Mahesh Kumar Goud( image credit: swetcha reporter or twitter)
నార్త్ తెలంగాణ

Mahesh Kumar Goud: కమ్యూనిస్టు భావజాలానికి మరణం లేదు.. పీసీసీ చీఫ్ సంచలన కామెంట్స్

Mahesh Kumar Goud: కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల అనుబంధం విడదీయరానిదని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) వ్యాఖ్యానించారు. ప్రజా ప్రయోజనాల కోసమే ఈ రెండు పార్టీలు పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు.  (Hyderabad) హైదరాబాద్‌లోని సీపీఐ మఖ్దూమ్ భవన్ కార్యాలయ పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. మఖ్దూమ్ సాహితీ, రాజకీయ వైభవానికి ప్రతీకగా నిలిచారని గుర్తు చేశారు. సింగరేణి కార్మికులతో ఆయనకు ఉన్న అనుబంధం ఎనలేనిదని, బద్దం ఎల్లారెడ్డి, వెంకట్ రెడ్డి లాంటి యోధులతో కలిసి సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన ఘనత మఖ్దూమ్‌ది అని కొనియాడారు. కమ్యూనిస్టు భావజాలానికి, సిద్ధాంతాలకు ఎప్పుడూ మరణం లేదని ఆయన వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసి విజయం

Also ReadMulugu District: హిడ్మా తప్పించుకున్నాడా? కర్రెగుట్టల వద్ద మళ్లీ కూంబింగ్

ఆపరేషన్ కగార్‌పై ఆగ్రహం..
ఆపరేషన్ కగార్   (Operation Kagar) పేరుతో కేంద్రం అడవుల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టే ప్రయత్నం చేస్తుందని మహేశ్ కుమార్ (Mahesh Kumar Goud) గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. మావోయిస్టులు చర్చలకు సిద్ధమని ప్రకటించినా కేంద్రం మానవత్వం లేకుండా కాల్పుల విరమణను ఉల్లంఘించి దాడులకు పాల్పడటం దారుణమని, ఇందులో మహిళలు, పిల్లలు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  (Operation Kagar) ఆపరేషన్ కగార్‌పై రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన మరుసటి రోజే తనపై ‘అర్బన్ నక్సలైట్’, ‘దేశద్రోహి’ ముద్ర వేయడం వెనుక కుట్రలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

రాజకీయ స్వార్థాలకు ఎన్నికల సంఘం బలి..
దేశంలో ఎన్నికల సంఘం (ఈసీ) తీరుపై కూడా మహేశ్ కుమార్ (Mahesh Kumar Goud) గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. “ఎలక్షన్ కమిషన్ కొందరి ప్రయోజనాలకు దాసోహంగా మారడం దురదృష్టకరం. బీహార్‌లో ఓట్ల తొలగింపు ప్రక్రియ ఒకే పార్టీకి మేలు చేసేలా సాగింది. సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్న ఈ అంశంపై ఇండియా కూటమి పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది” అని మహేశ్ కుమార్ ( (Mahesh Kumar Goud) గౌడ్ అన్నారు. బీజేపీ దేశంలో ఫాసిస్టు పాలనను తీసుకువస్తుందని, డ్రాప్ అవుట్‌లను అడ్డుపెట్టుకొని హిందూత్వ కార్డును ప్లే చేస్తుందని, ప్రజాస్వామ్య విలువలకు బీజేపీ చెక్ పెడుతుందని ఆయన ఆరోపించారు.

 Also Read: Damodar Rajanarsimha: కల్లులో కల్తీ నిజమే పరీక్షల్లో నిర్ధారణ.. బాధ్యులపై సీరియస్ యాక్షన్

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..