Uttam Kumar Reddy: గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తెలంగాణకు కృష్ణా జలాల్లో అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. ప్రజా భవన్‌లో బుధవారం తెలంగాణలోని నీటిపారుదల ప్రాజెక్టుల అంశంపై ప్రజాప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత పదేళ్లలో ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, (Kalwakurthi) నెట్టెంపాడు, డిండి, పాలమూరు రంగారెడ్డి, (Ranga Reddy) కోయిల్ సాగర్, బీమా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి ఉంటే కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయం జరిగేదే కాదన్నారు. 1976లో బచావత్ ట్రైబ్యునల్ నీటి కేటాయింపులు చేసిందని, మూడు రాష్ట్రాలకు 2,130 టీఎంసీలు కేటాయించిందని, ఉమ్మడి ఏపీకి 811, కర్నాటక 734, మహారాష్ట్రకు 585 టీఎంసీలు కేటాయించిందని వివరించారు. బచావత్ ట్రైబ్యునల్ తర్వాత కేంద్రం ఆమోదం లేకుండా ఉమ్మడి ఏపీలో ప్రాజెక్టులు చేపట్టారని తెలిపారు.
Also Read: BRS Party: జూబ్లీహిల్స్‌లో మైనార్టీ ఓట్లపై ప్రత్యేక ఫోకస్!
3,850 నుంచి 6,300 క్యూసెక్కులు
తెలంగాణలో 7 ప్రాజెక్టులు చేపట్టినా పూర్తి చేయలేదని వెల్లడించారు. 2025 మార్చిలో తెలంగాణకు 71శాతం కృష్ణాజలాలు ఇవ్వాలని అపెక్స్ కౌన్సిల్ కు లేఖ రాశామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కృష్ణాజలాల్లో ఎక్కువ అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మల్యాల సామర్ధ్యాన్ని 3,850 నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచారని తెలిపారు. 2017లో రాయలసీమకు రోజుకు 1.09 టీఎంసీలు తీసుకునే సామర్ధ్యాన్ని ఏపీ పెంచుకుందన్నారు. అదే విధంగా 2020లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యాన్ని 44 వేల నుంచి 92వేల క్యూసెక్కులకు ఏపీ పెంచుకుందని తెలిపారు. జగన్ పాలనలో గోదాదరి, కృష్ణా జలాలపై ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో (KCR) చర్చించారన్నారు.
కుట్రపూరిత చర్యలు
శ్రీశైలం నుంచి ఏపీకి అక్రమంగా కృష్ణాజలాల తరలింపునకు పునాదులు పడ్డాయని, రాయలసీమ లిప్టు పూర్తయితే (Srisailam) శ్రీశైలం, సాగర్ అవసరాలపై వినాశన ప్రభావం ఉంటుందని చెప్పారు. సాగర్ ఆయకట్టు ఏడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. 2020లో ఏపీకి మేలు చేసేలా కుట్రపూరిత చర్యలు చేపట్టారని ఆరోపించారు. అపెక్స్ కౌన్సిల్ భేటీని గత ప్రభుత్వం కుట్రపూరితంగా వాయిదా వేసిందని మండిపడ్డారు. రాయలసీమ లిప్టు టెండర్లు పూర్తయ్యాక అపెక్స్ కౌన్సిల్ భేటీకి తెలంగాణ హాజరైందన్నారు. అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా వేయక ముందే హాజరైతే బాగుండేదని, రాయలసీమ టెండర్లపై కేంద్రం స్టే విధించేలా చర్యలు ఉండేవేమోనని అభిప్రాయం వ్యక్తం చేశారు.
న్యాయం జరిగేదే కాదు
రాయలసీమ లిప్టు టెండర్ల ప్రక్రియకు పూర్తికి గత ప్రభుత్వం సహరించిందని మండిపడ్డారు. 2019కి ముందే పాలమూరు పూర్తి చేసి ఉంటే తెలంగాణకు న్యాయం జరిగేదే కాదని వెల్లడించారు. ఎన్‌డీఎస్ఏ మార్గదర్శకాలకు లోబడి కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని, అయితే ప్రమాదకరంగా మారిన నిర్మాణాల్లో నీటిని నిల్వ చేయబోమన్నారు. ఎటువంటి కారణాలు లేకుండానే తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు మార్చిన బీఆర్ఎస్ నేతలు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకే చేస్తున్న విమర్శలు ప్రజాక్షేత్రంలో నిలబడవన్నారు. తెలంగాణ రైతాంగం కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఇందులో ఎటువంటి రాజీ ప్రసక్తే లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పష్టం చేశారు.
Also Read: Maharashtra Canteen: క్యాంటీన్‌లో ఎమ్మెల్యే లొల్లి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు.. లైసెన్స్ రద్దు!