Telangana: తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ..
Telangana ( Image Source: Twitter)
Telangana News

Telangana: తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ.. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌తో సీఎం చర్చలు

Telangana: తెలంగాణ‌లో ప్ర‌జా ప్ర‌భుత్వం క్రీడా రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ ప్ర‌శంసించారు. ఢిల్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని ఆయ‌న అధికారిక నివాసంలో క‌పిల్ దేవ్ సోమవారం క‌లిశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు, క్రీడాభివృద్ధికి త‌మ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను సీఎం వివ‌రించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీతో పాటు తెలంగాణ‌లో క్రీడాభివృద్ధికి సంబంధించిన అన్ని విష‌యాల్లో తాను భాగ‌స్వామిన‌వుతాన‌ని కపిల్ దేవ్ ముఖ్య‌మంత్రికి తెలియ‌జేశారు.

Also Read: SPDCL: విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నెంబర్‌లు.. ఎస్పీడీసీఎల్ కొత్త విధానం!

ఈ సంద‌ర్భంగా ద‌క్షిణ కొరియాతో పాటు ప‌లు దేశాల్లో తాము సంద‌ర్శించిన క్రీడా యూనివర్సిటీలు, అక్క‌డి క్రీడా ప్ర‌ముఖుల‌తో త‌మ భేటీల వివ‌రాల‌ను క‌పిల్ దేవ్‌కు రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలోనూ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు వివరించారు. ఈ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి, కేంద్ర ప‌థ‌కాల స‌మ‌న్వ‌య కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్‌ పాల్గొన్నారు.

Also Read: TG Tourism: టూరిజంపై మంత్రి స్పెషల్ ఫోకస్.. ఇప్పటికే కొంతమంది పనితీరుపై అసంతృప్తి!

 

Just In

01

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!