College Students Protest: మేడ్చల్(medchal) జిల్లాలో గురుకులాల లక్ష్యం నీరుగారుతోంది. గతవారం కిందటే అదనపు కలెక్టర్ రాధిక గుప్తా(Collector Radhika Gupta) బీసీ(BC Hostel) హాస్టల్ పర్యటించినప్పటికీ గురుకులంలో సౌకర్యాలు మెరుగుపడలేదు. ఫలితంగా విద్యార్థులు రోడ్డెక్కారు. శామీర్ పేట్ మండలం తుర్కపల్లి గ్రామంలోని కూకట్ పల్లి(Kukatpally) బ్రాంచ్ కి చెందిన మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. అంతకు ముందు పాఠశాల, కళాశాల విద్యార్థులు హాస్టల్ నుండి తుర్కపల్లి లోని రాజీవ్ రహదారి వరకు ప్రిన్సిపాల్ మారాలి, ప్రిన్సిపాల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రాజీవ్ రహదారిపై భైటాయించారు. అనంతరం హాస్టల్ గేట్ వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు.
తాగునీటితో నానా ఇబ్బందులు
ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల(Gurukul School), కళాశాల సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేధన వ్యక్తం చేశారు. తమకు స్నానం చేసుకోడానికి సరిపడ బాత్రూమ్‌లు లేవని, బాత్రూమ్ డోర్లు లేవని, రెండో బాత్రూమ్‌లు సరిగా ఉన్నాయన్నారు. తినే అన్నం సరిగా లేదని, నెలకోసారి మార్చాల్సిన ఫుడ్ మెనూ మార్చడం లేదని, నీటి సమస్య తీవ్రంగా ఉందని, అపరిశుభ్రత తాగునీటితో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని బాగు చేయాలని ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేస్తే దురుసుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 500 మంది విద్యార్థులకు గాను రెండు 2 బాత్ రూమ్ మాత్రమే ఉన్నాయని అవి కూడా సరిగా లేవని చెప్పారు. ఇప్పటికైనా తమకు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.
Also Read: Gadwal District: రెండేళ్లు పూర్తయినా అందుబాటులోకి రాని ఆసుపత్రి
బీసీ హాస్టల్ ప్రిన్సిపల్ వివరణ
గత సంవత్సరం వరకు ఎలాంటి సమస్యలు లేవని ఈ సంవత్సరం మాత్రం బియ్యం వలన ఇబ్బందులు పడుతున్నామని ప్రిన్సిపల్ షీలా(Sheel చెప్పారు. బాత్రూంలకు డోర్లు బిగించమని మరి కొన్ని బాత్రూములకు పని జరుగుతుందని చెప్పారు. నీటి సమస్య ఉందని గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడం వల్లే సమస్య తలెత్తిందని వీటన్నిటిని సమస్యల పైన ఉన్నత అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ఆమె చెప్పారు.
Also Read: IT Park: కండ్లకోయ ఐటీ పార్కుకు శంకుస్థాపన.. ముందుకు సాగని పనులు