Mahesh Kumar Goud( image credit; TWITTER)
Politics

Mahesh Kumar Goud: కాంగ్రెస్ చేసిన పనికి కల్వకుంట్ల కవిత రంగులు

Mahesh Kumar Goud: బీసీ రిజర్వేషన్లు రాహుల్ గాంధీ ఎజెండా అని, దాన్ని కమిట్‌మెంట్‌తో పూర్తి చేసిన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని పీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) పేర్కొన్నారు. బోనాల సందర్​భంగా ఆయన గాంధీభవన్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నదన్నారు. ఈ నిర్ణయం వెనుక ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆశయం ఉన్నదన్నారు.

 Also Read: MLA Raja Singh: బీఆర్ఎస్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వార్తలొస్తున్నాయి

బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ

రాహుల్ గాంధీ ఆశయాన్ని నెరవేర్చిన అగ్రవర్ణానికి చెందిన ముఖ్యమంత్రి (Revanth Reddy) రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి (Ponnam Prabhakar) పొన్నం ప్రభాకర్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మరోసారి నిరూపితమైందన్నారు. బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ (Congress Party)  ఎనలేని కృషి చేస్తున్నదన్నారు.

బీసీ రిజర్వేషన్లు కవితకు ఏం సంబంధమని ప్రశ్నించారు.  (Kavitha) కవితకు ఎలాంటి భవిష్యత్ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ  ర్టీ (Congress Party)   పూర్తి చేసిన పనికి కవిత సంబురాలు నిర్వహిస్తుందన్నారు. ఇంత కంటే విచిత్రం మరోకటి లేదన్నారు. కవితను చూసి జనాలు నవ్వుకుంటున్నారని చురకలు అంటించారు. కేసీఆర్ పదేళ్ల పాటు బీసీల పట్ల చిన్న చూపు చూస్తే కవిత ఏం చేసిందని ప్రశ్నించారు. కవిత డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

 Also Read: KCR: యశోద ఆసుపత్రిలో చేరిన కేసీఆర్.. మరోసారి వైద్య పరీక్షలు

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?