Adulterated Toddy(image credit: twitter)
హైదరాబాద్

Adulterated Toddy:వెలుగులోకి మరో కల్తీ కల్లు కలకలం.. ప్యాకెట్ కల్లు తాగి దంపతులకు అస్వస్థత

Adulterated Toddy: మేడ్చల్ జిల్లాలో కల్తీ కల్లు ఉదంతం మళ్లీ కలకలం రేపింది. కల్లు దుకాణం నుంచి తెచ్చుకున్న ప్యాకెట్ కల్లును తాగిన దంపతులకు కాళ్లు చేతులు గుంజటం, కరెంట్ షాక్ లాగా కొట్టడం వంటి లక్షణాలు కనిపించడంతో బాధితులు గాంధీ హాస్పిటల్ లో చేరారు. నిజామాబాద్ జిల్లా (Nizamabad District) భూపాల్ మండలం మంచి గ్రామానికి చెందిన లచ్చిరాం, సాక్రే బాయ్ భార్య భర్తలు. వీరు గాజులరామారం లో ఉంటున్న కూతురు రేఖా వద్దకు వచ్చారు. ఊరిలో కల్లు ను సేవించే అలవాటు ఉన్న వీరు స్థానికంగా ఉన్న కల్లు దుకాణం నుంచి కల్లు ప్యాకెట్లను తెచ్చుకొని వాటిని సేవించారు. కొద్దిసేపటికి వాళ్లకు శరీరంలో అసాధారణ పరిస్థితిలు కలుగుతున్నట్లు అనిపించడంతో 108 కు ఫోన్ చేశారు. చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

 Also Read: Gadwal Hospitals: ఆసుపత్రి నిర్మాణం పూర్తి.. సేవలు మాత్రం శూన్యం..

క్రితం రోజు తెచ్చుకున్న కల్లు…?
కాగా బాధితులు కల్లు ప్యాకెట్లను క్రితం రోజు తెచ్చుకోవడం జరిగింది. దానిని మరుసటి రోజు సాయంత్రం సేవించిన తర్వాత కాళ్లు చేతులు గుంజటం జరిగినట్లుగా చెబుతున్నారు. ఈ విషయాన్ని బాధితులు స్వయంగా 108 అంబులెన్స్ సిబ్బందికి చెప్పటం జరిగింది. బాధితులు సేవించిన కల్లు ప్యాకెట్లు షాపూర్ నగర్ , రామ్ రెడ్డి నగర్ కల్లు దుకాణాల నుంచి తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. కాగా నిల్వ ఉంచిన ప్యాకెట్ కల్లు ను తాగడం వలన లేదా ఊరిలో తాగుతున్న కల్లుకు, ఇక్కడ స్థానికంగా తెచ్చుకున్న కల్లుకు తేడా ఉండటం వలన సేవించిన వారికి అనారోగ్య లక్షణాలు కనబడ్డాయా అన్నది తేలాల్సి ఉంది.

ఎటువంటి ప్రమాదం లేదు: సీఐ గడ్డం మల్లేష్
క్రితం వరకు తాగిన కల్లు కు, ఇక్కడ తాగిన కల్లుకు వ్యత్యాసం వలనే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇది డ్రాయిల్స్ సింటమ్స్. బాధితులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వారికి ఎటువంటి ప్రమాదం లేదు.

 Also Read: KTR on Congress: పాలన అంటే శంకుస్థాపనలు కాదు కేటీఆర్ సంచలన కామెంట్స్!

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?