Martian meteorite: వేలానికి అంగారక గ్రహ శకలం.. ధర ఎంత?
Martian Meteorite
Viral News, లేటెస్ట్ న్యూస్

Martian meteorite: వేలానికి అంగారక గ్రహ శకలం.. ధర ఎంత?

Martian meteorite: అరుదైన, అత్యంత విలువైన అంగారక గ్రహశకలం (Martian meteorite) ఎన్‌డబ్ల్యూఏ 16788 (NWA 16788) వేలానికి అందుబాటులోకి వచ్చింది. భూమిపై ఇప్పటివరకు సుమారు 400 వరకు అంగారక గ్రహశకలాలను గుర్తించగా, అందులో ఇదే అతిపెద్దది. జులై 16న న్యూయార్క్‌లోని సోతబైస్ (Sotheby’s) అనే వేలం నిర్వహణ సంస్థ విక్రయించనుంది. వేలంపాటలో దీని ధర సుమారు 4 మిలియన్ డాలర్ల వరకు పలకవచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అంటే, భారతీయ కరెన్సీలో ఈ విలువ దగ్గరదగ్గరగా రూ.33.4 కోట్లకు పైగానే ఉంటుంది. ఇప్పటికే వేలానికి ముందు వారం రోజుల్లోనే రూ.13 కోట్లు (1.6 మిలియన్ డాలర్లు) ధర పలికింది.

బరువు 25 కేజీలు
ఎన్‌డబ్ల్యూఏ 16788 గ్రహశకలం బరువు 25 కేజీల కంటే ఎక్కువగా ఉంది. ఇక, వెడల్పు 15 అంగుళాలు. ఇప్పటివరకు భూగ్రహంపై గుర్తించిన అంగారక గ్రహ శకలాల్లో ప్రతి దానికి 70 శాతం కంటే పెద్దది. దీనిని, 2023లో పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజర్‌లోని అగడెజ్ ప్రాంతంలో కనుగొన్నారు. ఏకంగా, 225 మిలియన్ మైళ్ల దూరం ప్రయాణించి భూమిని తాకింది. వేలం నిర్వహించనున్న సోతబైస్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, భూమిపై మొత్తం 77,000 గ్రహశకలాలు గుర్తించగా, అందులో కేవలం 0.6% మాత్రమే అంగారక గ్రహానికి చెందినవి. ఇప్పటి వరకూ మొత్తం 400 అంగారక గ్రహ శకలాలు మాత్రమే భూమిపై ఉన్నాయి. వాటి అన్నింటిలో ఒక్క ఎన్‌డబ్ల్యూఏ 16788 పరిమాణమే 6.5 శాతంగా ఉందని సోతబైస్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఒక భారీ ఆస్టరాయిడ్ ఢీకొనడంతో అంగారక గ్రహం నుంచి కొన్ని శకలాలు విడిపోయి, ఆవిరైన భాగాల్లో ఒకటి భూమిపై పడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ శకలం భూవాతావరణంలోకి ప్రవేశించి, సహారా ఎడారిలో పడిపోయిందని వివరించారు.

Read Also- Student Missing: స్టూడెంట్ మిస్సింగ్‌ మిస్టరీ.. రూమ్‌లో దొరికిన లేఖలో..

రహస్యాలు వెలికి తీయవచ్చు
ఎన్‌డబ్ల్యూఏ 16788 గ్రహశకలం వేలంపై సోతబైస్ వైస్ చైర్మన్ కసాండ్రా హాటన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఇది భూమిపై గుర్తించిన అద్భుతం. అంగారక గ్రహ రహస్యాలను వెలికితీయడానికి ఎంతో దోహదపడగల సమాచారం ఉన్న డేటాసెట్. ఈ శకలం భూమికి వచ్చి చేరడమే ఒక అద్భుతం” అని పేర్కొన్నారు. ఈ గ్రహశకలంపై భూవాతావరణ ప్రభావం చాలా తక్కువగా పడిందని, దీని రసాయన, భౌతిక లక్షణాలు పెద్దగా మారలేదని వేలం లిస్టింగ్‌లో సోతబైస్ వివరించింది. ఈ మధ్యనే భూమిపైకి వచ్చినట్టుగా అనిపిస్తోందని తెలిపింది.

Read Also- Viral News: 4 బకెట్ల పాలతో వ్యక్తి స్నానం.. అంత ఆనందం ఎందుకంటే?

వేలం సరికాదు

అంగారక గ్రహశకలం వేలంపై కొందరు శాస్త్రవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “దీనిని ఎవరికీ వ్యక్తిగత స్వాధీనం కాకుండా, ప్రజలందరికీ కనిపించే ఒక మ్యూజియంలో ఉంచాలి. అక్కడ పిల్లలు, ఎన్నో కుటుంబాలు వీక్షించే అవకాశం ఉండాలి” అని ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త స్టీవ్ బ్రూసాట్ సూచించారు. కాగా, జులై 15 వరకు న్యూయార్క్ సోతబైస్ గ్యాలరీలో జనాల వీక్షణకు అందుబాటులో ఉంచారు. జులై 16న జరిగే వేలంలో దీనితో పాటు పురాతన రాతిశిలలు, డైనోసార్ అస్థిపంజరాలు, ఇతర అరుదైన ఖగోళ వస్తువులను కూడా వేలం వేయనున్నారు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..