Selfie Murder
Viral

Viral News: సెల్ఫీ దిగుదామని భర్తను నదిలోకి తోసేసిన భార్య.. సీన్ కట్ చేస్తే..!

Viral News: సమాజంలో మనుషుల మధ్య నమ్మకం పూర్తిగా తగ్గిపోతున్నది. ఎవర్ని నమ్మాలో.. ఎవర్ని దూరం పెట్టాలో కూడా తెలియని పరిస్థితి. కట్టుకున్న భర్తలనే నమ్మించి గొంతుకోస్తున్న ఈ పరిస్థితులతో పెళ్లి, ప్రేమ అనే అంటేనే యువతకు ఒళ్లు జలదరిస్తోంది. ముఖ్యంగా భార్య భర్తల మధ్య జరిగే సంఘటనలు కొన్నిసార్లు విచిత్రంగా ఉన్నా దేవుడా ఇంకెన్ని నేరాలు ఘోరాలు చూడాలో అనే పరిస్థితులు వచ్చేశాయి. ఇప్పటి వరకూ చిత్ర విచిత్రాలుగా భర్తలను భార్యలు లేపేసిన సంఘటనలు మనం చూశాం. అందరిలాగా చేస్తే ఎలా అని ఇప్పుడు రోజుకో కొత్త పద్ధతితో భార్యలు రంగంలోకి దిగుతున్నారు. అసలు నెలకు ఇన్ని మర్డర్లు చేయాలని టార్గెట్ పెట్టుకుంటారేమో కానీ, రోజురోజుకూ భార్యల చేతిలో హత్యకు గురవుతున్న భర్తల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. ఈ ఐదేళ్లలో సుమారు 800 మంది దాకా భార్యల చేతిలో చనిపోయిన భర్తలు ఉన్నారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మహాత్ముడు గాంధీజీ కలలు కన్న మహిళా లోకం ఇదేనా? అంటూ ప్రశ్నలు వస్తున్నాయి. ఇదిగో కర్ణాటక-తెలంగాణ సరిహద్దులోని కృష్ణా నది వద్ద జరిగిన ఓ భయానక ఘటన చూస్తే నిజంగానే భార్యలు ఎందుకిలా తయారయ్యారో తెలియక జుట్టు పీక్కుంటారు అంతే..!

Read Also- Vinutha Kotaa: కోటా వినూత డ్రైవర్ మర్డర్ వెనుక ఏం జరిగింది.. అసలు కథేంటి?

ఇదీ అసలు కథ..
సెల్ఫీ దిగుదామని పిలిచి, భర్తను నదిలో తోసిన సంఘటన రాయచూరు జిల్లాలో చోటుచేసుకున్నది. గ్రామానికి సమీపంలో ప్రవహిస్తున్న కృష్ణా నది వద్ద భర్త తాతప్పను సెల్ఫీ తీసుకుందామని భార్య చిన్ని నదికట్ట వద్దకు తీసుకెళ్లింది. ఈ క్రమంలో ఫోన్ తీసుకొని సెల్ఫీ తీస్తున్నట్లుగా నటిస్తూ భర్తను ఒక్కసారిగా నదిలోకి తోసేసింది. నదిలో కొట్టుకుపోతూ ఓ పెద్ద రాయి వద్ద భర్త చిక్కుకున్నాడు. అరుపులు, కేకలు వేయడంతో అక్కడున్న స్థానికులు తాడు సహాయంతో కాపాడారు. హమ్మయ్యా.. బతికిపోయాను సామీ అని ఊపిరిపీల్చుకున్నాడు ఆ భర్త. ఎందుకిలా జరిగింది..? ఆత్మహత్య చేసుకోవాలని దూకావా..? అంత కష్టం ఏమొచ్చింది..? అని స్థానికులు అడిగారు. దీంతో అసలు విషయం బయటికొచ్చింది. ‘ నేను దూకలేదు మహాప్రభో.. నా భార్యే నన్ను తోసేసింది’ అని భర్త తాతప్ప సమాధానం ఇచ్చాడు. ఇది విన్న స్థానికులు నిర్ఘాంతపోయారు. ఎందుకిలా చేశావని స్థానికులు చిన్నిని నిలదీయగా.. తాను తోయలేదని, అతనే ప్రమాదవశాత్తు జారిపడ్డాడని వాదిస్తోంది. అయితే.. భార్య తనను చంపడానికే ఇలా చేసిందని.. ఇదంతా పక్కా పథకం ప్రకారం నదిలో తోసిందని భర్త చెబుతున్నాడు. ఇదంతా ఒకెత్తయితే.. ఎలాగో భర్తను నదిలో తోసేశాక బతికి బయటికి రాడని భావించి.. అప్పటికే బంధువులు, కుటుంబ సభ్యులకు చిన్ని ఫోన్ చేసి ఇలా నదిలో జారిపడ్డాడని చెప్పడం కూడా మొదలుపెట్టడం గమనార్హం. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నిని అదుపులోనికి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. విచారణలో ఇంకెన్ని నిజాలు బయటికొస్తాయో.. కారణాలు ఏం చెబుతుందో చూడాలి మరి.

Raichur River Incident

ఎక్కడ్నుంచి వస్తాయో..?
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన జనాలు కామెంట్స్ ఓ రేంజిలో కురిపిస్తున్నారు. అసలు ఈ ఆడోళ్లకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో.. ఎవరిస్తారో.. ఏంటో! ఈ ఘటన కుటుంబ సంబంధాల్లోని చీకటి కోణాలను బయటపెట్టిన ఒక షాకింగ్ ఘటన అని చెప్పుకోవచ్చు. సెల్ఫీ నెపంతో ఇంత దారుణమైన నేరానికి పాల్పడిన ఘటన గురించి తెలుసుకుని జనాలు అవావక్కవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్యనే.. కర్ణాటకలోని బళ్లారిలో సెల్ఫీ మర్డర్ జరిగింది. సతీష్ (32), భార్య జయంతి (28) ఇటీవల బళ్లారి జిల్లా తుంగభద్ర నది ఒడ్డున ఉన్న కంప్లీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ సెల్ఫీ దిగాలని భార్య జయంతి.. తన భర్త సతీష్‌ను కోరగా, నది అంచున నిలబడమని చెప్పింది. ఆ తర్వాత సెల్ఫీ తీసుకుంటున్నట్లు నటించి, వెనుక నుంచి సతీష్‌ను నదిలోకి తోసింది. ఈ దృశ్యాలన్నీ జయంతి తమ్ముడు తన మొబైల్‌లో రికార్డు చేశాడు. అయితే.. కుటుంబ సభ్యులను ఇదంతా ప్రమాదవశాత్తు జరిగిందని నమ్మించారు. అయితే, సతీష్ తల్లిదండ్రులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో అసలు నిజాలు బయటికొచ్చాయి. జయంతి ఫోన్‌ను, ఆమెను లోతుగా విచారించగా రికార్డు చేసిన వీడియో బయటపడింది. ఆ వీడియోలో జయంత్ తన భర్తను నదిలోకి తోసేసిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. తాజాగా జరిగిన ఘటనతో ఈ వ్యవహారాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Read Also- Crime News: ‘దృశ్యం-2’ తలపించేలా అత్తను హత్య చేసిన అల్లుడు

 

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్