Watch Video (Image SOurce: Instagram))
Viral, లేటెస్ట్ న్యూస్

Watch Video: యూరప్ రావొద్దు.. వచ్చారో మీ పని అంతే.. భారతీయుడి స్ట్రాంగ్ వార్నింగ్!

Watch Video: సాధారణంగా విదేశీ పర్యటన అనగానే చాలా మంది దృష్టిలో యూరప్ (Europe) ముందు వరుసలో ఉంటుంది. అక్కడి పర్యాటక ప్రదేశాలు, చల్లని వాతావరణం చాలా మంది భారతీయులను ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే భారత్ కు చెందిన ఓ వ్యక్తి.. యూరప్ పర్యటనకు వెళ్లారు. అయితే అక్కడ ఎదురైన పరిస్థితులను చూసి అతడు షాక్ కు గురయ్యారు. ఈ క్రమంలో తనకు ఎదురైన అనుభవాల గురించి వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అసలేం జరిగిందంటే?
భారత్ కు చెందిన ఒక టూరిస్ట్.. ఇటీవల యూరప్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఉన్న సమ్మర్ వెదరు చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. అంతేకాదు యూరప్ లోనే అధిక ఖర్చుల గురించి సైతం వివరిస్తూ తన ‘పాండే జీ పరదేశీ’ అనే ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘మత్ ఆవో యూరప్’ (Mat aao Europe) అంటూ సదరు పోస్ట్ కు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం యూరప్ లో అధిక ఉక్కపోత ఉందని అతడు తెలియజేశాడు. దీనికి తోడు చాలా పర్యాటక ప్రాంతాల్లో ఏసీ, ఫ్యాన్స్ వంటి సౌఖర్యాలు కూడా లేవని వీడియోలో స్పష్టం చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Bulbul Pandey (@pandeyjipardesi)

Also Read: SPDCL: విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నెంబర్‌లు.. ఎస్పీడీసీఎల్ కొత్త విధానం!

అక్టోబర్‌లో వెళ్తే బెటర్!
యూరప్ లో ఎండలు తరహాలో ధరలు సైతం మండిపోతున్నాయని ఇండియన్ టూరిస్ట్ తాజా వీడియోలో తెలియజేశాడు. ఒక చిన్న వాటర్ బాటిల్ ను 2-2.5 యూరోలకు (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.252) విక్రయిస్తున్నట్లు చెప్పారు. యూరప్ ట్రిప్ ప్లాన్ చేసుకునే వారు.. వేసవికి బదులుగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సందర్శించాలని సూచించాడు. భారతీయ టూరిస్ట్ పోస్ట్ చేసిన ఈ వీడియో.. యూరప్ పర్యాటకంలోని సవాళ్లను ప్రస్తుతం ఎత్తి చూపుతోంది.

Also Read: Tabu: 16ఏళ్ళ వయసులో ఆ హీరో టబుతో అలాంటి పని చేశాడా.. అందుకే ఆమె పెళ్లి చేసుకోలేదా?

నెటిజన్ల రియాక్షన్ ఇదే!
అయితే ఇండియన్ టూరిస్ట్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. యూరప్ లోని ప్రస్తుత పరిస్థితులను తెలియజేసినందుకు కొందరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ‘యూరప్ ఇప్పుడు నా జాబితాలో లేదు’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే మరొకరు భారతీయ పర్యాటకుడు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘మీరు యూరప్ లో ఏ ప్రదేశానికి వెళ్లారో నాకు తెలియదు. ప్రస్తుతం అక్కడ వెచ్చగా ఉందనడంలో సందేహాం లేదు. కానీ రైలు, ట్రామ్ బస్సు, హోటల్స్ సహా ప్రతీ చోటా ఏసీలు ఉన్నాయి. యూరప్ అందంగా ఉంది. పుకార్లు వ్యాప్తి చేయవద్దు’ అంటూ రాసుకొచ్చారు.

Also Read This: Artificial Intelligence: ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్‌తో కష్టాలు.. మార్ఫింగ్ వీడియోలతో మోసాలు!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు