KTR (imagecredit:twitter)
Politics

KTR: రేవంత్‌తో చర్చకు సిద్ధం.. ఆయన సవాల్‌ను స్వీకరిస్తున్నాం

KTR: సీఎం సవాల్ ను స్వీకరిస్తున్నానని, రైతులకు ఎవరు ఏం చేశారో చర్చిద్దామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Revant Reddy)కి మాజీ మంత్రి కేటీఆర్(KTR) ఛాలెంజ్ విసిరారు. బేసిన్లు, బెండకాయలని పరువు తీసుకోకుండా ఉండడానికి బేసిక్ నాలెడ్జ్ లేని రేవంత్ రెడ్డికి 72 గంటల ప్రిపరేషన్ టైం ఇస్తున్నానని చెప్పారు. ప్లేస్, టైం, డేట్ డిసైడ్ చేసి చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఏ పంటను అడిగినా, ఏ పైరును అడిగినా ఏ రైతును అడిగినా ఏ రైతు పక్కనున్న ఎద్దును అడిగినా వ్యవసాయాన్ని పండుగలా మార్చింది కేసీఆర్(KCR) అనే చెప్తారని అన్నారు. బీఆర్ఎస్(BRS) తెచ్చిన రైతురాజ్యం మీద, కాంగ్రెస్(Congress) తెచ్చిన రాబందుల రాజ్యం మీద చర్చించడానికి తాను సిద్ధమన్నారు. రైతుల పేరుతో రొటీన్ గా రంకెలు వేసిన రేవంత్ రెడ్డి ముచ్చట తీర్చడానికి ఆయన ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నానని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలన నడవడం లేదని, చంద్రబాబు(Chendra babu) కోవర్డు రేవంత్ రెడ్డి పాలనే నడుస్తుందన్నారు. గురువు కోసం ఏపీకి తెలంగాణ నీళ్లను పారిస్తున్న రేవంత్ రెడ్డి ముమ్మాటికీ కోవర్డే అని విమర్శించారు.

మాకు ఓటేస్తే మళ్లీ పాత రోజులు
ముఖ్యమంత్రి సొంతూరు కొండారెడ్డిపల్లి కానీ, ఆయన నియోజకవర్గం కొడంగల్లో కాని చర్చ పెడతారంటే నేను రెడీ.. లేదంటే మా నాయకుడు కేసీఆర్ సొంత ఊరు చింతమడక లేదంటే ఆయన నియోజకవర్గం గజ్వేల్ కి వస్తానన్న ఓకే అన్నారు. తెలంగాణ నేల మీద రైతు రాజ్యం తెచ్చిందే కేసీఆర్ అన్నారు. అన్ని రంగాలకు 24 గంటల కరెంటును, రైతులకు 24 గంటల పాటు ఉచిత కరెంటును ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి స్వతంత్ర భారత చరిత్రలో కేసీఆర్(KCR) ఒక్కరే అన్నారు. ఇందిరమ్మ(Indiramma) గొప్పతనం తెలవాలంటే గుడ్డలు ఊడదీసి కొట్టాలి అన్న ముఖ్యమంత్రికి కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ ఫార్మర్లు, ఎరువులు విత్తనాల కోసం లైన్లలో చెప్పులతో నిలబడడమే ఇందిరమ్మ రాజ్యం అని తెలియదా? అని నిలదీశారు. మాకు ఓటేస్తే మళ్లీ పాత రోజులు తీసుకొస్తామని నిజంగానే ఆ పాత దుర్ధినాలను రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీసుకొచ్చాడన్నారు. ఆధార్ కార్డు చూపిస్తే ఎకరాకు ఒక ఎరువుల బస్తా ఇవ్వాలని అధికారులకు నువ్వు చెప్పిన మాట నిజం కాదా ? అని నిలదీశారు.

Also Read: Congress Party: లైన్ క్రాస్ అయితే వేటు.. జూబ్లీ హిల్స్‌పై ఏఐసీసీ స్టడీ

రేవంత్ రెడ్డి తొట్టిగ్యాంగ్ మాత్రం సంతోషం
దమ్ముంటే మాటమీద నిలబడే వ్యక్తివి అయితే ఈనెల 8న ఉదయం 11 గంటలకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో రేవంత్ రెడ్డితో చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. పేటీఎం మాదిరి పే సీఎంగా రేవంత్ పేరు సంపాదించారని విమర్శించారు. రైతుబంధును కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఖచ్చితంగా ఎగ్గొడుతోందని మండిపడ్డారు. అన్నదాతకు సున్నం పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వమంటూ విరుచుకుపడ్డారు. రైతు సమస్యలపై చింతమడకు, కొండారెడ్డిపల్లె అయినా సరే రేవంత్ రెడ్డితో చర్చకు రెడీ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏవర్గం సంతోషంగా లేదని, కానీ రేవంత్ రెడ్డి తొట్టిగ్యాంగ్ మాత్రం సంతోషంగా ఉందని మండిపడ్డారు. నిజం ఒప్పుకోని వాడిని నటించే వాడిని రేవంత్ రెడ్డి అంటారని ఫైర్ అయ్యారు. కేసీఆర్(KTR) ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి(Revanth Reddy) చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల కల్పనపై అశోక్ నగర్‌లో నిరుద్యోగుల మధ్య చర్చకు రావాలని సవాల్ చేశారు. నాలుగు వేల పెన్షన్, రూ. 2,500 కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల్లో సీఎం సొంత నియోజకవర్గంలో జెడ్పీటీసీ కూడా కాంగ్రెస్ గెలవదన్నారు.ఆధిత్యనాథ్ దాస్ ను సాగునీటి సలహాదారుడిగా నియమించి సాగునీటిని ఏపీ తరలిస్తున్నారని మండిపడ్డారు.

అప్పు రెండు లక్షల కోట్లకు చేరింది
‘వందనా.. వాళ్ళ‌ బొందనా? వంద సీట్లు కాంగ్రెస్ ఎలా గెలుస్తుంది. వంద గెలవాలంటే.. ముందు ప్రజలు ఓట్లు వేయాలి కదా? అన్నారు. ఎరువులు ఇవ్వటం చేతకాని వాడికి కేసీఆర్‌(KCR)తో చర్చ ఎందుకని నిలదీశారు. వ్యవసాయం మాత్రమే కాదు.. మత్స్య సంపదను సృష్టించిందే కేసీఆర్ అన్నారు. రైతు బీమాను ఎగ్గొట్టిందన్నారు. 3నెలలుగా ప్రభుత్వం ప్రిమియం చెల్లించడం లేదన్నారు. బనకచర్లతో గోదావరి నీళ్లను తరలించుకుపోయే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఏపీ జలదోపిడీని అడ్డుకునేదిపోయి వంతపాడుతున్నారని మండిపడ్డారు. హారతులు పట్టి ఆంధ్రాకు నీటిని పంపిందే కాంగ్రెస్ నేతలు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్క కొత్త స్కీము అమలు చేయలేదు.. ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదు.. కానీ ఇప్పుడు అప్పు రెండు లక్షల కోట్లకు చేరింది. ఎక్కడికి పోతున్నాయి పైసలు అని నిలదీశారు. రాహుల్ గాంధీ , ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసి వేణుగోపాల్ ఖాతాల్లో టకీ టకీమని డబ్బులు పడుతున్నాయని, పేసీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ కు తెలంగాణను ఏటీఎం లాగా మార్చాడన్నారు.

Also Read: Bachupally Crime: బాచుపల్లిలో దారుణం.. భర్త గొంతు నులిమి చంపిన భార్య

 

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?