారు. ఈ సిఫార్సు ఆధారంగా గవర్నర్ ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగిస్తారు. ముఖ్యమంత్రి లేని సమయంలో, ఇన్‌ఛార్జి ముఖ్యమంత్రి పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. అత్యవసర నిర్ణయాలు తీసుకుంటారు.. ప్రభుత్వ కార్యకలాపాలు సజావుగా జరిగేలా చూస్తారు. ఇన్‌ఛార్జి ముఖ్యమంత్రికి సాధారణంగా పూర్తిస్థాయి ముఖ్యమంత్రికి ఉన్న అన్ని అధికారాలు ఉండవు. కొన్ని కీలక నిర్ణయాలు, విధానపరమైన మార్పులు వంటి వాటిని సాధారణంగా ముఖ్యమంత్రి తిరిగి వచ్చేవరకు వాయిదా వేస్తారు.. ఆయన అనుమతితో మాత్రమే తీసుకుంటారు. అయితే, పరిపాలన సజావుగా సాగడానికి అవసరమైన అన్ని అధికారాలు వారికి ఉంటాయి. ఈ నియామకం సాధారణంగా తాత్కాలిక స్వభావం కలది.. ముఖ్యమంత్రి తిరిగి వచ్చిన తర్వాత వారి అధికారాలు పునరుద్ధరించబడతాయి. పవన్ కళ్యాణ్ విషయంలో, ఆయన ఉపముఖ్యమంత్రి కాబట్టి, చంద్రబాబు లేని సమయంలో ఆయనకు ఇన్‌ఛార్జి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

Read Also- Dheeraj Kumar: బ్రేకింగ్.. ప్రముఖ నటుడు ధీరజ్ కుమార్ మృతి

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?