Swetcha( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Swetcha: ఆకర్షణీయమైన ఆఫర్లతో ఆన్ లైన్ బెట్టింగ్ వలలో చిక్కుకుంటున్న యువత

Swetcha: సోషల్ మీడియా వేదికగా ఆకర్షణీయమైన ప్రచారం చేస్తారు. అకేషన్ వారే సృష్టించి ఆకట్టుకునే ఆఫర్స్ ప్రకటిస్తారు. వారి వలలో పడ్డ వారిని రంజింపజేసి వ్యసనపరులుగా మారుస్తారు. డబ్బులు అందుబాటులో లేకున్న అప్పులు ఇస్తారు. ఇప్పటిదాకా ఒకే ఇప్పుడు మొదలు అవుతుంది అసలు ఆట… ఇచ్చిన అప్పు వసూలు చేసుకునేందుకు వారు చేసే వేదింపులు భూమిమీద బతకాలనే ఆలోచన లేకుండా చేస్తాయి. కెసినో ఈవెంట్ ఆర్గనైజేషన్లు బెట్టింగ్ నిర్వాహకులతో సిండికేట్ ముఠాలుగా ఏర్పడి తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు, యువకులు బడా వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు టార్గెట్ గా ప్యాకేజీల వల విసురుతూ కేసినో బెట్టింగ్ లకు బెట్టింగ్ భూతానికి బలి చేస్తూ నరహంతక వ్యాపారం సాగిస్తున్న బెట్టింగ్ దందాల పై స్వేచ్ఛ ప్రత్యేక స్టోరీ..

సోషల్ మీడియాలో స్పెషల్ ఆఫర్స్ అంటూ ఆకర్షణీయమైన ప్రచారం

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ లపై నిషేధం ఉండడం, ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లపై నిఘా ఉండడంతో కేసినో బెట్టింగ్ నిర్వాహకులు మరో కొత్త మార్గం ఎంచుకున్నారు. భారతదేశంలో కెసినోలను అనుమతించే గోవా, డామన్, సిక్కిం రాష్ట్రాలు సహా శ్రీలంక, ఇతర ప్రాంతాలను వారికి అడ్డగా మార్చుకున్నారు. కేసినో బెట్టింగ్ ఈవెంట్ల కోసం సోషల్ మీడియాలో ప్రమోషన్లు నిర్వహించి ఆకర్షణీయమైన ప్యాకేజీలు స్పెషల్ ఆఫర్స్ పేరుతో ప్రచారం నిర్వహించి వారి ప్రచారానికి ఆకర్షితులైన వారి నుంచి ముందుగానే తమ అకౌంట్లలోకి లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని నిబంధన విధిస్తున్నారు. ముందుగా డబ్బులు డిపాజిట్ చేసే వారికి మందు(మద్యం) బాటిల్స్ ఫ్రీగా ఇస్తామని ఏర వేసి అనేక మంది వద్దనుంచి కోట్లాది రూపాయలు డిపాజిట్లు చేయించుకుంటున్నారు. హైదరాబాద్, వరంగల్ లోని పలు ఈవెంట్స్ నిర్వాహకులు సహా ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ లోని పలు ఈవెంట్స్ (EVENTS) నిర్వాహకులు ఈ దందా యదేచ్చగా సాగిస్తున్నారు.

 Also Read: Kota Srinivasa Rao: రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన కోట.. 2015లో పద్మశ్రీ పురస్కారం

కోట్లు మింగి అప్పులు మిగులుస్తున్న కేసినో బెట్టింగులు

ఈవెంట్స్ నిర్వాహకులు సోషల్ మీడియాలో క్యాసినో… గ్యాంబ్లింగ్, పేకాట ప్యాకేజీలు, విమానాల్లో ప్రయాణం, మందు బాటిళ్లు ఫ్రీ వంటి ఆఫర్స్ పేరుతో ప్రత్యేక వాట్సప్ గ్రూపులు క్రియేట్ చేసి పాలు సోషల్ మీడియా సాధనాల్లో ప్రచారం చేసి ఆకర్షితులైనా అనేక మందికి కేసినో బెట్టింగ్ ల రుచి చూపించి ఆ మోజులో పడ్డ వారికి డబ్బులు లేకుంటే వారి ప్రాపర్టీ తాకట్టు పెట్టుకుని అవసరం అయిన అప్పులను అత్యంత ఎక్కువ వడ్డీకి సమకూర్చి వారిని అప్పుల ఊబిలోకి లాగుతున్నారు. ఆ మోజులో పడి చేసిన అప్పులు వసూలు కోసం తీవ్రమైన వేదింపులు, బ్లాక్ మెయిల్ చేస్తారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో కొందరు… జల్సాల కోసం సరదాగా మొదలైన బెట్టింగ్ భూతం ఆ తరువాత రోజు రోజుకు నరకప్రాయంగా మారుతుంది. ఈ ఊబిలో ఇరుక్కుపోయినవారు విషయాన్ని బయటికి చెప్పుకోలేక సమస్యలను పరిష్కరించుకోలేక అనేక మంది బలి అవుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న బాధితుల సంఖ్య

వక్రమార్గంలో డబ్బు సంపాదించడమే లక్ష్యంగా వెలిసిన పలు ఈవెంట్ ఆర్గనైజర్ల సిండికేట్ ముఠాల చేతికి చిక్కి కోట్ల రూపాయలు బెట్టింగుల్లో కోల్పోయి వేలాది మంది అప్పుల పాలు అవుతున్నారు. ఆన్ లైన్ బెట్టింగుల్లో సర్వం కోల్పోయి చివరికి చేసిన అప్పులు తీర్చలేక అప్పులు ఇచ్చిన వారి వేధింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు బెట్టింగ్ బాధితుల సంఖ్య పెరుగుతుంది. వ్యవస్థను బ్రస్టు పట్టిస్తూ ప్రాణాలు తీస్తున్న ఈ ముఠాలపై నిఘా లేకపోవడంతో వారు వారి కార్యకలాపాలను యదేచ్చగా సాగిస్తున్నారు.

పెరుగుతున్న నేర ప్రవృత్తి

ఆన్ లైన్ బెట్టింగ్, ఆల్ లైన్ గేములు, కేసినో గేమింగ్ లకు అలవాటు అనేక మంది అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి దాని నుంచి బయట పడేందుకు కొందరు నేరాలకు పాల్పడుతున్నారు. ఈ వ్యసనానికి బానిసలై బయట పడలేక డబ్బులకోసం దొంగతగలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం అలవాటుగా మార్చుకునీ జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. అనేక మంది విద్యార్థులు, యువకులు దొంగతనం కేసుల్లో పోలీసులకు చిక్కిన సందర్భాలు పెరుగుతున్నాయి. మరి కొందరు మానవత్వం మరిచి హత్యలకు తెగబడుతున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఎన్ టి ఆర్ నగర్ లో జరిగిన ఘటనే దీనికి నిదర్శనం… బతుకు దెరువుకోసం వనపర్తి జిల్లా ఘనపూర్ మండలం కోతులకుంట తండా కు చెందిన కేశవత్ హనుమత్ నాయక్ తన కుటుంబంతో హైదరాబాద్ వచ్చి తాపీ మేస్త్రి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పిల్లల చదువుల కోసం అని తన స్వరంలో ఉన్న భూమి తాకట్టుపెట్టీ రూ. 6 లక్షలు తెచ్చి ఇంట్లో పెట్టడు. అతని పెద్ద కొడుకు రవీందర్ ఇంటర్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటూ ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగులకు అలవాటు పడి అప్పులు చేశాడు. తన తండ్రి ఇంట్లో పెట్టిన డబ్బులను కూడ ఆన్ లైన్ బెట్టింగ్, గేముల్లో పోగొట్టాడు. ఆ డబ్బుల గురించి అడిగిన తండ్రిని కొడుకు నమ్మించి అతికిరాతకంగా హత్య చేశాడు.

ప్రాజెక్ట్ లో భూమి…. ఆన్ లైన్ బెట్టింగ్ లో డబ్బులు పోయాయి

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరెల్లి ప్రాజెక్ట్ కింద వారి భూమి పోయింది. అందుకు ప్రభుత్వం నుంచి రూ.2.50 కోట్లు డబ్బులు వచ్చాయి. వారి కొడుకు ఆన్ లైన్ బెట్టింగ్, ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటు పడి సర్వం కోల్పోవడంతోపాటు అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీర్చలేక ఇంట్లో జరిగిన విషయం చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకోవాలి నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారు నచ్చజెప్పి కొడుకు ప్రాణాలు కాపాడుకున్నారు.

కుటుంబాలు చింద్రం అవుతున్నాయి

❄️👉 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లికి చెందిన వంశీ అనే యువకుడు ఆన్ లైన్ బెట్టింగ్, గేములకు అలవాటు పడి లక్షల రూపాయలు కోల్పోయి జరిగిన విషయం ఇంట్లో చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుని కన్నవారికి కన్నీరు మిగిల్చారు.

❄️👉ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పాలకొల్లుకు చెందిన గంగ అనూష(27) హైదరాబాద్ కెబిహెచ్బి కాలనీలో నివాసం ఉంటుంది. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లో రూ.100 పెట్టుబడి పెట్టి లాభం రావడంతో ఇంట్లో ఉన్న మొత్తం బంగారం తాకట్టు పెట్టి బెట్టింగ్ లో పెట్టుబడి పెట్టింది. మొత్తం పోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో చెప్పుకోలేక ఈ నెల 9న ఆత్మహత్య చేసుకుంది.

❄️👉సిద్దిపేట జిల్లా రంగంపల్లి గ్రామానికి చెందిన యువకుడు గోవాలో ఆన్ లైన్ గేముల్లో రూ. 2 కోట్లు పోగొట్టుకుని అప్పుల పాలు అయ్యాడు.

❄️👉సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ రైస్ మిల్ వ్యాపారి ఆన్ లైన్ గేమ్స్ లో రూ.5 కోట్లకు పైగా పోగొట్టుకుని అప్పుల పాలు అయ్యి రెండు రైస్ మిల్లులు అమ్ముకునే పరిస్థితి వచ్చింది.

❄️👉కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉన్నతమైన ఉద్యోగం. ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని సర్వం కోల్పోయాడు. దీంతో కుటుంబంలో గొడవలు తలెత్తాయి. మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని విలువైన జీవితం కోల్పోయాడు.

❄️👉 నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మహిళ ఆన్ లైన్ పేకాటకు అలవాటు పడి క్యాసినో అఫర్లకు ఆకర్షితురాలై గోవాలో క్యాసినో ఆడి రూ.10లక్షలు పోగొట్టుకుంది. క్యాసినో ఆడేందుకు ఉన్న 12 ఎకరాల స్థలాన్ని అమ్ముకొని ఇప్పటి వరకు రూ.6కోట్లకి పైగా పోగొట్టుకుంది.

❄️👉సిద్దిపేట జిల్లా వ్యక్తి కేసినో బెట్టింగ్ లకు బానిసై ఆరునెలల కాలంలో రూ.80 లక్షలు పోగొట్టుకున్నాడు. ఉన్న ఇల్లు అమ్ముకుని రోడ్డున పడ్డాడు.

ఆన్ లైన్ బెట్టింగ్, గేమ్స్ తో బాగుపడ్డది లేదు

ప్రముఖులు చేసిన ప్రకటనలకు, సోషల్ మీడియాలో ప్రచారంకు ఆకర్షితులై కొందరు, సులభంగా డబ్బులు వస్తాయని కొందరు.. జల్సాల కోసం, విలాసాలకోసం ఇంకొందరు, వ్యసనంగా మారి మరికొందరు క్యాసినో, బెట్టింగ్ ల భూతానికి బలి అవుతున్నారు. ఆన్ లైన్ బెట్టింగ్, గేమ్స్ తో ఎక్కడ ఎవ్వరు బాగుపడ్డది లేదు కానీ అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రభుత్వాలు స్పందించి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపై చర్యలు తీసుకున్నట్లె, మన రాష్ట్రం నుంచి కేసినో బెట్టింగ్ ప్రమోటర్లగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటే కొంత వరకు నష్ట నివారణ జరిగే అవకాశం ఉంది. కేసినో ఆన్ లైన్ గేమ్స్ ప్రచారం చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నారు.

 Also Read: Betting App Case: బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దూకుడు.. ఆ 29 మంది సెలబ్రిటీలు విచారణకు రావాలని ఆదేశాలు..

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?