Ganja Gang Arrested (imagecredit:twitter)
హైదరాబాద్

Ganja Gang Arrested: భాయ్ బచ్చా ఆగయా.. వంద మంది గంజాయి బాబుల గుట్టు రట్టు

Ganja Gang Arrested: ఒక్క మెస్సేజ్​ఒకే ఒక్క మెస్సేజ్ గంజాయి సేవించటానికి అలవాటు పడ్డ వంద మంది గుట్టును రట్టు చేసింది. ఇప్పటికే ఈ కేసులో పధ్నాలుగు మందిని అదుపులోకి తీసుకున్న ఈగల్​టీం అధికారులు మిగితావారు స్వచ్ఛంధంగా లొంగిపోవాలని చెప్పారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహారాష్ట్ర(Maharashtra)కు చెందిన సందీప్ అనే పెడ్లర్ కొన్నేళ్లుగా గంజాయి దందా చేస్తున్నాడు. వారం రోజులకొకసారి అయిదు కిలోల గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లలో యాభై గ్రాముల చొప్పున ప్యాక్ చేస్తాడు. ఆ తరువాత ఆ ప్యాకెట్లతో హైదరాబాద్ చేరుకుని ఐటీ కారిడార్ ప్రాంతంలో విక్రయిస్తుంటాడు.

పోలీసులు కోడ్ మెస్సేజ్
దీని కోసం కస్టమర్ల ఫోన్ నెంబర్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్న సందీప్(Sandeep) ఇక్కడికి చేరుకోగానే భాయ్ బచ్చా ఆగయా అంటూ దాంట్లో మెస్సేజ్(Message)​ఫార్వర్డ్ చేస్తాడు. దీనిని చూడగానే కస్టమర్ల ఐటీ కారిడార్ ప్రాంతానికి చేరుకుని అతని నుంచి గంజాయి ప్యాకెట్లు కొని తీసుకెళుతుంటారు. ఈ మేరకు సమాచారాన్ని అందుకున్న ఈగల్ టీం అధికారులు సందీప్ ను పట్టుకోవటానికి ప్లాన్ వేశారు. అయితే, చివరి నిమిషంలో అతను పారిపోయాడు. అయితే, సందీప్​ మొబైల్ ఫోన్ మాత్రం పోలీసుల చేతికి చిక్కింది. దానిని విశ్లేషించిన పోలీసులు కోడ్ మెస్సేజ్ గురించి తెలుసుకున్నారు. ఆ తరువాత సివిల్ దుస్తుల్లో ఐటీ కారిడార్ ప్రాంతానికి వెళ్లి భాయ్ బచ్చా ఆగయా అంటూ గ్రూప్ లో మెస్సేజ్ చేశారు. ఇది చూసి గంజాయి కొనటానికి వచ్చిన పధ్నాలుగు మందిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Janasena: వినుత కోటా కోసం రంగంలోకి బడా లీడర్.. చెన్నై పోలీసులపై ఒత్తిడి!

మాదక ద్రవ్యాల దందా
వీరిలో విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ప్రాపర్టీ డీలర్లు తదితరులు ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఈగల్ టీం అధికారులు ఇంకా చేతికి చిక్కని మిగితా 86మంది కొనుగోలుదారుల వివరాలను వారి వారి సెల్ ఫోన్ల ఆధారంగా సేకరిస్తున్నారు. పధ్నాలుగు మంది పట్టుబడిన నేపథ్యంలో వీళ్లంతా తమ తమ మొబైల్ ఫోన్లను స్విచాఫ్ చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వీళ్లంతా స్వచ్ఛంధంగా లొంగిపోవాలని ఈగల్ టీం అధికారులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, మాదక ద్రవ్యాల దందా గురించి తెలిస్తే 1908 నెంబర్​ కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఈగల్​ టీం డీసీపీ రూపేశ్ కుమార్​ కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా పెడతామన్నారు.

Also Read: Raja Singh: రాజాసింగ్‌కు ముళ్లబాటేనా.. మున్మందు సవాళ్లు తప్పవా?

 

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?