BC Reservations: తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఎన్నికల్లో, వివిధ రకాల పదవుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం హర్షించదగ్గ విషయమని మహబూబాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఘనపురపు అంజయ్య వెల్లడించారు. స్థానిక అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బీసీ(BC)లకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని పార్లమెంటుకు పంపడం రేవంత్ రెడ్డి రాజకీయ దక్షతకు అద్దం పడుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ(Congress) అంటే మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వాన్ని ఇటీవలనే రైతులకు రుణమాఫీ రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్ సర్వీసు, అంతేకాకుండా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సుల నిర్వహణను అప్పగించి కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని నిరూపించుకుందని తెలిపారు.
నిరుపేదల సంక్షేమం కోసం కృషి
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే నిరుపేదలకు అండగా నిలుస్తూ వారి సంక్షేమం కోసం కృషి చేసే ప్రభుత్వమని అర్బన్ అధ్యక్షుడు అంజయ్య పేర్కొన్నారు. ఇటీవలనే నిరుపేదలకు ఎన్నో రకాల సంక్షేమ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని తెలిపారు. త్వరలోనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా(Indiramma’s spiritual assurance) సైతం ఇవ్వనున్నట్లు చెప్పారు. నిన్న కాక మొన్న మానుకోట అభివృద్ధి కార్యక్రమాల్లో 400 కోట్ల రూపాయలు ఎన్నడు లేనివిధంగా గత మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు అదేవిధంగా తెలంగాణ(Telangana) రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి రేవంత్ రెడ్డి(Revanth Reddy) గారితో పయనిస్తూ తన అడుగులో అడుగు వేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సలహాలు మేం నరేందర్ రెడ్డి గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాంమని అన్నారు.
లంబాడి సోదరులు ముందంజలో
అదేవిధంగా నిన్నగాక మొన్న టిఆర్ఎస్(BRS) నాయకులు జరిగింది సోదరీ సత్యవతి రాథోడ్(Satyavati Rathod) గారికి ఒక సోదరుడు చేస్తున్నాను తను ఆదివాసి గిరిజనపెట్టే మీరు గిరిజన బిడ్డ మిమ్ములను మీరు కించపరుచుకునే విధంగా వ్యవహరించవద్దని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా మారుమూల ప్రాంతానికి విద్యకు దూరమై అన్ని రకాల దోపిడీలు వర్గాలు ఇవాళ సోనియా ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్ వల్ల మీరు మంత్రులు కాగలరని ఈరోజు కాంగ్రెస్(Congress) పార్టీ చేసిన త్యాగాలను విశ్వసించొద్దు ఇవాళ ఈ జిల్లాలో లంబాడి సోదరులు ముందంజలో ఉన్నారంటే పనులు 76 ఇందిరగాలని తీసుకొచ్చిన చట్టం మీకు ఉపయోగపడ్డది అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా మరొకసారి టిఆర్ఎస్(BRS) నాయకులు రోజుకో రకంగా కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే విధంగా కాంగ్రెస్ నాయకత్వాన్ని మానసికంగా దెబ్బకొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు బలహీనపరిచే విధంగా కాంగ్రెస్ నాయకత్వాన్ని మానసికంగా దెబ్బకొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: Harish Rao on KCR: మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది కేసీఆరే.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు!
తొమ్మిది రోజులలోనే తొమ్మిది వేల కోట్లు
తెలంగాణ విద్యార్థుల్ని, ఉద్యమకారుల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి విశ్వరించి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీ అని చెప్పి రాజకీయ మా పార్టీగా మార్చి తర్వాత బీఆర్ఎస్(BRS) పార్టీ మార్చి తెలంగాణ ప్రజలను మరొక్కసారి మోసం చేసింది కేసీఆర్(KCR) కేటీఆర్(KTR) లే అన్నారు. ఇవాళ ఎంతోమంది అమరవీరుల ఎన్నో త్యాగాల ఫలితంగా మన దేశంలో 29 రాష్ట్రంగా సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చారని తెలిపారు. ఏనుగు వెలక్కాయ మింగితే లోపలికి గుబం పోతుంది. వెలక్కాయ తిరిగి బయటకు వస్తుంది. ఏనుగు మింగిన వెలక్కాయ లాగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి చేసిన ఘనత గత సీఎం కేసీఆర్ దేనని మండిపడ్డారు. తెలంగాణలో కాలేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్ష కోట్ల నిర్వీర్యం చేసిన ఘనులు కల్వకుంట్ల ఫ్యామిలీ అని గుర్తు చేశారు.
తెలంగాణ ఆర్థిక పరిస్థితిని మొత్తం లూటీ చేసి వెళ్ళిపోతే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి లూటీచేసిన వాటికి అప్పులు కడుతూ నిరుపేదల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని వెల్లడించారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ చేసిన ధ్వంసాన్ని తిరిగి సరిచేయడానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. నిన్న గాక మొన్న తొమ్మిది రోజులలోనే తొమ్మిది వేల కోట్లను ఒక కోటి 49 లక్షల 39వేల 111 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. ఈరోజే నిరుద్యోగుల కోసం 22వేల ఉద్యోగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసిందని చెప్పారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు కుట్ర
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో(Local Body Elactions) కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను దెబ్బకొట్టేందుకు టిఆర్ఎస్(BRS) నాయకులు కుట్ర చేస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ సెంటిమెంటు తీసుకొచ్చి సింపతి పొంది స్థానిక సంస్థలు ఎన్నికల్లో గెలుపొందాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్(TRS) నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారని, ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన శాస్తి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు, యువత యావత్ విజ్ఞతతో బిఆర్ఎస్ చేసిన కుట్రలను కుతంత్రాలను గమనిస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ఉద్యమకారులను మర్చిపోయిన టిఆర్ఎస్ పార్టీ మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు పొందుదామని బ్రమ పడుతుందని, కానీ తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తారని ఆశించారు.
Also Read: Uttam Kumar Reddy: గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణకు అన్యాయం!
ఉద్యమకారులను విస్మరించిన పార్టీ బిఆర్ఎస్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన ఉద్యమకారులను బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా విస్మరించిందని అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజయ్య అన్నారు. ఉద్యమకారులు రోడ్ల వెంబడి తిరుగుతుంటే చాలా బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులను ఆదుకోవాల్సిన బీఆర్ఎస్ పార్టీ వాళ్లను అట్టడుగులో ఉంచడం అనే ధ్యేయంగా పని చేసిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ఉద్యమకారులు, కళాకారులు 9 మందికి ఒక్కొక్కరికి రూ.కోటి, 300 గజాల చొప్పున ఇస్తూ వారికి రాష్ట్ర పురస్కారం ఇచ్చి గౌరవించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. అంతేకాదు దళిత బిడ్డ గద్దర్ పేరిట తెలంగాణ రాష్ట్ర తరపున అవార్డులు అందజేయడం సీఎం రేవంత్ రెడ్డి పాలనకు అడ్డం పడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి అమలు చేసి తీరుతుందని స్పష్టం చేశారు.
ఉద్యమకారులను, తెలంగాణ ప్రజలను విస్మరించి వేల ఎకరాల్లో ఫామ్ హౌస్ లు, పెద్దపెద్ద భవంతులు కట్టుకుని విలాసమైన జీవితం అనుభవిస్తున్నారని చెప్పారు. తెలంగాణ తెచ్చింది కల్వకుంట్ల ఫ్యామిలీ కోసమేనా అని రాష్ట్రవ్యాప్తంగా చర్చ సైతం సాగుతుండడం గమనార్హం. పెట్రోల్ పోసుకున్న హరీష్ రావుకు అగ్గిపెట్టె దొరకలేదా అని ప్రశ్నించారు. అమాయకుడైన శ్రీకాంతాచారి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘనత బీఆర్ఎస్ నాయకులకు దక్కిందన్నారు. శవాల మీద పేలాలు వేరుకునే రకంగా బిఆర్ఎస్ నాయకుల ప్రవర్తన ఉందని మండిపడ్డారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గాని, మూడేళ్ల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గాని తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ నాయకులకు తగిన బుద్ధి చెప్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: Viral News: చాక్లెట్ తీసుకోలేదని మహిళను చంపేశాడు.. సీన్ కట్ చేస్తే..!