BTPS Posts: బీటీపీఎస్‌లో శాంక్షన్ పోస్టులను మంజూరు చేయాలి!
BTPS Posts( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

BTPS Posts: బీటీపీఎస్‌లో శాంక్షన్ పోస్టులను మంజూరు చేయాలి!

BTPS Posts:  బీటీపీఎస్ కర్మాగారంలో శాంక్షన్ పోస్టులు మంజూరు చేయాలని (TSPEU) ( తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్)-1535 నాయకులు జెనకో డైరెక్టర్ (థర్మల్ అండ్ ప్రాజెక్ట్స్) Y. రాజశేఖర్ రెడ్డి ని కోరారు. బీటీపీఎస్ సందర్శనకు  వచ్చిన జెన్కో డైరెక్టర్ ని (TSPEU) -1535 రీజినల్ అధ్యక్షులు వి. ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఆర్. రామచందర్ , సెంట్రల్ కమిటీ నాయకులు ఏ. వెంకటేశ్వర్లు, బి.జార్జ్ తదితరులు కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొని వెళ్లారు.

 Also Read: Lavanya Tripathi: 6 నెలలకే లావణ్య త్రిపాఠికి బాబు పుట్టాడా?.. వైరల్ అవుతున్న ఫోటో?

ఉద్యోగాలను భర్తీ చేయాలి

శాంక్షన్ పోస్టులను మంజూరు చేస్తే ప్రస్తుతం పనిచేస్తున్న పలువురు కార్మికులకు ప్రమోషన్లు లభిస్తాయని ఆశా భావం వ్యక్తం చేశారు. ప్రమోషన్లు లేక పది,పదిహేను సంవత్సరాలుగా కార్మికులు ఒకే క్యాడర్లో పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్మాగారంలో డ్రైవర్లు, లోకో ఆపరేటర్లు, క్రేన్ ఆపరేటర్ల ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. డిగ్రీ విద్యార్హత ఉన్న ఓ అండ్ యం కార్మికుల కు జూనియర్ అసిస్టెంట్, టైపిస్టులుగా కన్వర్షన్ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పారు.

డెసిగ్నేషన్ తో ఉద్యోగాలు ఇవ్వాలి

భూ నిర్వాసిత కోటాలో జూనియర్ ప్లాంట్ అటెండేంట్, జూనియర్ అసిస్టెంట్లుగా గా ఉద్యోగంలో చేరిన సుమారు 40 మంది ఉద్యోగులకు బీటెక్ విద్యారత ఉందని చెబుతూ.. వీరందరిని సబ్ ఇంజనీర్లుగా కన్వర్షన్ చేయాలని పేర్కొన్నారు. కర్మాగారం లో భూనిర్వాసితులు ఉద్యోగాలు చేరే సమయంలో కొందరి విద్యార్హత తప్పుగా నమోదయిందని విద్యార్హత కు అనుగుణంగా ఉండే డెసిగ్నేషన్ తో ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు.

బీటీపీయస్‌లో (BTPS) భూములు కోల్పోయిన సుమారు 300 మంది కి సెప్టెంబర్- 2001 ఉద్యోగాలు ఇచ్చారని.. మిగిలిన 30 మందికి అదే సంవత్సరం అక్టోబర్ లో ఉద్యోగ ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. ఈ 30 మందికి కూడా సెప్టెంబర్ లోనే ఉద్యోగంలో చేరినట్లు సర్వీస్ కలిపి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పుల్లారావు, చాట్ల రత్నాకర్, సిహెచ్ వెంకటేశ్వర్లు,జి. రవికుమార్, తుంపిరి అనిల్,యన్.వీరబాబు, బి. నరసింహారావు, తాటి ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.

 Also ReadBhadradri Kothagudem: చెరువులో ఏం కలుస్తోంది.. విష జ్వరాలకు కారణమేంటి?

Just In

01

MLA Malla Reddy: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. దెబ్బకు సైలెంట్ అయిన సభ్యులు

iBomma Ravi: ఐ బొమ్మ రవికి షాక్​.. మరోసారి కస్టడీకి అనుమతించిన కోర్టు

Pawan Kalyan: గ్రామానికి రోడ్డు కోరిన గిరిజన యువకుడు.. సభ ముగిసేలోగా నిధులు.. డిప్యూటీ సీఎం పవన్‌పై సర్వత్రా ప్రశంసలు

Panchayat Elections: మూడో దశ పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. ఉత్కంఠగా మారిన దేవరకొండ రెవెన్యూ డివిజన్ ఓట్లు

Gurram Paapi Reddy: సినిమాను హిట్ చేయండి.. మంచి భోజనం పెడతా! ఈ మాటంది ఎవరంటే?