Indian Nurse
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Indian Nurse: యెమెన్‌లో భారత నర్సుకు ఉరి శిక్ష.. ఏం చేసిందంటే?

Indian Nurse: యెమెన్ దేశంలో హత్య కేసులో ఇరుక్కున్న భారత నర్సు నిమిష ప్రియ కు ఉరి శిక్ష తేదీ ఖరారైంది. ఈ నెల 16న ఉరి తీస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇటీవలే యెమెన్ అధ్యక్షుడు రషాద్ అల్ అలిమి ఉరి శిక్ష అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తున్నది. దీనికి సంబంధించిన సమాచారాన్ని నిమిష కుటుంబ సభ్యులకు అక్కడి అధికారులు చేరవేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి.

ఎవరీ నిమిష ప్రియ? ఏం చేసింది?

నమిష సొంత ఊరు కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ జిల్లా. 2008 వరకు ఇండియాలోనే ఉన్నది. ఆ తర్వాత యెమెన్‌లో ఉద్యోగం రావడంతో అక్కడకు వెళ్లింది. 2011లో థామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నది. ఇద్దరూ కలిసి యెమెన్‌లో ఓ క్లినిక్ ప్రారంభించాలని అనుకున్నారు. అక్కడి నిబంధనల ప్రకారం స్థానికంగా ఉండే వ్యక్తి పార్టనర్ షిప్ అవసరమైంది. దీంతో తలాల్ అదిబ్ మెహదీ అనే వ్యక్తిని భాగస్వామిగా చేసుకుని, నిమిష, థామస్ అల్ అమన్ మెడికల్ కౌన్సిల్ పేరుతో సెంటర్‌ను ప్రారంభించారు. కొన్నాళ్లు అంతా సాఫీగా సాగింది. అయితే, థామస్ కుమార్తెతో కలిసి కేరళ వచ్చేయడంతో నిమిషకు కష్టాలు మొదలయ్యాయి. యెమెన్‌లో ఆమె ఒక్కరే ఉంటూ సెంటర్‌ను కొనసాగిస్తుండగా, ఆమె పార్టనర్ తలాల్ అదిబ్ మెహదీ వేధింపులు మొదలయ్యాయి. ఆమెను తన భార్యగా చెబుతూ పాస్ పోర్ట్ లాగేసుకున్నాడు. దీనిపై నిమిష పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. మెహదీ లోకల్ కావడంతో అంతా మ్యానేజ్ చేశాడు. అయితే, ఎలాగైనా అతడి నుంచి పాస్ పోర్ట్ తీసుకుని ఇండియా వచ్చేయాలని నిమిష ఓ ప్లాన్ చేసింది. 2017లో మెహదీకి మత్తు మందు ఇచ్చి పాస్ పోర్ట్ తీసుకోవాలని అనుకున్నది. అయితే, అతడికి ఇచ్చిన మత్తు మందు మోతాదు ఎక్కువ కావడంతో చనిపోయాడు. దీంతో ఏం చేయాలో పాలుపోక మృతదేహాన్ని వాటర్ ట్యాంకులో పడేసింది. తర్వాత సౌదీ వెళ్లేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కింది. 2018 జూన్‌లో నిమిష ప్రియను కోర్టు దోషిగా నిర్ధారించి మరణ శిక్ష విధించింది. దీనికి తాజాగా ఆ దేశాధ్యక్షుడు అంగీకరించడంతో ఈ నెల 16న అమలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Read Also- Congress: తెలంగాణ కాంగ్రెస్‌కు కేవీపీ అవసరమా.. హాట్ టాపిక్‌గా మారిన ఎపిసోడ్!

నిమిషను కాపాడేందుకు ప్రయత్నాలు

నిమిష ప్రియను కాపాడేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. 2018లో ఉరి శిక్ష తీర్పు వచ్చినప్పటి నుంచి అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నది. అయితే, యెమెన్ ప్రస్తుతం హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్నది. నిమిష అక్కడి రాజధాని సనాలో ఉన్న జైలులో ఉండగా, తిరుగుబాటుదారులతో భారత అధికారులకు అధికారిక సంబంధాలు లేకపోవడంతో చర్చలు కష్టతరంగా మారాయి. మృతుడి కుటుంబానికి డబ్బులు ఇచ్చి క్షమాభిక్ష కోసం నిమిష తల్లి ప్రేమకుమారి ప్రయత్నించింది. కానీ, ఆ ప్రయత్నాలేవీ సఫలం కాలేదు.

Read Also- Samantha: సమంత, రాజ్ ని అక్కడే పెళ్లి చేసుకుంటుందా.. ఈ పోస్ట్ తో కన్ఫర్మ్?

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు