No Marriage
Viral

No Marriage: పెళ్లి వద్దన్నందుకు దాడి.. ఇదేం పైశాచికత్వం రా బాబూ!

No Marriage: రెండు మనుసులు కలిస్తే ప్రేమ. తర్వాత పెళ్లి. అదికూడా వాళ్లకు ఇష్టమైతేనే. లేదంటే లివిన్ రిలేషన్. కానీ, కొందరు ఉంటారు. అమ్మాయికి ఇష్టం లేకపోయినా వెంటపడి వేధిస్తుంటారు. ఎంత చెప్పినా వినిపించుకోరు. చివరకు ఏదో ఒక అఘాయిత్యానికి పాల్పడుతుంటారు. కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లాలో జరిగిన సంఘటనే అందుకు నిదర్శనం. నువ్వంటే నాకిష్టం, నువ్వు లేకపోతే నేను బతుకలేను, పెళ్లి చేసుకుందాం అంటూ తెలుగు సినిమా టైటిల్స్ మాదిరి ఓ యువతికి పెళ్లి ప్రతిపాదన చేశాడు ఓ యువకుడు. అందుకు ఆమె నిరాకరించడంతో దాడికి పాల్పడ్డాడు. తర్వాత తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

అసలేం జరిగిందంటే?

చిక్కబళ్లాపుర జిల్లాలోని మంచనబెలె గ్రామంలో ఆనంద్ కుమార్ అనే యువకుడు ఉంటున్నాడు. వయసు 20 సవంత్సరాలు. తన బంధువుల్లో ఒకరైన 18 ఏళ్ల యువతిని చాలాకాలంగా ప్రేమిస్తున్నాడు. తెలిసినవాళ్లు కావడంతో కలిసినప్పుడల్లా చక్కగా మాట్లాడుతుండడంతో యువతిపై మనసుపడ్డ ఆనంద్ కుమార్, ఓ మంచి ముహూర్తం చూసుకుని పెళ్లి చేసుకుందాం అంటూ యువతికి ప్రపోజ్ చేశాడు. ఇది విన్న వెంటనే నువ్వంటే కాకు ఇష్టం లేదు, నువ్వు లేక నేను ఉండగలను, పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పింది. దీంతో మనస్థాపానికి గురైన ఆనంద్ కుమార్, తర్వాత పట్టరాని కోపంతో యువతి ముఖంపై టాయిలెట్ యాసిడ్ పోశాడు. తర్వాత తాను కూడా డీజిల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇదంతా యువతి ఇంటి ఇంటి దగ్గరే జరిగింది. బాధితురాలిపై ప్రయోగించిన యాసిడ్ ప్రమాదకరం కాకపోవడంతో చిన్నపాటి గాయాలు, దద్దుర్లతో బయటపడింది. ముఖంలో ఎలాంటి మార్పు జరుగలేదు. అయితే, ఆనంద్ కుమార్ మాత్రం 70 శాతానికి పైగా గాయపడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also- Gold Rates (09-07-2025): భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్ .. ఎంత తగ్గిందంటే?

మే నెలలోనూ ఇదే తరహా ఘటన

రెండు నెలల క్రితం బెంగళూరులో ఇదే తరహా టాయిలెట్ యాసిడ్ దాడి జరిగింది. మొబైల్ వాల్యూమ్ విషయంలో భార్యా భర్తల మధ్య మొదలైన గొడవ పెద్దదై యాసిడ్ దాడి వరకు వెళ్లింది. బెంగళూరులోని సిదేదహళ్లిలోని ఎన్ఎంహెచ్ లే అవుట్‌లో భార్యా భర్తలు నివాసం ఉండేవారు. 44 ఏళ్ల బాధితురాలు వృత్తిరీత్యా బ్యూటీషియన్‌గా చేస్తున్నది. తన భర్త మద్యానికి బానిసై వేధిస్తుండేవాడు. ఒక రోజు రాత్రి 9 గంటల సమయంలో డబ్బు కావాలని అడిగాడు. ఆమె నిరాకరించడంతో కొట్టాడు. ఎలాగోలా డబ్బు పొంది రాత్రి తప్పతాగి ఇంటికి వచ్చాడు. మొబైల్ ఫోన్‌లో పాటలు పెట్టి కేకలు వేయడం మొదలుపెట్టాడు. వాల్యూమ్ తగ్గించమని భార్య చెప్పింది. అయినా అతడు పట్టించుకోలేదు. ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. తర్వాత గొడవ పెద్దది కావడంతో బాత్రూమ్ లో ఉన్న టాయిలెట్ యాసిడ్ క్లీనర్ తీసుకొచ్చి భార్య ముఖంపై పోశాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు వచ్చారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ గ్యాప్‌లో భర్త పరారయ్యాడు.

Read Also- Indian Nurse: యెమెన్‌లో భారత నర్సుకు ఉరి శిక్ష.. ఏం చేసిందంటే?

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..