Bihar’s Supaul district: వివాహేతర బంధాలు.. మానవ సంబంధాలను అదః పాతాళానికి నెట్టివేస్తున్నాయి. భార్యలు భర్తలను, భర్తలు భార్యలను చంపుకునేలా చేస్తున్నాయి. పచ్చటి కాపురాల్లో చిచ్చు రాజేస్తూ.. కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న అల్లుడ్ని మామ చితకబాదాడు. ఆపై అతడికిచ్చి వివాహం జరిపించాడు. ఈ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే..
బీహార్ సుపౌల్ జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. భీంపూర్ పీఎస్ పరిధిలో జీవ్‌ఛాపూర్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల మిథిలేష్ కుమార్ (Mithilesh Kumar)ను.. జులై 2వ తేదీన అతడి మామ శివ చంద్ర (Siva Chandra).. బలవంతంగా ఇంట్లో నుంచి లాకెళ్లారు. తన భార్య రీటా దేవితో అతడికి వివాహేతర సంబంధం ఉందంటూ పెద్దల సమక్షంలోనే చితకబాదాడు. శివచంద్ర అనుచరులు సైతం రాడ్లు, కర్రలతో మిథిలేష్ పై దాడికి తెగబడ్డారు.
నుదిటిన సిందూరం పెట్టించి
అయితే అల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న తన భార్య రీటాను ఇకపై ఆదరించబోనంటూ శివచంద్ర.. అందరిముందు తెగేసి చెప్పాడు. తన కాపురంలో నిప్పులు పోసిన మిథిలేష్ కుమారే.. తన భార్య బాధ్యతలు తీసుకోవాలని సూచించాడు. తన భార్యను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తూ రీటా దేవి నుదుటిపై బలవంతంగా మిథిలేష్ చేత సిందూరం పెట్టించాడు. వారిద్దరి పెళ్లి జరిగిపోయినట్లు అందరి ముందు ప్రకటించాడు. ఈ క్రమంలో అడ్డుపడ్డ మిథిలేష్ తల్లిదండ్రులపై సైతం శివచంద్ర అనుచరులు దాడి చేశారు.
Also Read: Shubhanshu Shukla: శుభాంశు రోదసి యాత్రలో ట్విస్ట్.. మరో 4 రోజులు వేచి చూడాల్సిందే!
రంగంలోకి పోలీసులు
గ్రామంలో జరుగుతున్న ఈ రచ్చనంతా చూసిన కొందరు స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. హుటాహుటీన ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే పోలీసులను చూడగానే శివ చంద్ర అతడి అనుచరులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రగాయాలతో ఉన్న మిథిలేష్ ను వెంటనే ఆస్పత్రికి తరలించాడు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పారిపోయిన శివచంద్ర, అతడి మనుషుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
बिहार के सुपौल जिले में रिश्तों को तार-तार करने वाली घटना सामने आई है. जिले के भीमपुर थाना क्षेत्र में एक भतीजे से जबरदस्ती उसकी चाची की मांग भरवाई गई और शादी कराई गई. दरअसल, परिजनों और ग्रामीणों का आरोप है कि दोनों के बीच अवैध संबंध थे, जिसके चलते गांव वालों ने पहले उनके साथ… pic.twitter.com/p5Md89BvkE
— ABP News (@ABPNews) July 8, 2025