Gold Rates (13-07-2025): ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే, దేశంలో ఆర్థిక సమస్యల పెరుగుదలతో కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ, పెరుగుతూ ఉన్నాయి. ధరలు పెరిగితే కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రారు. కానీ ధరలు తగ్గితే మాత్రం బంగారం కొనేందుకు జనం ఆసక్తి చూపుతారు. ఎందుకంటే, ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు తప్పనిసరి. శుభకార్యాల్లో మహిళలు బంగారు ఆభరణాలు ధరించి సంతోష పడతారు.
పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెళ్లి సీజన్‌లో బంగారం ధరలు కొంతమేర పెరగడం సర్వసాధారణం, కానీ ఇంత భారీగా పెరగడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,000 గా ఉంది. పెళ్లి సీజన్ ముగిసిన తర్వాత బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని, అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల కారణంగా ధరలు తగ్గవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ, పెరుగుతూ ఉన్నప్పటికీ, నేడు భారీగా తగ్గడంతో మహిళలు గోల్డ్ షాపుకు వెళ్తున్నారు.
24 క్యారెట్ల బంగారం ధర రూ.99,710 గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,400 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,25,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, వరంగల్‌లో బంగారం, వెండి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్ ( Hyderabad ) – రూ.99,710
విజయవాడ ( Vijayawada) – రూ.99,710
విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.99,710
వరంగల్ ( warangal ) – రూ.99,710
22 క్యారెట్లు బంగారం ధర
విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.91,400
వరంగల్ ( warangal ) – రూ.91,400
హైదరాబాద్ ( Hyderabad ) – రూ.91,400
విజయవాడ – రూ.91,400
వెండి ధరలు
గత కొన్ని రోజులుగా వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర మార్కెట్లో రూ.1,06,000 వద్ద ఉండగా.. మరో రూ.19,000 కు పెరిగింది. ప్రస్తుతం, కిలో వెండి రూ.1,25,000 గా ఉంది. ఒక్కో రోజు ఈ ధరలు తగ్గుతున్నాయి, మళ్లీ అకస్మాత్తుగా ధరలు వేగంగా పెరుగుతున్నాయి.
విజయవాడ – రూ.1,25,000
విశాఖపట్టణం – రూ.1,25,000
హైదరాబాద్ – రూ.1,25,000
వరంగల్ – రూ.1,25,000
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.