Junior Movie: కర్ణాటక మాజీ మంత్రి, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి (Gali Kireeti Reddy) నటించిన డెబ్యు మూవీ ‘జూనియర్’ (Junior). ఇప్పుడీ సినిమా సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే ‘జూనియర్’ సినిమా నుంచి ఒక పాట విడుదలై మ్యూజిక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే చిత్రం నుంచి మరో సాంగ్ విడుదలైంది. అందులో హీరోయిన్ శ్రీలీల (Sreeleela) ‘వైరల్ వయ్యారి’ (Viral Vayyari Song) అంటూ వేసిన స్టెప్పులు యువతను కట్టి పడేస్తున్నాయి. ప్రస్తుతం ‘వైరల్ వయ్యారి’ పాట టాప్‌లో ట్రెండింగ్‌లో ఉంది. దేవిశ్రీ ప్రసాద్, హరి ప్రియ కలిసి పాడిన ఈ పాట ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళుతోంది. లిరిక్ రైటర్ కళ్యాణ్ చక్రవర్తి యూత్‌కు కనెక్ట్ అయ్యేలా సోషల్ మీడియా లాంగ్వేజ్ పదాలు వాడుతూ.. పాటను మరింత ఆకర్షణగా మలిచారు. కిరీటి రెడ్డి స్టెప్పుల్లో గ్రేస్ చూపిస్తే, శ్రీలీల తన అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో పాట స్థాయిని అమాంతం పెంచేసింది. అదిరిపోయే సెట్స్‌లో చిత్రీకరించిన వైరల్ వయ్యారి పాట క్యాచి మ్యూజిక్, ట్రెండీ లిరిక్స్, కలర్ ఫుల్ విజువల్స్‌తో ఈ ఏడాది చార్ట్‌బస్టర్ హిట్ అయ్యే లిస్ట్‌లోకి దూసుకెళుతోంది.
Also Read- Twist in Marriage: పెళ్లిలో బిగ్ ట్విస్ట్.. ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు!
‘జూనియర్’ తన డెబ్యు మూవీ అయినప్పటికీ గాలి కిరీటి రెడ్డి ఎక్కడా ఆ ఫియర్ కనిపించకుండా పర్ఫామెన్స్‌తో అదరగొట్టారు. ఇంతకు వచ్చిన టీజర్‌లో ఎంతో ఎనర్జిటిక్‌గా కనిపించి అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తోన్న ఈ చిత్రం జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి యంగ్ ఎనర్జీ కిరీటి రెడ్డి స్టెప్పులు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ సినిమాకి కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్ యాక్షన్ ప్రధాన హైలైట్స్‌గా మేకర్స్ చెబుతున్నారు. నిరంజన్ దేవరమనే ఎడిటింగ్.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా ఉంటుందని అంటున్నారు.
Also Read-Pawan Kalyan Sons: ఇద్దరు కొడుకులతో పవన్ కళ్యాణ్.. ఫొటో వైరల్!
కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని రాసిన డైలాగ్స్ ఇప్పటికే టీజర్‌లో పేలాయి. సినిమాలోనూ అదిరిపోతాయని యూనిట్ చెబుతోంది. మొదటి మూవీలోనే కిరీటి రెడ్డి ఎనర్జీని చూసి సినీ విమర్శకులు సైతం పొగుడుతున్నారు. మంచి నిర్మాణ విలువలు కలిగి ఉన్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇకపై ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్‌తో ప్రేక్షకులలోకి వెళ్లాలని టీమ్ చూస్తుంది. కచ్చితంగా ఈ సినిమా కిరీటీ రెడ్డికి ఘన విజయాన్ని అందిస్తుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు