Rangareddy district( IMAGE CREDIT: SWETCHA REPORTER)
రంగారెడ్డి

Rangareddy district: ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌లో రంగారెడ్డి జిల్లా టాప్

Rangareddy district:  సొంతింటి కలను నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నాటి హామీ అయిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తుంది. ఈ పథకాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ప్రభుత్వం, క్షేత్రస్థాయిలో ఇళ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు త్వరగా ప్రారంభించేలా అధికారులతో కసరత్తు చేయిస్తుంది. రాష్ట్రంలో అత్యధిక ఇళ్లు రంగారెడ్డి జిల్లాకే మంజూరవగా, అత్యధికంగా గ్రౌండింగ్ అయిన జిల్లాల్లో రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) అగ్రస్థానంలో నిలిచింది. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి (Collector Narayana Reddy) ప్రత్యేక శ్రద్ధ వహించడం, తరచుగా సమీక్షలు నిర్వహించి అధికారులను అప్రమత్తం చేయడంతో జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి.

సాకారమవుతున్న సొంతింటి కల..
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ (Congress)  ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేద ప్రజలకు సొంతింటి కలను సాకారం చేస్తుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించి, తొలి ప్రాధాన్యతగా సొంత ఇంటి స్థలం ఉన్నవారికే మంజూరు చేసింది. గ్రామ సభలలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులు పారదర్శకంగా పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రభుత్వం రూపొందించిన ఇందిరమ్మ యాప్ ద్వారా గత ఏడాది అక్టోబర్, నవంబర్ మాసాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ సిబ్బంది మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ ఇల్లు (Indiramma’s house) కోసం దరఖాస్తు చేసుకున్నవారి ఇళ్లకు వెళ్లి సర్వే చేశారు.

Also Read: Mahesh Kumar Goud: కమ్యూనిస్టు భావజాలానికి మరణం లేదు.. పీసీసీ చీఫ్ సంచలన కామెంట్స్

ఫొటోలు తీసి వారి వివరాలు సేకరించి యాప్‌లో నమోదు చేశారు. ఈ సర్వే ద్వారా లబ్ధిదారులను నాలుగు కేటగిరీలుగా గుర్తించారు. ఈ ఏడాది జనవరి 26న ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలతో పాటు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా అధికారులు సైతం ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. సొంతింటి కల సాకారం అవుతుండటంతో లబ్ధిదారుల్లో సంతోషం వ్యక్తమవుతుంది.

ముందంజలో రంగారెడ్డి జిల్లా..
రంగారెడ్డి జిల్లాలో 21 మండలాలు, 19 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma Housing Scheme) అమలవుతుంది. ఆరు నియోజకవర్గాల పరిధిలో 17,440 ఇళ్లకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. వీటిలో 10,897 (63.2 శాతం) ఇళ్లు ప్రారంభమయ్యాయి. గ్రౌండింగ్ అయిన వాటిలో 2,858 (26.23 శాతం) ఇళ్లు పునాదుల వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి. 81 గోడల వరకు, 39 స్లాబ్ వరకు పూర్తయ్యాయి. శంషాబాద్ మండలం సుల్తాన్‌పల్లికి చెందిన చాకలి కళమ్మకు సంబంధించిన ఒక ఇంటి నిర్మాణం పూర్తయింది. దీంతో ఆమెకు విడతల వారీగా మొత్తం రూ.5 లక్షల బిల్లును ఆమె ఖాతాలో జమ చేశారు. నాలుగు దశల్లో పనుల పురోగతిని పరిశీలించి అధికారులు ప్రతి  బిల్లులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.

ఈ క్రమంలో (Ranga Reddy District) రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు వివిధ దశల్లో ఉన్న సుమారు 1500 ఇళ్లకు బిల్లుల చెల్లింపులు జరిగాయి. ఖాతాల వివరాలు సరిగా లేక బిల్లులు రానివారి వివరాలను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ఎప్పటికప్పుడు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తుండటంతో వారికి కూడా బిల్లుల చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ నారాయణ రెడ్డి వారంలో రెండు రోజులు సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే తక్షణం పరిష్కరిస్తున్నారు. దీంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా సాగుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 23 మంది ఏఈలు ఇళ్ల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారని, మరో పది మంది ఏఈల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు హౌసింగ్ పీడీ చంప్లా నాయక్ తెలిపారు. వివిధ కారణాల వల్ల ఎవరైనా ఇళ్లు వద్దనుకుంటే వారి స్థానంలో అర్హులైన ఇతర లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియను కూడా చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.

 Also Read: Bandi Sanjay: టీటీడీ ఏమైనా సత్రమా.. అన్యమతస్తులను తొలగించరా.. ఏపీ సర్కార్‌పై బండి ఫైర్!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు