Jogulamba Gadwal district: జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండల కేంద్రంలో కేటి దొడ్డి కేజీబీవీ జూనియర్ కళాశాల విద్యార్థిని ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుంచి కిందపడి గాయాలైన ఘటన చోటు చేసుకుంది. కేజీబీవీ ఎస్ఓ పద్మావతి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మక్తల్ మండలం భూత్పూర్ గ్రామానికి చెందిన చెన్నయ్య గౌడ్ కూతురు సాయిశృతి గద్వాల జిల్లా కేటిదొడ్డి కేజీబివిలో ఫస్ట్ ఇయ్యర్ బైపీసి చదువుతోంది. మంగళవారం ఉదయం విద్యార్థిని సాయిశృతి కళాశాల మొదటి అంతస్తు మీద నుండి ప్రమాదవశాత్తు కిందపడిపోయింది.
Also Read: Malnadu Restaurant Drugs Case: మల్నాడు డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. పోలీస్ అధికారుల సుపుత్రులు
ఆసుప్రతికి తరలింపు
గమనించిన కేజీబీవీ సిబ్బంది గాయపడిన సాయిశృతిని గద్వాల జిల్లా ఆసుప్రతికి తరలించారు. వైద్యులు చికిత్స చేసి స్కానింగ్ కు రిపోర్టు ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. విద్యార్థిని కళ్లు తిరిగిపోడియిందని కేజీబీవి ఎస్ఓ వెల్లడించారు. గద్వాల జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని ఎంఈఓ వెంకటేశ్వర రావు, విద్యాశాఖ కో ఆర్డినేటర్ హంపయ్య, కేటిదొడ్డి ఎస్ఐ శ్రీనివాసులు పరామర్శించి విద్యార్థి ఆరోగ్య పరిస్థితి పై వైద్యులను ఆరాతీశారు. ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి మెరుగ్గా ఉందని, వెన్నెముకలో క్రాక్ ఉందని, బీపీతో ఇబ్బంది పడుతుందని, స్కానింగ్ ప్రక్రియ పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని డాక్టర్ తెలిపారు.
Also Read: Gadwal: చెక్కింగ్ సిబ్బంది లేకపోవడమే.. అక్రమ దందాలకు ప్రోత్సాహమా?