Vijay Deverakonda( image source : twitter)
ఎంటర్‌టైన్మెంట్

Vijay Deverakonda: హీరో ట్యాగ్‌లపై… విజయ్ దేవరకొండ అలా అన్నాడేంటి!

Vijay Deverakonda: ఏప్పుడూ వివాదాల్లో ఉండే టాలీవుడ్ హీరోల్లో విజయ దేవరకొండ ఒకరు. గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక పోయినా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ మార్క్ ఏర్పరుచుకున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే విజయ్ దేవరకొండ అభిమానులకు కూడా టచ్‌లో ఉంటారు. ‘లైగర్‌’ సినిమా ప్రచారంలో భాగంగా అప్పుడు తన పేరుకు ముందు ‘ది’ పెట్టుకున్నారు. అది కాస్త వివాదంగా మారడంతో అభిమానులకు ‘ది’ (The Tag) వాడవద్దని సూచించారు. తాజాగా ఈ వివాదంపై విజయ్ దేవరకొండ మరోసారి స్పందించారు.

Also Read – TG Tourism: టూరిజంపై మంత్రి స్పెషల్ ఫోకస్.. ఇప్పటికే కొంతమంది పనితీరుపై అసంతృప్తి!

తన పేరుకు ముందు ‘ది’ ట్యాగ్ తగిలించడం వల్ల విపరీతమైన స్పందన వచ్చిందని, దీని వల్ల ఇతర హీరోలెవరూ ఎదుర్కోనన్ని ఎదురు దెబ్బలు ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ ట్యాగ్‌లు ఉన్నాయని తాను పెట్టుకుంటేనే వివాదాలు వస్తున్నాయన్నారు. తనకంటే ముందు వచ్చిన వారు తర్వాత వచ్చిన వారు కూడా ఈ ట్యాగ్ లు వాడుతుంటే తనకు కూడా ఉండాలని ‘లైగర్’ సినిమా సమయంలో మూవీ టీం సూచించిందన్నారు. దానిని పెట్టుకుంటే మాత్రం ఎక్కడా లేని వివాదాలు తనకే చుట్టుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తనకి ట్యాగ్ ల విషయంలో ఆసక్తి లేదని నటనతో తనని గుర్తిస్తే సరిపోతుందన్నారు. అప్పట్లో అభిమానులు తనను సదరన్‌ సెన్సేషన్‌, రౌడీ స్టార్‌.. లాంటి పేర్లతో పిలిచేవారని, అవి తనకు నచ్చకపోవడంతో అలా పిలవొద్దని చెప్పానన్నారు. చివరిగా ‘లైగర్’ ప్రచారంలో మూవీ టీం ‘ది’ సూచించగా అప్పటికే ఆ ట్యాగ్ ఎవరికీ లేకపోవడంతో దానిని పెట్టడనికి ఒప్పుకున్నానన్నారు. అది పెట్టుకోవడం వల్ల వివాదాలు ఎదుర్కోవాల్సి రావడంతో ‘ది’ ట్యాగ్ తీసెయ్యాలని మూవీ టీమ్ కు సూచించినట్లు తెలిపారు. అందరికీ ట్యాగ్‌లు ఉన్నాయి కాబట్టి తనకు లేకపోవడమే మేలని విజయ్ దేవరకొండ అభిప్రాయపడ్డారు. ఇక నుంచి తనను ఎవరూ ట్యాగ్‌లతో పిలవకుండా తన పేరు విజయ్ దేవరకొండ తోనే పిలవాలని సూచించారు.

Also Read – Seethakka on KTR: కేటీఆర్ నాశనమైపోతారు.. మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో ఫైర్!

విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్‌కు దగ్గరపడటంతో ప్రమోషన్ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ‘కింగ్‌డమ్’ (Kingdom) సినిమా 31 జూలై, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ.. పవర్ ఫుల్ ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసేలా ఉంది. యాక్షన్, హీరోయిజం, డ్రామా కలిసి శక్తివంతమైన చిత్రంగా ‘కింగ్‌డమ్’ రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రోమోలో యుద్ధ సన్నివేశాలు, భావోద్వేగాలు, విజువల్స్ కట్టిపడేసేలా ఉన్నాయి. ముఖ్యంగా డైలాగ్ బాగా వైరల్ అవుతోంది. ‘ఏమైనా చేస్తా సార్.. అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్’ అనే డైలాగ్ హీరోయిజానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉంది. అలాగే ఈ సినిమా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నట్లుగా ఈ ప్రోమో తెలియజేస్తుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?