Warangal MGM hospital (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Warangal MGM hospital: ఎంజీఎం హస్పిటల్‌లో దారుణం.. బతికి ఉన్న వక్తి చనిపోయాడని తెలిపిన సిబ్బంది

Warangal MGM hospital: వరంగల్(Warangal News) జిల్లా ఎంజీఎం హస్పిటల్‌(MGM Hosspital)లో దారుణం జరిగింది. బతికున్న వ్యక్తి చనిపోయాడని గుర్తు తెలియని వ్యక్తి మృత దేహంను బంధువులకు అప్పగిచారు. చికిత్స పొందుతున్న వ్యక్తిని మృతి చెందినట్టుగా హస్పిటల్ యాజచమాన్యం తేల్చిచెప్పింది. అనంతరం దహన సంస్కారాల వద్ద చనిపోయిన వ్యక్తి తమవారు కాదని బంధువులు గుర్తించారు. అంత్యక్రియల సమయంలో వేరే వ్యక్తి మృత దేహం చూసి బంధువులు అవాక్కయ్యారు.

చికిత్స పొందుతున్న కుమారస్వామి
వరంగల్ ఎంజీఎం మార్చురిలో డెడ్ బాడీ వ్యవహారం ఘటనలో బిగ్ ట్విస్ట్ జరిగింది. బ్రతికే ఉన్న కుమారస్వామి చనిపోయారని, రాయపర్తి మండలం మైలారం గ్రామంలో అంత్యక్రియలు నిలిచిపోయిన ఘటనలో బ్రతికే ఉన్న బాధితుడు ఎంజీఎం మానసిక వార్డులో చికిత్స పొందుతున్న కుమారస్వామి చికిత్స పొందుతున్న కుమారస్వామి చనిపోయాడని ఔట్ పోస్ట్ సిబ్బంది తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు. నిన్న వేరొక గుర్తుతెలియని వ్యక్తి డెడ్ బాడీ కుమారస్వామి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంత్యక్రియల సమయంలో ఆ డెడ్ బాడీ తమది కాదని వాపస్ పంపించారు కుటుంభ సభ్యలు.

Also Read: Kavitha on CM Revanth: ఔర్ ఏక్ దక్కా బీసీలకు 42% పక్కా.. కల్వకుంట్ల కవిత

తరలించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
జూలై 09వ తేదీన వరంగల్ రైల్వే పోలీసు(Warangal Railway Police)లు ట్రాక్ పై గాయాలతో పడివున్న వ్యక్తిని ఎంజీఎం(MGM)కి తరలించారు. అదే సమయంలో తొర్రూరు నుండి మరోవ్యక్తిని ఎంజీఎంకి తీసుకొచ్చిన పోలీసులు,108 సిబ్బంది తీసుకువచ్చారు. అయితే రైల్వే పోలీసులు తరలించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. రైల్వే పోలీసులకు అందించాల్సిన సమాచారాన్ని తొర్రూరు పోలీసులకు సమాచారాన్ని అందించారు. కుమారస్వామి చనిపోయాడని బంధువులకు డెడ్ బాడీ అప్పగించారు. అంత్యక్రియలకు తీసుకువస్తున్న సమయంలో కుటుంబ సభ్యులు అతనిని గుర్తించి షాక్‌కి గురయ్యాడు. తప్పుడు సమాచారం పై ఎంజీఎం అధికారులు ఎక్వైరి చేస్తున్నారు.

Also Read: Bhatti Vikramarka: తెలంగాణలో రోహిత్ వేముల చట్టం.. భట్టి విక్రమార్క

 

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?