Sneha Debnath
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Student Missing: స్టూడెంట్ మిస్సింగ్‌ మిస్టరీ.. రూమ్‌లో దొరికిన లేఖలో..

Student Missing: టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో నేర పరిశోధనలో (Student Missing) మార్పులు చోటుచేసుకున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని మనుపటి కంటే వేగంగా పోలీసులు కేసులు ఛేదిస్తున్నారు. ఖచ్చితమైన ఆధారాలను సేకరిస్తున్నారు. అయితే, ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ఆత్మా రామ్ సనాతన్ ధర్మ కాలేజీలో చదువుతున్న స్నేహా దేబనాథ్ అనే విద్యార్థిని కనిపించకుండాపోయి వారం రోజులు గడిచిపోయింది. చివరిసారిగా జూలై 7న స్నేహా తన తల్లిదండ్రులతో మాట్లాడింది. ఆ తర్వాత మిస్సింగ్స్ అయింది. వారం రోజులు కావస్తున్నా ఆమె ఏమైందనే దానిపై ఇప్పటికీ చిన్న క్లూ లభించలేదు. స్నేహా గత 4 నెలలుగా తన బ్యాంక్ అకౌంట్ నుంచి ఒక్క రూపాయి కూడా ఉపయోగించలేదని, తనతో పాటు ఏ వస్తువులను తీసుకెళ్లకుండా వెళ్లిందని పేర్కొన్నారు.

రైల్వే స్టేషన్‌కు వెళ్లొస్తానని చెప్పి..

తన ఫ్రెండ్ పిటునియాతో కలిసి ఢిల్లీలోనే ఉన్న రోహిల్లా రైల్వే స్టేషన్‌కు వెళ్తున్నానంటూ జులై 7న ఉదయం 5:56 గంటల సమయంలో స్నేహా తన కుటుంబ సభ్యులకు మెసేజ్ పంపించింది. అయితే, మూడు గంటల తర్వాత ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పిటునియా నంబర్‌కు ఫోన్ చేయగా, స్నేహా తనను కలవలేదని సమాధానం ఇచ్చింది. దీంతో, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కలవరానికి గురయ్యారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా రంగంలోకి దిగారు. స్నేహ ప్రయాణించిన క్యాబ్ డ్రైవర్‌ను గుర్తించి ప్రశ్నించగా, ఆమెను ఢిల్లీ సిగ్నేచర్ బ్రిడ్జ్ సమీపంలో దింపినట్టు చెప్పాడు. అయితే, ఆ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు చాలా తక్కువగా ఉండటంతో, స్నేహా అక్కడ దిగిన తర్వాత ఎక్కడికి వెళ్లిందో గుర్తించలేకపోతున్నామని పోలీసులు వెల్లడించారు.

Read Also- Viral News: 4 బకెట్ల పాలతో వ్యక్తి స్నానం.. అంత ఆనందం ఎందుకంటే?

స్నేహా క్యాబ్ దిగిన ప్రాంతానికి 7 కిలోమీటర్ల పరిధిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఢిల్లీ పోలీసులు, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. అయినప్పటికీ, ఒక వారం గడుస్తున్నా ఇంకా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఈ విద్యార్థిని స్నేహా మిస్సింగ్‌పై త్రిపుర సీఎం మానిక్ సాహా స్పందించారు. తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సీఎంవో కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

రూమ్‌లో దొరికిన లేఖలో..
‘‘సిగ్నేచర్ బ్రిడ్జ్‌ పైనుంచి దూకి నా జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను విఫలమైనట్టుగా అనిపిస్తోంది. భారం అయ్యానని అనిపిస్తోంది. ఇలాంటి జీవితం ఇక భరించలేను’’ అని లేఖలో పేర్కొంది. ఆమె చేతి రాతతోనే ఉన్న ఈ లేఖలో, ఇది పూర్తిగా తన నిర్ణయమని, ఇందులో ఎలాంటి కుట్ర, ఎవరి పాత్ర లేదని స్పష్టం చేసింది. ఎవరూ బాధ్యత వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ లేఖ వెలుగులోకి రావడంతో స్నేహా అదృశ్యంపై దర్యాప్తు మలుపు తిరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు ఆందోళనతో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు.

Read Also- Iran Israel: ఇరాన్‌ అధ్యక్షుడిపై ఇజ్రాయెల్ హత్యాయత్నం.. జస్ట్ మిస్

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు