Viral News: కారణాలు ఏమైనా కావొచ్చు, కానీ వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఈ పర్యావసానాలు సామాజికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వివాహేతర సంబంధాలు ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. అంతేకాదు, తీవ్ర నేరాలకు సైతం పురిగొల్పుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఒక వివాహేతర సంబంధం వెలుగుచూసిన విధానం షాక్‌కు గురిచేస్తోంది. ఓ ఫోన్ స్నాచింగ్ ఘటనలో బాధిత వ్యక్తి అక్రమ సంబంధం బయటపడింది. విస్తుపోయే నిజాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఒక వివాహేతర సంబంధాన్ని బట్టబయలు చేసింది.
పోలీసుల విచారణలో నిజాలు
స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తి ఫోన్ కొట్టేశారు. అక్కడి నుంచి పారిపోయారు. ఫోన్ చోరీకి గురవ్వడంతో బాధిత వ్యక్తి వెళ్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన దారిన తాను ఇంటికి వెళ్లిపోయాడు. అయితే, ఆ తర్వాత దర్యాప్తులో నమ్మశక్యంకాని విషయాలు వెలుగుచూశాయి. ఫోన్ చోరీ ఘటనలో బాధిత వ్యక్తి భార్య పాలుపంచుకున్నట్టు దర్యాప్తులో తేలింది. ప్రియుడితో తాను సన్నిహితంగా ఉన్న ప్రైవేటు ఫొటోలు భర్త సెల్‌ఫోన్‌లో ఉండడంతో వాటిని డిలీట్ చేయాలనే పక్కా పథకం ప్రకారం ఫోన్ కొట్టేశారు. ఆ ఫొటోలను భర్త చూడకముందే తొలగించాలనే ఉద్దేశంతో ఈ ప్లాన్ వేశారు. ఫోన్ కొట్టేసిన తర్వాత ప్లాన్ ప్రకారం ఫొటోలు డిలీట్ చేశారు.
Read Also- Screen Time: పిల్లలు మొబైల్ వినియోగంపై అధ్యయనం.. వెలుగులోకి నమ్మలేని నిజాలు
ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాలను దక్షిణ ఢిల్లీ పోలీసు డిప్యూటీ కమిషనర్ అంకిత్ చౌహాన్ మీడియాకు తెలిపారు. ‘‘జూన్ 19న ఓల్డ్ యూకే పెయింట్ ఫ్యాక్టరీ సమీపంలో ఓ స్కూటీపై వచ్చిన ఇద్దరు ఓ వ్యక్తి కొట్టేసినట్టుగా ఫిర్యాదు అందింది. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ ప్రాంతంలోని 70 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించారు. నీలిరంగు టీషర్ట్‌లో ఉన్న నిందితుడిని గుర్తించాం. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాల సాయంతో స్కూటీ నంబర్ ప్లేట్ సమాచారాన్ని కూడా సేకరించాం. దర్యాగంజ్ అనే ప్రాంతంలో ఒక రోజుకు స్కూటీని అద్దెకు తీసుకున్నారు. స్కూటీ అద్దెకు తీసుకున్న వ్యక్తి ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ ఆధారంగా రాజస్థాన్‌లోని బార్మెర్ జిల్లా బాలోత్రాకు వెళ్లి నిందితుల్లో ఒకరైన అంకిత్ గెహ్లాట్‌ను అరెస్ట్ చేశాం. విచారణలో అతడు నిజాలను వెల్లడించాడు’’ అని కమిషనర్ అంకిత్ చౌహాన్ వివరించారు.
Read Also- Jasprit Bumrah: 21 ఏళ్ల యువకుడిని కాదు.. ప్రెస్‌మీట్‌లో బుమ్రా సంచలన వ్యాఖ్యలు
భర్త సమాచారం చేరవేత
బాధితుడి భార్య తన ప్రియుడితో కలిసి ఉన్న వ్యక్తిగత ఫొటోలను భర్త ఫోన్‌లోంచి ఎలాగైనా తొలగించాలని భావించింది. లేదంటే, గొడవలకు దారితీస్తుందని భయపడింది. ఇందుకోసం ఫోన్ స్నాచింగ్ స్కెచ్ వేసింది. పక్కాగా ప్లాన్ చేసి, తన భర్త రొజూ బయటకు వెళ్లే సమయం, ఆఫీస్‌కు వెళ్లే దారి, ఇతర వివరాలను నిందితుడు అంకిత్‌కు చేరవేసింది. ఈ వివరాల ఆధారంగా స్కూటీపై వెళ్లి నిందితుడు అంకిత్ ఫోన్ చోరీ చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బాధితుడి భార్యను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న విషయాన్ని భర్త అప్పటికే గమించాడు. ఆమె నిద్రపోతున్నప్పుడు భార్య ఫోన్ నుంచి ఫొటోలు తన ఫోన్‌లోకి పంపించుకున్నాడు. ఈ విషయం కుటుంబ సభ్యుల ముందుకు చేరుతుందన్న భయంతో ఫోన్ కొట్టేసే పథకానికి భార్య స్కెచ్ గీసినట్టు దర్యాప్తులో బయటపడింది.