Artificial Intelligence( Image credit; free pic or twitter)
క్రైమ్, హైదరాబాద్

Artificial Intelligence: ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్‌తో కష్టాలు.. మార్ఫింగ్ వీడియోలతో మోసాలు!

Artificial Intelligence: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​ డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. దీని వల్ల ఒరిగే ప్రయోజనాల సంగతి అలా ఉంచితే అందుబాటులోకి వచ్చిన ఈ టూల్ సైబర్ క్రిమినల్స్‌కు మాత్రం కాసులు కురిపిస్తున్నది. ఏఐని ఉపయోగించుకుంటూ సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) వాయిస్​ క్లోనింగ్, వీడియో మార్ఫింగులు చేస్తూ వేలు, లక్షలు కొల్లగొడుతున్నారు. దేశం మొత్తం మీద రానున్న ఏడాదిలో సైబర్​ నేరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి చేసే మోసాల వాటా 35 నుంచి 40 శాతం ఉండవచ్చని (Cyber ​​Police) సైబర్​ పోలీసులు చెబుతున్నారు.

జనాన్ని కొల్లగొట్టడానికి..

సైబర్ క్రిమినల్స్ (Cyber Criminals) ప్రజల జేబులు ఖాళీ చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు. పెట్టుబడుల పేరిట కొందరిని, ఉద్యోగాలు అంటూ మరికొందరిని టార్గెట్‌ చేస్తున్నారు. దాదాపు 30కి పైగా పద్దతుల్లో మోసాలు చేస్తున్నారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్‌ను తమ నేరాల కోసం ఉపయోగించుకుంటున్నారు. లక్ష్యంగా చేసుకున్న వారికి ఫోన్లు చేసి సన్నిహితుల్లా మాట్లాడుతూ, అత్యవసరం అని చెప్పి 50వేల నుంచి 2లక్షల రూపాయల వరకు తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకుంటున్నారు.

 Also Read: Forest Lands: భూముల గుర్తింపునకు ఎక్స్‌పర్ట్​ కమిటీ!

ఆ సంస్థల నుంచి..

ఇలా నేరాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) లోన్ యాప్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల నుంచి మొబైల్​ ఫోన్ల (Mobile Phones) నెంబర్లను బల్క్‌లో కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా రుణాలు ఇచ్చే యాప్‌లు అప్పు కోసం తమను సంప్రదించిన వారిని ఫోన్​ బుక్ యాక్సెస్​ ఇవ్వాలని అడుగుతాయి. ఒక్కసారి యాక్సెస్ ఇస్తే మన ఫోన్‌లో ఉన్న స్నేహితులు, బంధువులు అందరి సెల్ ఫోన్ల నెంబర్లు వారి చేతికి వెళతాయి. ఇలా యాక్సెస్​ తీసుకున్న తరువాతే ఆయా లోన్ యాప్ నిర్వాహకులు అప్పులు ఇస్తున్నారు. ఇదే (Cyber Criminals) సైబర్​ క్రిమినల్స్‌కు వరంగా మారింది. ఇన్ని నెంబర్లకు ఇంత అని రేట్ ఫిక్స్​ చేస్తూ ఆయా లోన్ యాప్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల నుంచి వీళ్లు నెంబర్లు కొనుగోలు చేస్తున్నారు.

వాయిస్ క్లోనింగ్

సేకరింరిన నెంబర్ల ద్వారా మనకు అత్యంత సన్నిహితంగా ఉండే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) ఫోన్లు చేస్తున్నారు. హలో అని మొదలు పెట్టి ఓ నిమిషం వరకు మాట్లాడుతున్నారు. ఆ తరువాత సారీ, రాంగ్ నెంబర్‌కు కాల్ చేశామని చెప్పి కాల్ కట్ చేస్తున్నారు. అయితే, ఈ లోపే మన మాటలను రికార్డ్ చేసుకుంటున్నారు. ఆ తరువాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాయిస్ క్లోనింగ్ చేస్తున్నారు. మూడు సెకన్లు మాట్లాడినా సైబర్ నేరగాళ్లు వాయిస్​ క్లోనింగ్ చేయడానికి అవకాశముంటుందని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు.

ఆ తరువాత ఏం చేస్తారంటే?

వాయిస్​‌ రికార్డ్ చేసి క్లోనింగ్ చేసి తరువాత వారి బంధువులు, మిత్రులకు ఫోన్లు చేస్తున్నారు. అచ్చం వారి సంబంధీకులు మాట్లాడుతున్నట్టుగా యాక్సిడెంట్ జరిగిందనో, అత్యవసరమనో చెప్పి 50వేల నుంచి 2లక్షల రూపాయల వరకు తమ ఖాతాల్లోకి డబ్బు జమ చేయించుకుంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే తన ఫోన్​ పోయిందని, అందుకే వేరే ఫోన్ నుంచి మాట్లాడుతున్నానని క్లోనింగ్ వాయిస్ ద్వారా చెబుతుండడం, మాట్లాడినప్పుడు అవతలి వ్యక్తి గొంతు తమ సంబంధీకులతో పూర్తిగా పోలి ఉంటుండడంతో పలువురు సైబర్​ క్రిమినల్స్ (Cyber Criminals) ఉచ్చులో చిక్కుకుంటున్నారు.

 Also Read: Google Map: గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా నమ్మితే కొంప కొల్లేరే.. ఇది తెలిశాక జన్మలో జోలికెళ్లరు!

డబ్బును ట్రాన్స్​ ఫర్ చేయొద్దు

దీనిపై  (Cyber Crime Police) సైబర్ క్రైం పోలీసులతో మాట్లాడగా ఇలాంటి ఫోన్లను నమ్మి డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయవద్దని సూచించారు. అత్యవసరమని చెప్పినా ఒక్క నిమిషం అని కాల్ కట్ చేసి తమ సన్నిహితులకు ఫోన్ చేయాలని చెప్పారు. డబ్బు అవసరమా కాదా అన్నది వారితో మాట్లాడి నిర్దారించుకున్న తరువాతే బదిలీ చేయాలన్నారు.

మార్ఫింగ్ వీడియోలతో..

మరికొన్ని ఉదంతాల్లో సైబర్ నేరగాళ్లు మార్ఫింగ్ చేసిన వీడియోలతో డబ్బు లూటీ చేస్తున్నారు. ఫేస్​ బుక్, ఇన్ స్టాగ్రాం తదితర యాప్‌ల నుంచి టార్గెట్‌గా చేసుకున్న వారి ఫోటోలు, వీడియోలు డౌన్​‌లోడ్ చేస్తున్నారు. ఆ తరువాత మార్పింగ్ వీడియోలు తయారు చేస్తున్నారు. దీనిపై (Cyber Crime Police) సైబర్​ క్రైం పోలీసులతో మాట్లాడగా వ్యూస్, లైక్‌ల కోసం రీల్స్ తయారు చేసి (Facebook)ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం (Instagram) తదితర యాప్‌లలోకి అప్ లోడ్ చేస్తున్న వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుందన్నారు. ఇక, మరికొందరు ఏ చిన్న సందర్భం వచ్చినా, రాకున్నా సెల్ఫీలు దిగుతూ (Social Media) సోషల్​ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారన్నారు. సరిగ్గా ఇదే సైబర్ క్రిమినల్స్ (Cyber Criminals) పనిని సులువు చేస్తున్నదని వివరించారు. సోషల్ మీడియాలో ఉన్న వీడియోలు, ఫోటోలను డౌన్‌లోడ్ చేసి అభ్యంతరకర రీతిలో మార్ఫింగ్ వీడియోలు తయారు చేసి టార్గెట్‌గా చేసుకున్న వారికి పంపించి బ్లాక్ మెయిల్ చేసి సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) డబ్బు కొల్లగొడుతున్నారన్నారు. ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ వీడియోలు వచ్చినపుడు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదులు చేయాలని సూచించారు.

సర్వేతో సంచలన నిజాలు

గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ అయిన మాక్ఫీ కార్పొరేషన్​ కొంతకాలం క్రితం విడుదల చేసిన నివేదిక ప్రకారం మన దేశంలో జరుగుతున్న సైబర్ నేరాల్లో 47 శాతం మందికి వాయిస్ క్లోనింగ్ అనుభవం ఎదురైంది. వీరిలో కొందరు జాగ్రత్తగా వ్యవహరించి సైబర్ నేరగాళ్ల ఉచ్చు నుంచి తప్పించుకోగా వేలాది మంవి 50వేలు దానికన్నా ఎక్కువ మొత్తాలను పోగొట్టుకున్నారు. వాయిస్ క్లోనింగ్ కాల్స్ ఎక్కువగా బాధితుల తల్లిదండ్రులు (46 శాతం) మాట్లాడినట్టుగా వచ్చిన కాల్సే ఉన్నాయి. ఇక, భర్తకు భార్య, భార్యకు భర్త చేసినట్టుగా వచ్చిన కాల్స్ 34 శాతం ఉండగా పిల్లలు మాట్లాడినట్టుగా వచ్చినవి 12 శాతం ఉన్నాయి. 70 శాతం సందర్భాల్లో సైబర్ క్రిమినల్స్ అవతలి వారి సంబంధీకుల్లా మాట్లాడి తమను దుండగులు దోచుకున్నారని చెప్పినట్టుగా సర్వేలో వెల్లడైంది. మరో 69 శాతం కాల్స్ రోడ్డు ప్రమాదానికి గురైనట్టుగా వచ్చినట్టు తేలింది. ఇక, ఫోన్, పర్స్​ పోయినట్టు 65 శాతం కాల్స్ ఉన్నట్టుగా వెల్లడైంది.

 Also Read: SR Nagar Police Station: పైసలు కొట్టినవారికే వంత పాడుతున్న పోలీసులు!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!