Coriander ( Image Source: Twitter)
Viral

Coriander: కొత్తిమీర ఎక్కువగా వాడుతున్నారా.. అయితే, జాగ్రత్త ?

Coriander: కొత్తిమీర..  వంటకాలకు రుచి, రంగు, వాసన జోడించే ఈ పచ్చని ఆకు అందరి వంటింట్లో స్టార్ గా ఉంటుంది.  పులావ్, కూర, చాట్ లేదా సలాడ్.. ఏ వంటకంలో వేసినా, కొత్తిమీర చూడగానే నోరూరిపోతుంది. ఇది అలంకరణకు మాత్రమే కాదు, ఈ చిన్ని ఆకు మన ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం కూడా! దీన్ని మన  ఆహారంలో చేర్చుకుంటే, ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. కొత్తిమీర ఆరోగ్య రహస్యాలను ఒక్కసారి చూద్దాం..

Also Read: Telangana: తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ.. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌తో సీఎం చర్చలు

షుగర్‌కు చెక్

డయాబెటిస్‌తో బాధపడేవారికి కొత్తిమీర ఒక వరం. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఔషధ గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. రోజూ కొత్తిమీరను కూరలో, జ్యూస్‌గా లేదా సలాడ్‌లో తీసుకుంటే షుగర్ సమస్య క్రమంగా తగ్గుతుంది.

కడుపు మంటకు బైబై.. 

గ్యాస్, ఎసిడిటీ, కడుపులో మంట.. ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే, కొత్తిమీర మీకు మంచి ఆహారం. దీన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే, జీర్ణ సమస్యలు సులభంగా తగ్గిపోతాయి. కొత్తిమీర జ్యూస్ తాగితే, కడుపు ఉబ్బరం, మంట లాంటివి దూరమవుతాయి.

Also Read: Kingdom: విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ ఆరోజే విడుదల.. అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తాడట!

బీపికి  బ్రేక్!

రక్తపోటు సమస్య ఉన్నవారు కొత్తిమీరను తప్పక చేర్చుకోవాలి. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ రక్తపోటును నియంత్రించి, హార్ట్ ఆరోగ్యాన్ని కాపాడతాయి. రోజూ కొద్దిగా కొత్తిమీర తీసుకోవడం వల్ల బీపి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

థైరాయిడ్‌కు చెక్‌మేట్!

థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడేవారికి కొత్తిమీర ఒక అద్భుతమైన ఆహారం. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే, థైరాయిడ్ హార్మోన్లు సమతుల్యం అవుతాయి. జ్యూస్‌గా లేదా సలాడ్‌లో చేర్చుకుంటే ఈ సమస్య క్రమంగా తగ్గుతుంది.

 Also Read: Sugar: 30 రోజులు చక్కెర మానేస్తే మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?

చర్మ సౌందర్యానికి బెస్ట్!

కొత్తిమీర కేవలం ఆరోగ్యానికే కాదు, చర్మ సౌందర్యానికి కూడా అద్భుతం! దీన్ని జ్యూస్‌గా తాగితే చర్మం కాంతివంతంగా, ప్రకాశవంతంగా మారుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై మచ్చలు, ముడతలను తగ్గిస్తాయి. డైట్ ఫాలో చేసేవారు కొత్తిమీర జ్యూస్‌ను రోజూ ఒక పూట తాగితే, ఫిట్‌గా, ఆరోగ్యంగా, అందంగా కనిపిస్తారు

మూత్ర, చర్మ సమస్యలకు రిలీఫ్!
మూత్ర సంబంధిత సమస్యలు, చర్మ వ్యాధులతో ఇబ్బంది పడేవారికి కొత్తిమీర ఒక సహజ ఔషధం. ఇందులోని యాంటీ బాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. అలాగే, ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.ఎలా తీసుకోవాలి

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!