Julian Ryan: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో భారీ వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో గ్వాడాలుపే నది (Guadalupe River) ఉప్పొంగి.. చుట్టుపక్కల ఇళ్లను ముంచెత్తింది. దీంతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రవాహానికి కొట్టుకుపోయారు. ఈ విపత్తులో ఇప్పటివరకూ 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే ఈ జలప్రళయానికి సంబంధించి హృదయాలను కదిలించే విషాద గాధలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే జూలియన్ ర్యాన్ అనే వ్యక్తి తన కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని కలిగిస్తోంది.
అసలేం జరిగిందంటే?
జులై 4న గ్వాండాలుపే నది ఉప్పొంగిన సమయంలో జూలియన్ ర్యాన్ (Julian Ryan) అనే వ్యక్తి తన తల్లి, ప్రేయసి క్రిస్టినియా విల్సన్ (Christinia Wilson), ముగ్గురు పిల్లలతో ఇంట్లోనే ఉన్నాడు. ఈ క్రమంలో చోటుచేసుకున్న భయానక అనుభవాన్ని క్రిస్టినా విల్సన్ పంచుకుంది. ‘అప్పుడు భారీగా వర్షం మెుదలైంది. బయట నుంచి శబ్దం రాకుండా తలుపులు మూయడానికి మేము చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ తర్వాత గదిలోకి పరుగున వెళ్లి 911కు కాల్ చేయడం ప్రారంభించాము’ అని విల్స్ అన్నారు. అయితే 20 నిమిషాల వ్యవధిలోనే ఇంట్లోకి నీరు ప్రవేశించాయని.. మోకాళ్ల లోతు వరకు నీరు వచ్చేశాయని తెలిపారు. నీటి మట్టం అంతకంతకు పెరిగిపోతోందని.. కానీ సహాయం చేసే వారే కనిపించలేదని విల్సన్ అన్నారు.
27-year-old man dies while saving his fiancée, children & mom during the Texas flash floods
“I’m sorry, I’m not going to make it. I love y’all,” were Julian Ryan’s last words.
When Ryan realized 911 wouldn’t be able to save them in time as water rushed into the home, he punched… pic.twitter.com/SPAM3OSNgL
— Collin Rugg (@CollinRugg) July 6, 2025
చేతితో కిటికీ అద్దాలు బద్దలుకొట్టి
911 కాల్ చేసినా ఫలితం లేకపోవడంతో ర్యాన్ ఎంతో నిరాశ చెందాడు. వరద ముప్పు నుంచి ఎలాగైన తన ఫ్యామిలీని బయటపడాలని ర్యాన్ భావించాడు. తల్లి, ప్రేయసి, పిల్లలను ఎలాగైనా ఇంటి పైకప్పుకు చేర్చాలని నిర్ణయించుకున్నాడు. అయితే పైకి వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో.. కిటికీ అద్దాన్ని చేతితోనే బలంగా బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో అతడి చేతికి గాయమై తీవ్ర రక్తస్రావం కావడం ప్రారంభమైంది. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తనతో పాటు పిల్లలు, తల్లిని ర్యాన్ సురక్షితంగా పైకి చేర్చాడని ప్రేయసి విల్సన్ తెలియజేసింది. ర్యాన్ కూడా సురక్షితంగా పైకి వచ్చి సహాయక చర్యల కోసం ఎదురుచూశాడని పేర్కొంది. ఆరు గంటలు దాటినా సహాయం లభించకపోవడంతో తీవ్ర రక్తస్రావమై ర్యాన్ మరణించాడని ఆమె కన్నీరుమున్నీరు అయ్యారు.
Also Read: Vijay Deverakonda: హీరో ట్యాగ్‌లపై… విజయ్ దేవరకొండ అలా అన్నాడేంటి!
ర్యాన్ చివరి మాటలు ఇవే
చివరి క్షణాల్లో ర్యాన్ తమను చూసి క్షమించమని కోరినట్లు విల్సన్ తెలిపారు. ‘మిమ్మల్ని కాపాడలేకపోతున్నాను. నేము మీ అందరినీ ప్రేమిస్తున్నాను’ అంటూ చెప్పి తుదిశ్వాస విడిచారని విల్సన్ కన్నీరుమున్నీరు అయ్యారు. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిన తర్వాత రెస్క్యూ టీమ్ వచ్చి.. తమను రక్షించి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లిందని ఆమె తెలిపారు. ఆ తర్వాత ర్యాన్ మృతదేహాన్ని సైతం వెలికితీశారని స్పష్టం చేశారు. విల్సన్ చేసిన వ్యాఖ్యలు.. నెట్టింట వైరల్ కావడంతో అందరూ ర్యాన్ ను రియల్ హీరో అంటూ ప్రశంసిస్తున్నారు. తన ప్రాణాలు పణంగా పెట్టి కుటుంబాన్ని కాపాడుకున్నాడని ప్రశంసిస్తున్నారు.