Crime News (imagecredit:swetcha)
క్రైమ్

Crime News: ఇదేం పనిరా బాబు.. షాక్‌లో పోలీసులు

Crime News: సాధారణంగా అందరూ దేవుళ్ల ఫోటోలకు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. అయితే, ఓ గంజాయి పెడ్లర్ మాదక ద్రవ్యాలను దాచి పెట్టటానికి వాటిని ఉపయోగించాడు. అయినా, ఎక్సయిజ్​ అధికారులు అతని గుట్టును రట్టు చేశారు. దేవుళ్ల చిత్రపటాల వెనక దాచి పెట్టిన 1‌‌0 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సయిజ్​ఎన్​ఫోర్స్ మెంట్ డైరెక్టర్​షానవాజ్ ఖాసీం తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ధూల్​పేట ఇందిరానగర్​ నివాసి రోహన్​సింగ్ గంజాయి అమ్మకాలు జరుపుతున్నట్టు తెలిసి ఎస్టీఎఫ్ సీఐ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేశారు.

ఓవైపు ఎక్సయిజ్​సిబ్బంది తనిఖీలు చేస్తుంటే రోహన్ సింగ్ పూజ గదిలో పూజ చేయటం మొదలు పెట్టాడు. ఇళ్లంతా వెతికినా గంజాయి దొరకక పోవటం తాము సోదాలు చేస్తుంటే రోహన్ సింగ్​పూజలు చేస్తుండటంతో ఎక్సయిజ్ సిబ్బందికి అనుమానం వచ్చింది. ఈ క్రమంలో దేవుళ్ల ఫోటోల వెనక తనిఖీ చేయగా 10 కిలోల గంజాయి పొట్లాల్లో దొరికింది. విచారణలో ఒరిస్సాకు చెందిన స్వప్న మండల్, రాజా వీర్ నుంచి గంజాయి కొని హైదరాబాద్(Hyderabad) తీసుకొచ్చి రోహిత్ తో కలిసి అమ్ముతున్నట్టుగా రోహన్​సింగ్ వెల్లడించాడు. ఈ క్రమంలో ఎక్సయిజ్​ అధికారులు స్వప్న మండల్, రాజా వీర్, రోహిత్ లపై కూడా కేసులు నమోదు చేశారు.

Also Read: Allu Aravind: రూ.100 కోట్ల స్కామ్‌లో అల్లు అరవింద్‌‌.. ఈడీ ప్రశ్నల వర్షం!

శివలాల్ నగర్‌లో మరో 1‌‌‌‌‌‌0కిలోలు
ఇక, శివలాల్ నగర్లో నివాసముంటున్న సంకీర్ సింగ్, సుశీల్ సింగ్, సరితా, మీనాబాయి కలిసి ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొస్తూ స్థానికంగా విక్రయిస్తున్నారు. ఈ మేరకు పక్కాగా సమాచారాన్ని సేకరించిన ఎక్సయిజ్​ అధికారులు వీరి ఇళ్లపై దాడులు చసి1‌‌0.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు. వీరితో కలిసి గంజాయి వ్యాపారం చేస్తున్న రాజ్​వీర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు.

బలరాం గల్లీలో
ధూల్ పేట ప్రాంతంలోని బలరాం గల్లీలో గంజాయి దందా జరుగుతున్నట్టు తెలిసి ఎక్సయిజ్​అధికారులు దాడులు జరిపారు. పవన్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లో తనిఖీలు జరిపి 2.186 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో దుర్గాభవానీ, కౌశిక్​ సింగ్​, శ్వేతాబాయి, అఖిలేష్​, పవన్ సింగ్, మనో సింగ్ లతో కలిసి పవన్ సింగ్ దందా నడిపిస్తున్నట్టుగా వెల్లడి కావటంతో వారిపై కూడా కేసులు నమోదు చేశారు. నిందితుల్లో నలుగురిని అరెస్ట్ చేశారు.

Also Read: Junior Movie: ‘వైరల్ వయ్యారి’ సాంగ్.. గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల దుమ్ములేపారు..

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు