20 Lakh Debt in 30 Days
Viral

Viral News: 30 రోజుల్లో రూ.20 లక్షలు అప్పుతీర్చిన మహిళ.. ఆలస్యమెందుకు మీరూ కానిచ్చేయండి!

Viral News: డబ్బులు సంపాదించాలని, అప్పులు తీర్చుకొని బాగా ఎంజాయ్ చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. అసలు డబ్బులు అవసరం లేని వాళ్లు ఈ సమాజంలో ఉన్నారా..? అంటే ‘నో’ అనే సమాధానం ఆటోమాటిక్‌గా వచ్చేస్తుంది. అంతా ఓకేగానీ, డబ్బు సంపాదించే మార్గాలు తెలియవు. ఒకవేళ ఉన్నా అందులో లాభ నష్టాలెంతో? అని కంగారు.. అంతకుమించి భయం. అయితే ఇదిగో మీరు ఇప్పుడు చదవబోయే వార్త తెలిస్తే అవునా.. అదెలా సాధ్యం అని ముక్కున వేలేసుకుంటారు.. అంతేకాదు ఇక రెడీ అయ్యి డబ్బులు సంపాదించడానికి రంగంలోకి దిగిపోతారంతే. 35 ఏళ్ల జెన్నిఫర్ అలెన్ (Jennifer Allan) కేవలం 30 రోజుల్లోనే రూ.20 లక్షలు సంపాదించింది. టార్గెట్ పెట్టుకుని మరీ ఈ రేంజిలో సంపాదించుకున్నది. ఈ విషయం తెలుసుకున్న జెన్నిఫర్ ఎలా సంపాదించిందబ్బా?, అంత అప్పులు ఎలా తీర్చింది..? ఆ మార్గమేంటో మాక్కూడా చెప్పొచ్చు కదా? అని ఎదురుచూస్తున్నారు కదా? ఇంకెందుకు ఆలస్యం చకచకా ఈ కథనం చదివేయండి మరి.

Read Also- Bharat Bandh: మా పొట్ట కొట్టొద్దు.. కార్మికులపై కక్ష సాధింపు చర్యలు ఎందుకు?

20 లక్షలు ఎలా సాధ్యం..?
అమెరికాలోని డేలావేర్‌కు చెందిన జెన్నిఫర్ అలెన్ (35) రియల్టర్, కంటెంట్ క్రియేటర్. ఈమెకు ఆర్థిక క్రమశిక్షణ తక్కువ. మొదట్నుంచీ ఇలాగే చేస్తున్న మహిళా.. వైద్య అత్యవసర పరిస్థితులు, కుమార్తె పుట్టిన తర్వాత అమాంతంగా ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచలేదు. తన దగ్గరున్న క్రెడిట్ కార్డును ఆ అవసరాలకు వినియోగించింది. అలా సుమారు రూ.20 లక్షల వరకూ క్రెడిట్ కార్డును వాడి అప్పుల్లో కూరుకుపోయింది. ఈ అప్పులు తీర్చడం ఎలాగో తెలియలేదు. కనీసం మార్గాలు కూడా కనుచూపు మేరల్లో కనిపించట్లేదు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే టెక్నాలజీని వాడుకున్నది. చాట్ జీపీటీ (ChatGPT) నుంచి సలహాలు తీసుకొని అప్పులు తీర్చాలని అనుకున్నది. అంతేకాదు ఇందుకోసం 30 రోజుల ఛాలెంజ్‌ను కూడా చేపట్టింది. తనకు నెలకు వచ్చే ఆదాయం, ఖర్చులు, ఆస్తులు, అప్పులు అన్నీ చాట్ జీపీటికి వివరంగా చెప్పింది. వాటన్నింటినీ నిశితంగా పరిశీలించిన చాట్ బాట్ డబ్బు ఆదా చేయడానికి 30 రోజుల ప్రణాళికను డిజైన్ చేసి ఇచ్చింది. ఆ మాస్టర్ ప్లాన్‌ మొత్తం తూ.చా తప్పకుండా జెన్నిఫర్ అమలు చేసింది. రోజులో ఎప్పుడు, ఎక్కడ, ఎంత పొదుపు చేయాలి? ఇలా అన్ని విషయాల్లోనూ జీపీటీ చెప్పినట్లుగా ఫాలో అయ్యింది.

Jennifer Allan

అప్పు తీరిందిలా..!
చాట్ జీపీటీ చెప్పినవన్నీ ఎంతలా ఫాలో అయ్యిందంటే తొలుత ప్యాంట్రీలోని వస్తువులతో మాత్రమే భోజనం చేసింది. దీంతో కిరాణా ఖర్చులను గణనీయంగా తగ్గించింది. తద్వారా దాదాపు రూ.50వేల వరకూ ఆదా చేసింది. ఆ తర్వాత ఉపయోగించని సబ్‌స్క్రిప్షన్‌లను గుర్తించి వాటిని రద్దు చేసింది. ఫైనాన్స్‌కు సంబంధించిన డిజిటిల్ యాప్‌లను సమీక్షించడం, తాను మర్చిపోయిన అకౌంట్లను సైతం తవ్వి మరీ, అందులోని డబ్బులను వెనక్కు తెచ్చుకున్నది. ఇలా చేయడంతో ఆర్థిక పరిస్థితిపై స్పష్టమైన అవగాహన పొందడానికి సహాయపడింది. ఇలా సుమారు రూ.8.5 లక్షలు క్లెయిమ్ చేయని, మర్చిపోయిన ఆస్తులను ఆమె కనుగొన్నది. ఇలా సుమారు ఒకే ఒక్క నెలలోనే సుమారు 20 లక్షల రూపాయల అప్పును దాదాపు తీర్చేసింది. ‘ నేను కొత్తగా ఏమీ చేయలేదు. రోజువారీ చేసే ఖర్చులను పక్కాగా ట్రాక్ చేశాను. అనవసరమైన చోట్ల ఖర్చులను పూర్తిగా తగ్గించుకున్నాను. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. నా అప్పులన్నీ దాదాపు తీరిపోయాయి. నాకున్న మిగిలిన అప్పును కూడా తీర్చడానికి మరో 30 రోజుల ఛాలెంజ్‌ను ప్లాన్ చేస్తున్నాను’ అని జెన్నిఫర్ అలెన్ చెప్పుకొచ్చింది. చూశారుగా.. చాట్ జీపీటీ వంటి ఏఐ (AI) టూల్స్ వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో ఎలా సహాయపడతాయో చూపిస్తుంది. ఇది కేవలం సమాచారం అందించడం మాత్రమే కాకుండా, ఆచరణాత్మక సలహాలను ఇచ్చి, వాటిని అమలు చేయడానికి ప్రేరణను కూడా ఇస్తుంది. వాస్తవానికి చాట్ జీపీటీ లేదా ఇతర జనరేటివ్ ఏఐ టూల్స్ ఉపయోగించి డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇవన్నీ మీ సృజనాత్మకత, నైపుణ్యాలు.. మీరు లక్ష్యంగా చేసుకున్న రంగంపై ఆధారపడి ఉంటాయి.

Read Also- YS Jagan: నల్లపురెడ్డి బూతులు వినసొంపుగా ఉన్నాయా జగన్?

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?