Harish Rao on Congress: కల్వకుర్తి మోటార్లు ఆన్ చేసి నీళ్లు విడుదల చేయడం బీఆర్ఎస్ విజయం అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao) వెల్లడించారు. ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నిలదీస్తే గానీ, (Congress Government) కాంగ్రెస్ ప్రభుత్వంలో కదలిక రాదా, మేం ప్రశ్నిస్తే తప్ప రైతుల నీటి సమస్యలు గుర్తు రావా, రైతుల నోరు కొడుతున్నారు అంటే గానీ ఆలోచన రాదా, లక్షలాదిగా రైతులతో తరలి వచ్చి మోటార్లు ఆన్ చేస్తామంటే గానీ చలనం ఉండదా, ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరదను ఒడిసిపట్టాల్సింది పోయి, విడిచిపెట్టడం దుర్మార్గం’’ అంటూ మండిపడ్డారు.
Also Read: HHVM: శివుడు, విష్ణువుల అవతారం ఈ ‘వీరమల్లు’.. ఆ కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్!
హరీశ్ రావు ఆగ్రహం
రాజకీయ కక్ష సాధింపు చర్యలపై దృష్టి పెట్టడం మానేసి రైతాంగంపై దృష్టి సారించాలని హితవు పలికారు. కల్వకుర్తి వల్లే, కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి, రిజర్వాయర్లు నింపి పొలాలకు నీళ్లు మళ్లించాలని బీఆర్ఎస్ (BRS) పక్షాన డిమాండ్ చేశారు. ఇటు, ఉపాధి హామీ ఏపీఓలకు మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం శోచనీయమని హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన పనికి వేతనాలు రాక ఉపాధి హమీ సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ కుటుంబ పోషణ భారమై సతమతమవుతుంటే ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Government) నిర్లక్ష్యానికి మనోవేదనకు గురై ఉపాధి హామీ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం విచారకరం అన్నారు. అలాగే, పారిశుద్ధ్య కార్మికులకు కూడా వేతనాలు ఇవ్వలేదని, ఫలితంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందన్నారు. ఎన్నికల సమయంలో హామీలతో ఊదరగొట్టిన కాంగ్రెస్ (Congress) నాయకులు ఇప్పుడు ఏమని సమాధానం చెబుతారని నిలదీశారు.
Also Read: Minister Seetakka: గిరిజన ప్రాంతంలో నకిలీ పదం వినిపిస్తే సహించం!