Viral News: సిటీల్లో సామాన్యుల జీవితాలు అంత సాఫీగా సాగవు. పెద్ద మొత్తంలో ఉండే జీవన వ్యయాలు కన్నీళ్లు పెట్టిస్తుంటాయి. ముఖ్యంగా బెంగళూరు, ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో మధ్యతరగతివారు జీవించాలంటే ఖర్చులు తడిసి మోపెడవుతుంటాయి. ఇంటి అద్దె, తిండి ఖర్చులు, ప్రయాణ ఛార్జీలు ఇలా ఒకటా రెండా ఉదయం మేల్కొన్న దగ్గర నుంచి నిద్రపోయే వరకు అన్ని ఖర్చుతో కూడుకున్న పనులే. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం సరిగా లేకపోతే క్యాబ్‌లు, ఆటోలు, రాపిడో వంటి వాటిని ఆశ్రయించాలి. అలాంటి పరిస్థితుల్లో జేబులు ఖాళీ అవుతాయి. బెంగళూరు నగరంలో మూడే మూడు నెలలు నివాసం ఉన్న ఓ యువకుడు సిటీ వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. బెంగళూరుని వదిలిస్తే సోషల్ మీడియాలో అతడు పెట్టిన ‘ఫేర్ వెల్’ పోస్టు చర్చనీయాంశంగా మారింది. అంతకంతకూ పెరిగిపోతున్న ఖర్చులు, అరకొర మౌలిక సదుపాయాలపై డిబేట్‌కు దారితీసింది.
చేతిలో మిగలడం లేదు
‘లీవింగ్ బెంగళూరు’ అనే క్యాప్షన్‌తో శశాంక్ టిప్ (@shank_Tip) అనే రెడిట్ (reddit) యూజర్ బెంగళూరు నగరానికి వీడ్కోలు సందేశాన్ని పోస్ట్ చేశాడు. ‘‘బెంగళూరు సిటీని విడిచిపెట్టి వెళ్లిపోతున్నాను. ఇక్కడ మూడే నెలలు ఉన్నాను. చాలా చాలా ఖరీదైన నగరం ఇది. ఇంటి కిరాయి, ఫుడ్, ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు పోనూ చేతిలో పెద్దగా మిగలడం లేదు. కోల్‌కతా లేదా హైదరాబాద్ ఈ రెండింట్లో ఏదో ఒక సిటీకి షిఫ్ట్ అవుతాను. బెంగళూరులో చేసిన జాబ్‌కే ఎక్కువ జీతం, తక్కువ అద్దె, చక్కటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అందుబాటులో ఉంటాయి. బెంగళూరులో రాపిడో బైక్ లేదు, నేనుండే దగ్గర మెట్రో కూడా లేదు. ప్రతి రోజూ 4 గంటలు ఆఫీస్‌కి వెళ్లి వచ్చే ప్రయాణానికి సరిపోతోంది. నేను కృతజ్ఞతలు చెప్పాల్సిన ఒకే ఒక్క విషయం ఏంటంటే, ఇక్కడ వాతావరణం మాత్రం అద్భుతంగా ఉంది’’ అంటూ శశాంక్ తన ఆవేదనను వెలిబుచ్చాడు. ఈ పోస్టుపై చాలా మంది నెటిజన్లు స్పందించారు.
Read Also- Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు మృతిపై మెగాస్టార్ చిరంజీవి సంతాపం
మంచి నిర్ణయమే బ్రదర్..
అనేక మంది నెటిజన్లు శశాంక్ వాదనకు మద్దతు తెలిపారు. ఒక యూజర్ స్పందిస్తూ, ‘‘సిటీని వదిలి వెళ్లడమే చాలా మంచిదని భావిస్తున్నాం. బెంగళూరు సిటీకి ఇదొక అప్రమత్తం లాంటి పరిణామం. ఇక్కడ పనిచేయడం కష్టం కాదు, జీవించడమే కష్టం. నీ నిర్ణయానికి సపోర్ట్ చేస్తున్నాను’’ అని ఓ యువకుడు పేర్కొన్నాడు. మరో వ్యక్తి స్పందిస్తూ, ‘‘శుభాకాంక్షలు తెలియజేస్తు్న్నాను. ఇది గ్రహించి చాలామంది బెంగళూరు విడిచిపెడితే మంచిది. ఎందుకంటే, ఇంత మంది జనాన్ని సిటీ తట్టుకోలేక పోతోంది’’ అని రాసుకొచ్చాడు. ‘‘ఇంటికి వెళ్లే దారిలో 4 గంటల సమయం వృథా అవుతోంది’’ అని పేర్కొన్నాడు.
Read Also- Viral News: హెల్మెట్‌కు సీసీ కెమెరా.. ఎందుకు చేస్తున్నాడంటే?
‘‘బై అండీ!. నిజాయితీ ఆలోచిస్తే నువ్వు మంచి నిర్ణయమే తీసుకున్నావు’’ అని ఇంకొకరు పేర్కొన్నారు. అయితే, శశాంక్ కొత్తగా వెళ్లదలచుకున్న నగరాల ఎంపికపై కొందరు అసమ్మతిని వ్యక్తం చేశారు. ‘‘బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఖర్చులు ఎక్కువ’’ అని ఒకరు రాసుకొచ్చారు. ‘‘శుభాకాంక్షలు బ్రదర్.. బెంగళూరులో ఒంటరి జీవితం చాలా కష్టంగా, బాగా ఖర్చుకున్నది’’ అని పేర్కొన్నాడు. ఓ యూజర్ మాత్రం శశాంక్ వైఖరిని ప్రశ్నించాడు. ‘‘అందరూ బాధపడుతున్నారు కాబట్టి, నేను కూడా బాధపడాలని భావించడం ఇదేం ఆలోచన?’’ అని ప్రశ్నించాడు. మొత్తంగా చూస్తే, ఈ పోస్ట్ చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు. శశాంక్ బాధ చాలామంది ప్రతినిధిగా చెప్పుకోవచ్చు. మంచి జీతం వస్తున్నా జీవితం సుఖంగా లేకపోతే, నగరం ఎంత పెద్దదైనా వదిలి వెళ్లాల్సిందేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.