Heroine Affairs: బాలీవుడ్ గ్లామర్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్ ఎఫైర్స్ మరోసారి చర్చనీయాంశమైంది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జర్నీ ద్వారా స్టార్ హీరోలతో ఆమె సాన్నిహిత్యం, వారి భార్యల అసహనం ఆమె కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిందన్న ఆరోపణలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి.
ప్రియాంక చోప్రా, షారూఖ్ ఖాన్ మధ్య ఎఫైర్ ఉన్నట్లు వచ్చిన వార్తలు బాలీవుడ్‌లో కలకలం రేపాయి. ఈ వ్యవహారం గౌరీ ఖాన్‌ను తీవ్రంగా కలచివేసిందని, ఆమె ప్రియాంకను ఇండస్ట్రీ నుంచి దూరం చేయడానికి ప్రముఖ దర్శకనిర్మాతలపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Dating app Scam: వృద్ధుడిపై కన్నేసిన యువకులు.. ఇలా ఉన్నారేంట్రా.. ఇంకెవరూ దొరకలేదా?
కరణ్ జోహార్ వంటి కీలక వ్యక్తులు ప్రియాంకకు అవకాశాలు ఇవ్వకుండా చేసినట్లు సమాచారం. ఈ ఒత్తిడి కారణంగానే ఆమె బాలీవుడ్‌లో అవకాశాలు కోల్పోయినట్లు చెప్పుకుంటున్నారు. అంతే కాదు, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా కూడా ప్రియాంకతో సినిమాల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు దర్శకుడు దర్శన్ వెల్లడించారు.
ఈ ఫ్రెండ్ షిప్ వల్ల ప్రియాంక కెరీర్‌లో వృత్తిపరమైన ఆటంకాలు ఎదురయ్యాయని ఆయన స్పష్టం చేశారు. ఈ సంఘటనలు ఆమె బాలీవుడ్‌లో స్థానాన్ని బలహీనపరిచాయని, అందుకే హాలీవుడ్ వైపు అడుగులు వేసిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ప్రియాంక లాంటి ప్రతిభావంతమైన నటి వ్యక్తిగత సంబంధాలు, ఇండస్ట్రీ రాజకీయాల వల్ల అవకాశాలు కోల్పోవడం బాధాకరం. ఆమె హాలీవుడ్‌లో సాధించిన విజయం ఆమె సత్తాను నిరూపించినప్పటికీ, బాలీవుడ్‌లో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఇండస్ట్రీలోని సంక్లిష్ట వాస్తవాలను బయటపెడుతున్నాయి. ఇలాంటి ఒత్తిడులు, అవాంతరాల మధ్య కూడా ప్రియాంక తన గ్లోబల్ ఇమేజ్‌ను నిలబెట్టుకోవడం ఆమె దృఢత్వానికి నిదర్శనం.
Also Read: Telangana Politics: బీఆర్ఎస్ నాయకులకు అధికారం పోయిన.. అహంకారం పోలేదు: మహిళ శిశు సంక్షేమ శాఖ చైర్మన్