Dheeraj Kumar: గత రెండు రోజుల నుంచి సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలను చూశాము. అయితే, తాజాగా మరో నటుడు మరణించారు. ప్రముఖ హిందీ సినిమా, టెలివిజన్ నటుడు నిర్మాత ధీరజ్ కుమార్ (79) ముంబైలో న్యూమోనియాతో పోరాడి జులై 15, 2025న కన్నుమూశారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లో చేరిన ఆయన, ఐసీయూలో వెంటిలేటర్ సపోర్ట్‌పై చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం 11:40 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ సంఘటనతో భారతీయ సినీ, టెలివిజన్ రంగంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Also Read: Samantha: నాగచైతన్యదే తప్పు.. భార్య దగ్గర నిజాయితీగా ఉండాలంటూ.. సమంత సంచలన కామెంట్స్
ఆయన చివరి మాట్లాడిన మాటలు ఇవే..
ధీరజ్ కుమార్ ఇటీవల ముంబైలోని ఖార్ఘర్‌లో ఇస్కాన్ ఆలయ కార్యక్రమంలో పాల్గొన్నారు, ఇది ఆయన ఆఖరి పబ్లిక్ అప్పీరెన్స్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఆయన తన ఆధ్యాత్మిక భావాలను వ్యక్తం చేస్తూ, సనాతన ధర్మాన్ని ప్రోత్సహించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రశంసించారు. అయితే, జులై 14న ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో హాస్పిటల్‌లో చేరారు. తీవ్రమైన న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన, ఐసీయూలో చికిత్స పొందుతూ, కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూశారు.