Ponnam Prabhakar: తాజాగా శిక్షణ పూర్తి చేసుకున్న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు అంకితభావంతో విధులు నిర్వర్తించడం ద్వారా రవాణా శాఖకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్యను తగ్గించేందుకు కృషి చేయాలని వారికి సూచించారు.
Also Read: Tummala NageswaraRao: తెలంగాణకు యూరియా సరఫరా.. కేంద్రంతో సంప్రదింపులు.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
బుధవారం ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన ఏఎంవీఐల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రాష్ట్ర రవాణా శాఖ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు. చట్టాలపై సమగ్ర అవగాహన పెంచుకుని వాటిని సమర్థవంతంగా అమలు చేయాలని నూతన సూచించారు.
మొత్తం 113 ఏఎంవీఐ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా, 96 మంది ఎంపికై శిక్షణ పూర్తి చేసుకోవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. వీరిలో రైల్వే, పోలీస్ విభాగాల్లో గతంలో పని చేసిన వారు కూడా ఉన్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఎలక్ట్రానిక్, సీఎన్‌జీ, ఎల్‌పీజీ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పలు ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి ముందు మంత్రి శిక్షణ పూర్తి చేసుకున్న వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణ సమయంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read: Telangana Politics: బీఆర్ఎస్ నాయకులకు అధికారం పోయిన.. అహంకారం పోలేదు: మహిళ శిశు సంక్షేమ శాఖ చైర్మన్