Maharashtra Canteen (Image Source: Twitter)
జాతీయం

Maharashtra Canteen: క్యాంటీన్‌లో ఎమ్మెల్యే లొల్లి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు.. లైసెన్స్ రద్దు!

Maharashtra Canteen: మహారాష్ట్ర ముంబయిలో క్యాంటీన్ సిబ్బందితో ఓ ఎమ్మెల్యే గొడవ పడిన సంగతి తెలిసిందే. శివసేన శిందే వర్గం ఎమ్మెల్యే (Shiv Sena MLA) సంజయ్ గైక్వాడ్ (Sanjay Gaikwad).. ప్రభుత్వ ఆకాశవాణి అతిథిగృహంలోని క్యాంటిన్ స్టాఫ్ పై దాడి చేశాడు. తనకు ఆహారంగా ఇచ్చిన పప్పు వాసన వస్తోందంటూ.. పిడిగుద్దులు కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో శివసేన ఎమ్మెల్యే తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫుడ్ సేఫ్టీ అధికారుల దర్యాప్తులో క్యాంటీన్ లోని శుచి, శుభ్రతపై షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి.

అపరిశుభ్రంగా వంటగది
ముంబయిలోని ప్రభుత్వ ఆకాశవాణి అతిథిగృహంలోని ఆహారం నాణ్యతపై ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వీరంగం సృష్టించిన వేళ.. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (Maharashtra Food and Drug Administration) ఫుడ్ శాంపుల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపించింది. ఈ నమూనాలను సేకరించిన కొన్ని గంటల తర్వాత.. క్యాంటీన్ లైసెన్స్ ను రద్దు చేస్తున్నట్లు ఎఫ్‌డీఏ ప్రకటించింది. క్యాంటీన్ లోని వంటగది అపరిశుభ్రతకు సంబంధించి షాకింగ్ విషయాలు తెలియజేస్తూ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం ‘వంటగది నేలపై వ్యర్థపదార్థాలు గుర్తించపడ్డాయి. మాంసాహారం, కూరగాయాలను వేరుగా ఉంచలేదు. తెరిచి ఉన్న చెత్త డబ్బాలు, నేలపై కోడిగుడ్డు పెంకులు దర్శనమిచ్చాయి. చెత్త డబ్బాల దగ్గరే తయారు చేసిన ఆహారాన్ని ఉంచుతున్నారు’ అని ఎఫ్ డీఏ తన రిపోర్ట్ లో పేర్కొంది.

తుప్పుపట్టిన కత్తులు
అంతేకాదు తరిగిన కూరగాయాలను నేలపైనే ఉంచడాన్ని తమ తనిఖీల్లో గుర్తించినట్లు ఎఫ్ డీఏ తెలిపింది. ‘కట్ చేసిన కూరగాయాలను తుప్పు పట్టిన ప్లేట్లలో నిల్వచేశారు. ఈగలు, ఎలుకలు పట్టే పరికరం ఎక్కడా కనిపించలేదు. వెన్న కుండలో చనిపోయిన ఈగలు కనిపించాయి. వంటగదిలో సరైన వెంటిలేషన్ కూడా లేదు. తప్పు పట్టిన కత్తులు సైతం వంటకు వినియోగిస్తున్నారు. వంట మనుషులు చేతికి గ్లౌజ్ లు, యూనిఫామ్ ధరించడం లేదు’ అంటూ మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తాజా నివేదికలో స్పష్టం చేసింది. క్యాంటీన్ లో అపరిశుభ్రమైన వాతావరణం ఉన్న నేపథ్యంలో.. నిర్వాహకులు లైసెన్స్ ను రద్దు చేస్తున్నట్లు ఎఫ్ డీఏ వివరించింది. కాగా ఆకాశవాణి ఎమ్మెల్యే హాస్టల్ క్యాంటీన్‌ (Akashwani MLA Hostel Canteen)ను అజంతా క్యాటరర్స్ నిర్వహిస్తోంది.

Also Read: Tridha Choudhury: ఆ బ్యూటీ పాయింట్ వేసుకోవడం మర్చిపోయిందా.. నెటిజన్ల హాట్ కామెంట్స్ వైరల్ ?

ఆ రోజు ఏం జరిగిందంటే?
మహారాష్ట్రలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ముంబయిలోని ప్రభుత్వ ఆకాశవాణి గెస్ట్ హౌస్ బుల్దానా ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ బస చేశారు. రాత్రివేళ ఫుడ్ కోసం క్యాంటీన్ లో ఆర్డర్ చేయగా అతడికి పంపించిన పప్పు దుర్వాశన వచ్చింది. వెంటనే క్యాంటిన్ వద్దకు టవల్ తో వెళ్లిన ఎమ్మెల్యే దీనిని ఎవరు చేశారంటూ అక్కడి సిబ్బందిని ప్రశ్నించారు. ప్యాకెట్ ఓపెన్ చేసి అక్కడి వారికి చూపించారు. అనంతరం అసహనానికి గురై క్యాంటీన్ ఆపరేటర్ పై ఎమ్మెల్యే దాడికి పాల్పడ్డారు. అతడి చెంపపై కొట్టడంతో పాటు పిడిగుద్దులు కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో అది వైరల్ గా మారింది.

Also Read This: Tridha Choudhury: ఆ బ్యూటీ పాయింట్ వేసుకోవడం మర్చిపోయిందా.. నెటిజన్ల హాట్ కామెంట్స్ వైరల్ ?

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?