కొత్తగూడెం సింగరేణి ప్రాంతంలో కార్మికుల నిరసన
నేడు దేశవ్యాప్తంగా కార్మికులు కార్మిక సంఘాలు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నారు దానిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయిన కొత్తగూడెం సింగరేణి సంస్థలలో అన్ని డిపార్ట్మెంట్ వారు సమ్మెలో పాల్గొని కొత్తగూడెం సింగరేణి ప్రధాన హెడ్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు కార్మికుల పొట్టలు కొట్టొద్దని కార్మికుల కష్టాన్ని గుర్తించి కార్మికులకు అండగా నిలవాలని అంతేకానీ కార్మికుల పట్ల కక్ష సాధింపు చర్యలు చేయొద్దని కార్మికులు లేకపోతే సంస్థలు ముందుకు సాగే పరిస్థితులు లేవు సంస్థలే మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని కార్మికులపై అనవసరంగా ఒత్తిడి తెస్తూ చట్టాల పేరుతో శ్రమించి ప్రాణాలు ప్రాణంగా పెట్టి నిత్యం అహర్నిశలు కష్టపడే కార్మికులపై చట్టాల పేరుతో నిబంధనలు విధించడం ఏంటి కార్పొరేట్ సంస్థల వారికి చట్టాలు వాటిలో ఉన్న విధానాలు వర్తించవా వారికి ఒక న్యాయం కార్మికులకు ఒక న్యాయమా కార్పొరేట్ల మాయలో పడి మోడీ ప్రభుత్వం కార్మికుల పట్ల వివక్షత చూపుతుందని కార్మికులు లేకుండే సంస్థలు ఏడ ఉన్నాయి ప్రభుత్వాలు ఏడ ఉన్నాయి ఇవన్నీటికి మార్గ సూచకం కాఫీని కూడా అనే విషయం మరిచాడేమో మోడీ అంటూ కార్మిక సంఘ నాయకులు ఎద్దేవా చేశారు.
కార్మికులను ఇబ్బందులు పెడితే ఊరుకునేదే లేదంటున్న కార్మిక సంఘాలు
కొత్తగూడెంలో జరుగుతున్న కార్మిక సంఘాల నిరసనకు మద్దతుగా ఆయా కార్మిక సంఘాల యూనియన్ నాయకులు వారికి అండగా నిలబడి ధర్నాను నిర్వహించారు మోడీ ప్రభుత్వం చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాన్ని కార్మికుల పైన కక్ష సాధింపు చర్యలను ఖండిస్తూ ఈ నిరసనను కార్మికులకు న్యాయం జరిగేంత వరకు కొనసాగిస్తామని మోడీ ప్రభుత్వం కార్మికులకు న్యాయం చేసేంతవరకు పోరాటం ఆపమని కార్మికుల పైన విధించిన నాలుగు వ్యతిరేక చట్ట కోడులను వెనక్కు తీసుకునే అంతవరకు ఊరుకునేది లేదు కార్మికులను శ్రమదోపిడి కాల సమయాన్ని పాటించకుండా ఇబ్బందులు పెట్టడమే కాకుండా ఇదేంటి అరాచకం మోడీ ప్రభుత్వం కార్పొరేట్ దోస్తీ వదిలి కార్మికుల దోస్తీ పడితే తప్ప ప్రభుత్వానికి కార్మికులకు సంరక్షించుకుంటే దేశం సుఖశాంతులతో ప్రశాంతంగా ఉంటుందని ఇలాంటి విధానాన్ని పాటించకపోతే ముందు ముందు రోజుల్లో మోడీ ప్రభుత్వం కార్మికులకు సంధ్య చెప్పే రోజు వస్తుందని మర్చిపోవద్దని హెచ్చరిస్తున్న కార్మిక సంఘాలు.