Mahabubabad District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Mahabubabad District: హాస్పిటల్ పై చర్యలేవి.. ప్రాణాలు తీసిన అధికారులు పట్టించుకోరా!

Mahabubabad District: మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District)లోని తొర్రూరు పట్టణంలో గల ప్రైవేట్ సుప్రీత హాస్పిటల్‌(Supreeta Hospital) విషయంలో తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మూడు రోజుల క్రితం కొడకండ్ల గ్రామానికి చెందిన కొండం పాండురంగారావు (75) అనే వ్యక్తి తేలికపాటి కడుపునొప్పితో ఈ హాస్పిటల్‌ను సందర్శించాడు. అయితే వైద్యం పేరుతో హెవీ డోస్ ఇంజక్షన్ ఇచ్చిన తీరుతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను తట్టుకోలేని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. చిన్న సమస్యతో వచ్చిన వ్యక్తిని అనుమానాస్పదంగా మృత్యువాత పడేలా చేసిన హాస్పిటల్‌ వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటి వరకూ హాస్పిటల్‌పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు మండిపడుతున్నారు.

Also Read: Phone Tapping Case: ఫోన్​ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

బాసటగా నిలుస్తున్నారనే అనుమానాలు

మా వారిని బలితీసిన హాస్పిటల్‌పై కనీసం విచారణ కూడ చేయకపోతే ప్రజల ప్రాణాలకు రక్షణ ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. మూడు రోజులు గడుస్తున్నా జిల్లా మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్‌(DMHO) స్పందించకపోవడాన్ని పలు అనుమానాలకు తావిస్తున్నది. ప్రజల మధ్య తీవ్ర ఆవేదన నెలకొంది. అధికారులు చర్యలు తీసుకోవడం బదులు హాస్పిటల్‌కి బాసటగా నిలుస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన జరిగిన మూడు రోజులు గడిచినా బాధిత కుటుంబానికి మద్దతుగా ఏ ప్రభుత్వ సంస్థా స్పందించకపోవడం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అలాంటి హాస్పిటల్స్‌ కొనసాగితే ప్రజల ప్రాణాలే ముప్పులో పడతాయి. ఇకనైనా అధికార యంత్రాంగం మేలుకొని, న్యాయం జరిగేలా చూడాలి అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

నోటీసులు జారీ చేశాం: డాక్టర్ రవి రాథోడ్(DMHO)
తొర్రూరులో ఇటీవల జరిగిన సంఘటన పై మీడియాలో వచ్చిన కథనాల మేరకు సుప్రీత హాస్పిటల్‌కు నోటీసులు అందించడం జరిగింది. ఈ ఘటన పై హాస్పిటల్ యజమాన్యం ఏలాంటి తప్పు చేసిన హాస్పిటల్ పై తక్షణమే చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబాలు డబ్బులు తీసుకోకుండా మాకు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని డిఎంహెచ్ఓ డాక్టర్ రవి రాథోడ్ తెలిపారు.

Also Read: Viral News: భర్త ఫోన్ చోరీ.. విచారిస్తే భార్య బాగోతం బయటకు..

 

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు