Damodara Rajanarsimha:( IMAGEcredit: swwetchya reporter)
తెలంగాణ

Damodara Rajanarsimha: పేదల‌ వైద్యానికి ప్రజా సర్కార్ భరోసా.. 230 కోట్లతో నూతన ఆస్పత్రికి శంకుస్థాపన!

Damodara Rajanarsimha: నాగర్‌కర్నూల్ లో పేదల వైద్యానికి కాంగ్రెస్ (Congress)  సర్కార్ భరోసా కల్పిస్తోంది. అధునాతన వసతులతో కూడిన నూతన మెడికల్ కళాశాల ప్రారంభంతో పాటుగా కొత్తగా ఆస్పత్రి నిర్మాణం చేపట్టనుంది. సీఎం సహకారంతో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి చొరవతో  నూతన మెడికల్ కళాశాల భవనాలు నిర్మాణాన్ని రాష్ట్ర వైద్య అరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ (Damodara Rajanarasinha) చేతులమీదుగా ప్రారంభించడంతోపాటుగా కొత్త ఆసుపత్రి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

నూతన మెడికల్ కాలేజీ భవనం ప్రారంభం
జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ శివారులో 166 కోట్ల రూపాయలతో నూతనంగా మెడికల్ కళాశాల నిర్మాణమైంది ప్రస్తుతం (Medical College Nursing College) మెడికల్ కళాశాల నర్సింగ్ కాలేజీలో నిర్వహిస్తున్నారు. అయితే మెడిసిన్ విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఈ భవనంలో సౌకర్యాలు లేవు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటుగా ప్రయోగ పరీక్షలకు, ప్రొఫెసర్లకు తగిన వసతులు అందడం లేదు. ఈ క్రమంలో 26ఎకరాల్లో నిర్మాణమైన నూతన మెడికల్ కళాశాల భవనం అందుబాటులోకి రానుండటంతో విద్యార్థులు, ప్రొఫెసర్లకు మెడిసిన్ విద్య అందించడంలో పూర్తిస్థాయి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ భవనంలో ప్రొఫెసర్లకు క్వార్టర్లు, విద్యార్థులకు వసతి కలుగుతుంది.

 Also Read: Mulugu District: హిడ్మా తప్పించుకున్నాడా? కర్రెగుట్టల వద్ద మళ్లీ కూంబింగ్

230 కోట్లతో నూతన ఆస్పత్రి
ఇక 230 కోట్ల రూపాయలతో 550 పడకల భారీ ఆసుపత్రి నిర్మాణానికి అలాగే తూడుకుర్తిలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పనులకు శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarasinha) శంకుస్థాపన చేయనున్నారు ప్రస్తుత జిల్లా ఆస్పత్రి దశాబ్దాల క్రితం నిర్మాణమైన ఏరియా ఆసుపత్రిలో జిల్లా జల్లెలస్పత్రిగా అప్డేట్ అయి కొనసాగుతోంది వంద పడకలుగా ఉన్న ఆసుపత్రిని 330 పడకలకు పెంచారు. గత మూడేళ్ల క్రితం కొత్తగా పై అంతస్తు నిర్మించారు.

నూతన ఆసుపత్రి భవన నిర్మాణం

అయితే జిల్లా కేంద్రం కావడంతో పాటుగా నల్లమల ప్రాంతం నుంచి రోజూ వేలాదిగా రోగులు ఆసుపత్రికి వస్తున్నారు. ఆసుపత్రిలో సిటీ స్కాన్, ఎక్స్‌రే, డయాలసిస్, ఐసీయూ, బ్లడ్ బ్యాంక్ తదితర సేవలు అందుతున్నాయి. అయితే ప్రస్తుత భవనం పూర్తిస్థాయిలో రోగులకు సేవలు అందించడంలో వైద్యులకు ఇబ్బందికరంగా మారింది. సీజనల్ వ్యాధులు సంభవించే వర్షాకాలంలో ఆసుపత్రి రద్దీగా మారుతుంది. అలాగే గర్భిణీలు, బాలింతలకు, చిన్న పిల్లలకు టీకాలు వేసే సమయంలో ఇంకా ఇబ్బందులు కలుగుతున్నాయి. డాక్టర్లు వైద్యం అందించేందుకు ఇబ్బందులు పడే పరిస్థితులు ప్రస్తుత ఆస్పత్రిలో ఉన్నాయి ఈ నేపథ్యంలో నూతన ఆసుపత్రి భవన నిర్మాణానికి స్థానిక స్థానిక సభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు.

పేదలకు మంచి వైద్యం

గత రెండేళ్ల క్రితం శంకుస్థాపన చేస్తామన్న గత ప్రభుత్వం హయంలో ఇది అటకెక్కింది. డాక్టర్ కూడా ఆయిన ఎమ్మెల్యే పేదలకు ప్రభుత్వం వైద్యం అందేందుకు ధనవంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు జిల్లా ఆస్పత్రిలో సదుపాయాలను కల్పించడంతోపాటుగా మెరుగైన వైద్యం అందించేలా డాక్టర్లతో సమన్వయం చేస్తూ ఆసుపత్రిని సందర్శిస్తున్నారు జిల్లా కలెక్టర్ ఆరోగ్యశ్రీ సీఈవో లాంటి ఉన్నతాధికారుల సైతం ఆసుపత్రి పరిశీలిస్తూ పేదలకు మంచి వైద్యం అందించేలా ఎమ్మెల్యే చొరవ చూపిస్తున్నారు.

 Also Read: Jupally Krishna Rao: ప్రాణాలతో చెలగాటమాడొద్దు.. వారిని వదిలిపెట్టం.. మంత్రి వార్నింగ్!

ఈ క్రమంలో నూతన ఆసుపత్రి భవన నిర్మాణ ఆవశ్యకతను సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. అదేవిధంగా వైద్యారోగ్య శాఖ (Damodara Rajanarasinha) మంత్రి దామోదర రాజనర్సింహతో పాటుగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థిక శాఖ అనుమతి రావడంతో ఎట్టకేలకు పెండింగ్లో ఉన్న ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు మార్గం ఏర్పడింది. మంత్రి దామోదర నూతన మెడికల్ కళాశాల భవనాన్ని ప్రారంభించడంతోపాటు అధునాతన ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. దీంతో రాబోయే కాలంలో నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలకు పూర్తిస్థాయిలో అధునాతన వైద్య సేవలు అందనున్నాయి.

సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు : రాజేష్ రెడ్డి, ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్
నాగర్‌కర్నూల్ ప్రజలకు అన్ని రకాల సేవ చేసేందుకు పనిచేస్తాను ముఖ్యంగా విద్యావైద్యం ప్రాధాన్యతగా నిర్ణయించుకున్నాను. పట్టణంలో 9 కోట్లతో నూతన కళాశాల, 200 కోట్లతో తూడుకుర్తిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణంతో పాటుగా వైద్యంలో పేదలకు అన్ని రకాల వైద్యం అందించేందుకు నూతన ఆసుపత్రి నిర్మిస్తున్నాం. పేదలకు మెరుగైన విద్య, వైద్యం అందించడమే నా లక్ష్యం. ఆస్పత్రి నిర్మాణానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు దామోదర రాజనర్సింహ, ‌జూపల్లి కృష్ణారావు, ‌ఎంపీ మల్లురవి, ఎంఎల్సీ దామోదర్ రెడ్డి పాల్గొంటున్నారు.

 Also Read: Drugs Seized: పబ్బులే కేంద్రంగా దందా.. గుట్టంతా బయటపెట్టిన ఈగల్ టీం!

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?