Politics

BRS Party: జూబ్లీహిల్స్‌లో మైనార్టీ ఓట్లపై ప్రత్యేక ఫోకస్!

BRS Party: జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ చేజారకుండా బీఆర్ఎస్ పకడ్బందీగా ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఆ నియోజకవర్గంలో (BRS)  బీఆర్ఎస్‌కు పట్టుండటంతో ఉప ఎన్నికల్లోనూ గులాబీ ఎండాను ఎగరవేసేందుకు సన్నద్ధమవుతున్నది. అందులో భాగంగానే ఒక వైపు సర్వేలు, మరోవైపు డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ సెగ్మెంట్లో ఎక్కువగా ముస్లిం మైనార్టీల ఓట్లు అధికంగా ఉండడంతో వాటిపై ప్రత్యేక దృష్టిసారించారు. కుల సంఘాలతోనూ భేటీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అందులో భాగంగానే డివిజన్లకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను నియమించబోతున్నారని సమాచారం.

గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు
త్వరలోనే జూబ్లీహిల్స్ (Jubilee Hills) సెగ్మెంట్‌కు ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. అందుకు ఇప్పటికే అధికారులు, సర్కార్ సన్నద్ధ మవుతున్నది. దీంతో గులాబీ పార్టీ సైతం సిట్టింగ్ స్థానాన్ని పోగొట్టుకోకుండా ఉండేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ క్యాడర్‌కు అధిష్టానం పిలుపు నిచ్చింది. దీంతో క్యాడర్‌ను సన్నద్ధం చేసే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. వరుస సమావేశాలకు శ్రీకారం చుట్టారు. సెగ్మెంట్లు జూబ్లీహిల్స్, (Jubilee Hills) యూసుఫ్ గూడ, వెంగళరావునగర్, ఎర్రగడ్డ, రహమత్ నగర్, బోరబండ డివిజన్లు ఉన్నాయి.

Also Read: CM Revanth Reddy: గులాబీ బాస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఆఫర్!

ఇప్పటికే ఈ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతలను ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, (Dasoju Shravan) పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అప్పగించగా వారు నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. అయితే, ఇంకా పార్టీ క్యాడర్‌కు దగ్గర అయ్యేందుకు త్వరలోనే డివిజన్ల వారీగా ఇన్‌ఛార్జ్‌లను నియమించనున్నట్లు సమాచారం. అందుకు ఇప్పటికే పలువురి పేర్లను పరిశీలించినట్లు తెలిసింది. అదే విధంగా కుల సంఘాలతోనూ భేటీలు నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ప్రతి ఓటు కీలకంగా భావించి విజయమే లక్ష్యంగా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నట్లు సమాచారం.

ఎవరు గెలవాలన్నా మైనార్టీ ఓట్లే కీలకం
జూబ్లీహిల్స్ (Jubilee Hills) నియోజకవర్గంలో 3,89,954 మంది ఓటర్లు ఉండగా 2,03,137 మంది పురుషులు, 1,86,793 మంది మహిళలు, 24 మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నారు. అయితే, ఈ నియోజకవర్గంలో 1.25 లక్షలపైగా మైనార్టీ ఓటర్లు ఉన్నారు. వారే ఏ పార్టీ విజయం సాధించాలన్న కీలకం. దీంతో బీఆర్ఎస్ (BRS) ముందుగానే అలర్ట్ అయ్యి వారి ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు కసరత్తును ప్రారంభించింది. అందులో భాగంగానే మైనార్టీ నేతలతో మాజీ మంత్రి హరీశ్ రావు  Harish) భేటీ అయ్యారు. కలిసి పనిచేసి విజయం సాధిద్దామని పిలుపు నిచ్చారు.

రాబోయేది బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం అని పేర్కొన్నారు. అంతేగాకుండా అసెంబ్లీ సెగ్మెంట్‌లో పార్టీ నిర్వహించిన సర్వేలో గులాబీకే విజయావకాశాలు ఉన్నాయని స్పష్టమైనట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్, (Congress)  బీజేపీ, (BJP) ఎంఐఎం పార్టీలు పోటీచేస్తే ఇంకా ఈజీగా విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు వెల్లడైందని పార్టీ నేతలు తెలిపారు. ఇదే విషయాన్ని క్యాడర్ సమావేశాల్లోనూ వివరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మాగంటి గోపీనాథ్ సంస్మరణ సభలను డివిజన్ల వారీగా నిర్వహించారు.

ఉప ఎన్నికల ఫలితాలపై అధ్యాయనం
మరోవైపు గతంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలపై అధ్యాయనం చేస్తున్నారు. బీఆర్ఎస్ (BRS)  అధికారంలో ఉన్నప్పుడు మునుగోడు, హుజూరాబాద్, మెదక్‌కు జరిగిన బైపోల్‌లో మునుగోడులో మాత్రమే విజయం సాధించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే, మెదక్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మృతి చెందడంతో తిరిగి వారి కుటుంబ సభ్యులకే టికెట్లు ఇచ్చారు. కానీ, ప్రజల నుంచి ఆశించిన సానుభూతి రాకపోవడంతో బీఆర్ఎస్ ఓటమిపాలైంది.

దీంతో అక్కడ జరిగిన లోటుపాట్లను, ఓటమికిగల కారణాలను సైతం అధ్యాయనం చేస్తున్నట్లు తెలిసింది. త్వరలో జరగబోయే జూబ్లీ‌హిల్స్ ఉపఎన్నిక రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు కీలకం కానుంది. దీంతో ఎలాగైనా బైపోల్‌లో విజయం సాధించి పార్టీ క్యాడర్‌లోనూ ఉత్సాహం నింపాలని, మేయర్ పదవిని సైతం కైవసం చేసుకోవాలని భావిస్తున్నది. అయితే, ఈ ఉప ఎన్నికల్లో మాగంటి కుటుంబానికి టికెట్ కేటాయిస్తారా? లేకుంటే మరో అభ్యర్థిని బరిలో నిలుపుతారా? అనేది పార్టీలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే పలువురు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

 Also Read: Suresh Raina: రూట్ మార్చిన రైనా.. సినిమాల్లోకి గ్రాండ్ ఎంట్రీ షురూ!

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు