Telangana Politics ( Image Source: Twitter)
తెలంగాణ

Telangana Politics: బీఆర్ఎస్ నాయకులకు అధికారం పోయిన.. అహంకారం పోలేదు: మహిళ శిశు సంక్షేమ శాఖ చైర్మన్

Telangana Politics: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నేతలకు అధికారం కోల్పోయిన అహంకారం ఇంకా పోలేదు. చింత చచ్చిన పులుపు చావని సందంగా చిల్లర రాజకీయం చేయడం మొదలుపెట్టారు. కేటీఆర్ ని డ్రామా రావు అని మీడియా సాక్షిగా నిరూపించుకున్నారు. రాష్ట్రంలో ఏ జాతి బిడ్డకి అన్యాయం జరిగిన ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ముందుగా స్పందించేది మంత్రి సీతక్క రాష్ట్రంలో ఏ జాతి బిడ్డకు అన్యాయం జరిగినా అధికారంలో ఉన్న.. ప్రతిపక్షంలో ఉన్న ముందుగా స్పందించేది సీతక్కే అన్నారు. టిఆర్ఎస్ నేతలు సీతక్కని రాజకీయ కోణంలో టార్గెట్ చేసుకొని మాట్లాడడం సిగ్గుగా లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఆదివాసి బిడ్డగా ఆమె ప్రజలకు సేవ చేస్తుంటే ఓర్వలేక ఉన్నారు. ఆదివాసి బిడ్డగా ప్రజలకు సేవ చేస్తుంటే బిఆర్ఎస్ నాయకులు పూర్వ లేక పోతున్నారన్నారు. టిఆర్ఎస్ నేతలకు సీతక్క చేసిన ద్రోహం ఏమిటి అని ప్రశ్నిస్తున్నాను. నిజాయితీగా బతకడం.. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం సీతక్క నైజం.

Also Read: Viral News: 30 రోజుల్లో రూ.20 లక్షలు అప్పుతీర్చిన మహిళ.. ఆలస్యమెందుకు మీరూ కానిచ్చేయండి!

నిజాయితీగా బతకడం.. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం సీతక్క నైజం..

అబద్ధాల పునాదులపై పుట్టిన టిఆర్ఎస్ పార్టీ నేతలకు ఇది నచ్చడం లేదు. దోచుకొని దాచుకునేటోళ్లే రాజకీయంలో ఉండాలన్న చందంగా కేటీఆర్ వివరిస్తున్నారు. రాజకీయాలకతీతంగా సీతక్కకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. సీతక్కను అభాసుపాలు చేసే బిఆర్ఎస్ నాయకులు తీరుతో రాజకీయాలకు అతీతంగా సీతక్కకు ప్రతి ఒక్కరు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. మాలోతు కవిత పార్లమెంట్ సభ్యులుగా ఉండి నియోజకవర్గాన్ని ఏం చేశావో చెప్పాలి. కేవలం కేసీఆర్, కేటీఆర్ ని ప్రసన్నం చేసుకోవడం కోసమే సీతక్కని పనిగా పెట్టుకుని విమర్శిస్తున్నారు. జాతి పేరు చెప్పుకుంటూ పబ్బం గడుపుకున్నారే ఆ జాతి బిడ్డల కోసం కవిత ఏం చేశారో చెప్పాలి. ఖమ్మంలో పచ్చి బాలింతలైన గిరిజన మహిళలను జైల్లో పెట్టినప్పుడు కవిత ఆ రోజు మీ నోరు పడిపోయిందా.? పోడు చేసుకుంటున్న ఆదివాసి బిడ్డలను చెట్టుకు కట్టేసినప్పుడు ఎక్కడ పండుకున్నారు. కవిత గిరిజన రైతులకు బేడీలు వేసినప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్న. పువ్వాడ అజయ్, వెంకటేశ్వర్లు వల్ల కుటుంబాలు జీవితం చాలించినప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్న. అదే నేరెళ్ల ఘటనలో ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్న. టిఆర్ఎస్ హయాంలో అన్ని అరాచకాలే చేసినప్పుడు కవితకు కనబడలేదా పేదలకు ఇల్లు ఇవ్వాలని పది సంవత్సరాలు మీకు కనబడలేదా కవిత బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నాలు మానుకోండి. సీతక్కని విమర్శించే నైతిక హక్కు మీకుందా? ఆకాశం పై ఉమ్మితే ఏమవుతుందో మీ బతుకులు కూడా అలాగే అవుతుంది.

టిఆర్ఎస్ కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేస్తుంది. బలహీన వర్గాలు బిడ్డలు రాజకీయంలో ఉంటే సహించలేకున్నారు టిఆర్ఎస్ దొరలు. ఉమా మీకు సామాజిక స్పృహ లేదా ఎవరు మెప్పు పొందడం కోసం ఇలాంటి ప్రకటన చేస్తున్నారు. టిఆర్ఎస్ హయంలో మంథని నియోజకవర్గం లో ఆడబిడ్డను నరికి చంపినప్పుడు మీకు కనబడలేదా? దోచుకోవాలి.. దాచుకోవాలి అన్న చందంగా టిఆర్ఎస్ వ్యవహరించడం వాళ్లు నైతిక విలువలకు వదిలేస్తున్నాం. మళ్లీ పదేపదే సీతక్కని విమర్శిస్తే నీకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నాం.

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?